KARIMNAGAR TRS GOVERNMENT GOING TO GIVE STATE LEVEL CORPORATION CHAIRMAN POSTS TO THEIR SENIOR TRS LEADERS WHO CAME FROM KARIMNAGAR KNR PRV
TRS party: టీఆర్ఎస్లో పదవుల పండుగ.. ఆ జిల్లాకు చెందిన ఇద్దరు టీఆర్ఎస్ లీడర్లకి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులు..
శ్రీనివాస్ యాదవ్, రవీందర్ సింగ్ (ఫైల్)
బీజేపీ నాయకులు ప్రజల్లోకి బలంగా వెళుతున్నారు. దీంతో టీఆర్ఎస్ నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. తన క్యాడర్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా పార్టీలో ఏళ్లుగా సేవలందించిన లీడర్లకు పదవులు కట్టబెడుతోంది.
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ (BJP) గాలి బలంగా వీస్తోంది. అధికార టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామే అంటూ బీజేపీ నాయకులు ప్రజల్లోకి బలంగా వెళుతున్నారు. దీంతో టీఆర్ఎస్ నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. తన క్యాడర్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా పార్టీలో ఏళ్లుగా సేవలందించిన లీడర్లకు పదవులు కట్టబెడుతోంది. ఇదే కోవలో ఇపుడు కరీంనగర్ (Karimnagar)కు చెందిన ఇద్దరు టీఆర్ఎస్ లీడర్లకు అవకాశం ఇవ్వబోతోంది టీఆర్ఎస్ (TRS). జిల్లాకు చెందిన మరో ఇద్దరుటీఆర్ఎస్ నేతలకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ (Corporation Chairman) పదవులు దక్కనున్నాయి . వారం రోజుల్లోగానే వీరి నియామకాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమా చారం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకొని అధికారిక ప్రక్రియకు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది .
హుజూరాబాద్ శాసనసభ్యుడు ఈటల రాజేందర్ పై గత ఎన్నికల్లో పోటీ చేసిన టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ (Gellu Srinivas yadav)కు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని విశ్వసనీయంగా తెలిసింది . నియోజకవర్గ ఇన్ఛార్జీగా శ్రీనివాస్ యాదవ్ వచ్చే ఎన్నికల వరకు పనిచేసి సాధారణ ఎన్నికల్లో కూడా ఆయనే అభ్యర్థి అవుతాడని అందరూ భావించారు . అయితే ముఖ్యమంత్రి (CM) ఆయనకు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టాలని నిర్ణయించడంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థానానికి కాబోయే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి (Koushik Reddyy) అని తేల్చిచెప్పినట్లు భావిస్తున్నారు. కౌశిక్ రెడ్డి ఇక్కడ బలమైన అభ్యర్థి అవుతాడని భావించి ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకొని ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది .
టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ..
అలాగే కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ (Ravindar singh)కి కూడా రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది . గత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీచేసి 232 ఓట్లను సాధించారు . ఆ వెనువెంటనే ఆయన పక్షం గడవక ముందే ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ప్రగతిభవన్‌కు వెళ్లి టీఆర్ఎస్లోనే కొనసాగుతానని వెల్లడించారు . అప్పటి నుంచే ఆయనకు కార్పొరేషన్ పదవి ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఎమ్మెల్సీ ఎన్నికలకు పూర్వం ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో పర్యటించిన రెండు సందర్భాలలో రవీందర్ సింగ్‌కు రాష్ట్రస్థాయిలో మంచి అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు . ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని పార్టీ వర్గాలు భావించాయి . పార్టీలో మొదటి నుంచి అంకితభావంతో పని చేస్తూ వస్తున్న రవీందర్ సింగ్ పార్టీని కాదని వెళ్లినా మళ్లీ పిలిచి పదవి అప్పగించాలని ముఖ్య మంత్రి నిర్ణయించడం కార్యకర్తలకు పెద్దపీట వేయడమేనని అనుకుంటున్నారు . జనవరి మొదటి వారం లోనే ఆరు కార్పొరేషన్లకు చైర్మన్లను , డైరెక్టర్లను నియమించేందుకు రంగం సిద్ధమైందని ప్రచారం జరిగింది . అయితే తెలంగాణలో సంక్రాంతి వరకు పీడ రోజులుగా భావించే ఆనవాయితీ ఉన్నందున ఇప్పుడు మళ్లీ పదవుల పంపిణీకి శ్రీకారం చుట్టరు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.