KARIMNAGAR TRADERS WHO TOOK LOANS AND CHEATED WOMEN BY QUOTING NOTICES FROM THE COURT KNR VB
Cheating: అప్పు ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించండి.. లేదంటే ఇక్కడ జరిగిన ఘటనే మీకూ జరగొచ్చు..
ప్రతీకాత్మక చిత్రం
Cheating: అతడు చీటీలు నడిపిస్తున్నాడు, అప్పులు కూడా చేశాడు.. తీరా డబ్బులు అడిగితే ఐపీలు పెడుతున్నాడు. ఇది పెద్దపల్లి జిల్లాలో నడిచే దాందా. ఇలా అమాయకులను మోసం చేసి.. కోట్లకు కోట్లు వసూలు చేసి.. ఉడాయిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పారిశ్రామిక ప్రాంతం లో రోజుకో ఘటన వెలుగు చూస్తోంది. మహిళల దగ్గర రూ. 2కోట్లతో ఉడాయించిన వ్యాపారి సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. గతంలో పారిశ్రామిక ప్రాంతంలో ఎంతో మంది వ్యాపారులు , చిట్టీల యజమానులు , హెూటల్ యజమానులు , ఫైనాన్సిసియర్స్ , గిరిగిరి చీటీల వ్యాపారులు ఇలా అనేక మంది రూ. కోట్లు , రూ. లక్షలు ఎగ్గొట్టిన సంఘటనలున్నాయి. అయితే సామాన్య ప్రజలను నమ్మించి కోట్లకు కోట్లు ..లక్షలకు లక్షలు తీసుకొని పారిపోతున్నారు. అనంతరం కోర్టుల ద్వారా నోటీసులు ( ఐపీ ) ఇక్కడ పంపించడం అనవాయితీగా మారుతోంది. అవసరాలున్నాయని .. వ్యాపారాలు చేస్తున్నామని .. బిల్డింగ్లు కడుతున్నామని .. భూములు కొంటున్నామని నమ్మించి లక్షలు అప్పుగా తీసుకుంటున్నారు .
తీసుకున్న వాటికి అధిక వడ్డీ ఆశ చూపి నమ్మబలుకుతున్నారు. మాయమాటలను నమ్మి ఉద్యోగం ద్వారా .. కాయ కష్టమో చేసి సంపాదించికున్న డబ్బును తీసుకుంటున్నారు . తీసుకున్న వాటికి కొన్ని నెలలు వడ్డీ రూపేణ డబ్బులు ఇస్తున్నారు. అయితే వీరు చేసిన .. చేస్తున్న లావాదేవీల్లో నష్టం వచ్చినట్టు తెలియగానే .. ఇక అక్కడి నుంచి కష్టాలు మొదలవుతున్నాయి . ఈ కష్టాల నుంచి విముక్తి పొందాలంటే ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ఇక్కడి నుంచి ఉడాయిస్తున్నారు . కొంత మంది వారు చేస్తున్న వ్యాపారాల్లో లాభాలు వచ్చినప్పటికీ డబ్బు కూడబెట్టుకొని .. నష్టాలు వచ్చాయని రేపు .. మాపు ఇస్తామని కాలం వెళ్లదీస్తున్నట్టుగా తెలుస్తోంది .
ఇటీవల గోదావరిఖని స్వతంత్రచౌక్కు చెందిన ఓ వ్యక్తి కూడా రూ .2 కోట్లతో ఉడాయించారు . అప్పట్లో ఈ సంఘటన హాట్ టాపిక్ గా మారింది . స్థానిక గణేష్ ను నగర్ కు చెందిన ఓ వ్యాపారి రూ .2 కోట్లతో ఉడాయించాడు. చుట్టుపక్కల కుటుంబాల్లోని వారికి మాయమాటలు చెప్పి ఒక్కొక్కరి వద్ద దాదాపు రూ .2 లక్షల నుంచి ఆపైన తీసుకున్నట్టుగా తెలిసింది. నాకు ఆస్తులున్నాయని .. ఫైనాన్స్ నడిపిస్తున్నానని .. డెయిలీ ఫైనాన్స్ ఇస్తున్నానని నాకు ఏం తక్కువ లేదని నమ్మబలికి లక్షలు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది .
కొంత మంది వద్ద నా భార్యాపిల్లలు , తల్లిదండ్రుల ఆరోగ్యం బాగాలేదని డబ్బులు అవసరమున్నాయని తీసుకెళ్లాడని బాధితులు బోదిబో అంటున్నట్టుగా తెలిసింది . ఈ నెల 6 వ తేదీ నుంచి ఆయన కుటుంబం సహా కనబడకుండా పోయాడని అప్పులు ఇచ్చిన వారు ఇంటి చుట్టూ తిరుగుతూ శాపనార్ధాలు పెడుతున్నారని తెలిసింది. కొంత మంది గోదావరిఖని వన్ టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసినట్టుగా తెలుస్తోంది. ఎవరైనా ఇలాంటి మోసాలు పాల్పడితే మోసగాళ్లను కటకటాల్లో పెట్టి తగిన శిక్ష వేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.