Karimnagar : అద్భుత దృశ్యం -లోయర మానేరు జలాశయంలో టోర్నడో -30ని.పాటు నింగికెగసిన నీరు -video

కరీంనగర్ జిల్లాలో టోర్నడో

Tornado At Lower Manair Dam : కరీంనగర్ జిల్లాలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. దిగువ మానేరు జలాశయం నుంచి అరగంట పాటు నీళ్లు ఆకాశంలోకి పోయాయి. టోర్నడోను తలపించే వాటర్ స్పాట్ స్థానికుల్ని కాసేపు కలవరపెట్టింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరలయ్యాయి..

  • Share this:
తెలంగాణ వ్యవసాయ రాజధాని కరీంనగర్ జిల్లాలో అరుదైన దృశ్యం కనిపించింది. ప్రఖ్యాత లోయల్ మానేరు డ్యామ్ నుంచి నీళ్లు ఆకాశంలోకి వెళ్లాయి. అమెరికాలో తరచూ వచ్చే ప్రకృతి విపత్తు టోర్నడోను పోలిన ఈ దృశ్యాలు నెట్టింట వైరలయ్యాయి. టోర్నడోలాంటి ఈ భారీ సుడిగాలిని వాటర్ స్పాట్ అంటారు. ఇదే లోయర్ మానేరు డ్యామ్ లో ఐదేళ్ల కిందట కూడా ఇలాంటి టోర్నడోనే అందర్నీ భయపెట్టింది..

కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలోని వచ్చునూర్‌ గ్రామ శివారులో.. దిగువ మానేరు జలాశయం బ్యాక్ వాటర్ లో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. శనివారం సాయత్రం ఒక్కసారిగా సుడిగాలిలా ప్రారంభమై నిమిషాల్లోనే పెద్దదయి నీళ్లు ఆకాశంలోకి వెళ్లాయి. ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన గ్రామస్థులు సెల్ ఫోన్లలో రికార్డు చేశారు..



లోయర్ మానేరు డ్యామ్ లో టోర్నడో తరహా వాటర్ స్పాట్ తలెత్తడం ఇది రెండోసారి. 2016 జూలై 31న ఇదే జలాశయం నడి మధ్యలో వాటర్ స్పాట్ ఏర్పడింది. ఆ పాత వీడియో ఇది..



ఐదేళ్ల కిందట లోయర్ మానేరులో వాటర్ స్పాట్ తలెత్తినప్పుడు జలాశయంలో చేపల వేటకు వెళ్ళిన మత్య్స కారులు భయంతో తీరానికి వచ్చారు. తాజాగా వచ్చునూరు గ్రామ సమీపంలోని టొర్నడోను చూసిన జనం కాసేపు ఆందోళకు గురయ్యారు. దాదాపు 30 నిమిపాలపాటు జలాశయంలోని నీరు ఆకాశంలోకి వెళ్లినట్లు స్థానికులు చెప్పారు.
Published by:Madhu Kota
First published: