హోమ్ /వార్తలు /తెలంగాణ /

Har Ghar Tiranga : దేశభక్తిని చాటుకుంటున్న ట్రాఫిక్ పోలీస్ .. సత్యనారాయణ ఆన్‌ డ్యూటీ హర్ ఘర్‌ తిరంగా

Har Ghar Tiranga : దేశభక్తిని చాటుకుంటున్న ట్రాఫిక్ పోలీస్ .. సత్యనారాయణ ఆన్‌ డ్యూటీ హర్ ఘర్‌ తిరంగా

(Patriot)

(Patriot)

Patriot: దేశ భక్తిని చాటుకోవడానికి ఎవరైతేనే...ఏ రూపంలో ప్రదర్శిస్తే ఏంటీ ప్రతి ఒక్కరిలో జాతీయ భావం, దేశభక్తి మెండుగా ఉంటే చాలు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ అలాంటి ప్రయత్నమే చేస్తూ అందరిలో స్పూర్తి నింపుతున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar, India

(P.Srinivas,New18,Karimnagar)

దేశ భక్తిని చాటుకోవడానికి ఎవరైతేనే...ఏ రూపంలో ప్రదర్శిస్తే ఏంటీ ప్రతి ఒక్కరిలో జాతీయ భావం, దేశభక్తి మెండుగా ఉంటే చాలు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్(Traffic Constable) అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. తనలో ఉన్న జాతీయ భావాన్ని అందరికి చాటుకుంటూనే వాహనదారులకు త్రివర్ణపతాకం గొప్పతనాన్ని చాటుకుంటున్నారు. ఇక ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌(Aadi ka amrit mahotsav)లో భాగంగా ఇండియన్ కోస్ట్ గార్డ్(Indian Coast Guard)సముద్రంలో కూడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

Crime news : వాగులో తల్లి, కొడుకు శవాలు .. అతడిపైనే అందరికి అనుమానాలు


దేశభక్తుడు..

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సంద్భరంగా దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య సంబరాలు జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ పేరుతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మోదీ పిలుపు మేరకు కరీంనగర్‌ జిల్లాకు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సత్యనారాయణ జాతీయ జెండా గొప్ప తనాన్ని, తనలో ఉన్న దేశభక్తిని చాటుకుంటున్నారు. ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సత్యనారాయణ జాతీయ జెండాని చేతబట్టుకొని ట్రాఫిక్‌ని క్రమ బద్దీకరిస్తున్నారు. మువ్వెన్నల జెండా గొప్పతనాన్ని వాహానదారులకి వివరిస్తూ దేశభక్తి ని చాటుకుంటున్నాడు. కానిస్టేబుల్‌ తిరంగా జెండాతో విధులు నిర్వహిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


నడి సంద్రంలో తిరంగా ..

అమృత్‌ మహోత్సవం పేరుతో దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య సంబరాలు మొదలయ్యాయి. ‘హర్‌ ఘర్‌ తిరంగా’ప్రతి ఒక్కరూ నిర్వహించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈనెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అలాగే సోషల్ మీడియాలో అకౌంట్స్ ప్రొఫైల్ ఫోటోను జాతీయ జెండాగా మార్చుకుంటున్నారు. తాజాగా ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ సైతం తమలో దాగివున్న జాతీయతను అందరికి తెలియజేశారు. సముద్రం మధ్యలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

ఉట్టిపడుతున్న జాతీయభావం..

వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన మత్య్సకారుల సహకారంతో ఇండియన్‌ కోస్టల్‌ గార్డ్‌.. రెండు పడవల మధ్య తాడు సహాయంతో జెండాను ఎగరేసి, త్రివర్ణ పతకాన్ని గౌరవించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఇలా వినూత్నంగా నిర్వహించి ప్రతి ఒక్కరిలో దేశభక్తిని మరింత పెంచుతున్నారు.

గ్రేట్ ఇండియన్స్ ..

ఇండియన్ కోస్ట్ గార్డ్ చేసిన వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రతి ఒక్కరూ వేర్వేరు గ్రూప్‌ల్లోకి షేర్ చేస్తున్నారు.

First published:

Tags: Karimnagar, Telangana News

ఉత్తమ కథలు