హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana | Accident : ముగ్గురు స్నేహితుల్ని వదలని మృత్యువు .. ఆ ఒక్క క్షణంలో జరిగిన ఘోరం

Telangana | Accident : ముగ్గురు స్నేహితుల్ని వదలని మృత్యువు .. ఆ ఒక్క క్షణంలో జరిగిన ఘోరం

చావులో కూడా కలిసే

చావులో కూడా కలిసే

Tragic incident:స్నేహం బంధం ఎంతో బలమైనది. ఎవరూ విడదీయలేనిది కూడా. ఏ స్థాయిలో ఏర్పడిన స్నేహమైన చచ్చే వరకు కొనసాగుతూనే ఉంటుంది. కాని ఆ ముగ్గురు విషయంలో మాత్రం చావులో కూడా స్నేహం విడిపోలేదు. కాలేజీ సరదాగా గడిపి ఇంటికెళ్లే క్రమంలోనే మృత్యువు ముగ్గురు స్నేహితుల్ని కానరాని లోకాలకు తీసుకెళ్లింది.

ఇంకా చదవండి ...

(P.Srinivas,New18,Karimnagar)

డిగ్రీ చదువుతున్న ముగ్గురు స్నేహితులు సరదాగా కాలేజీ వార్షికోత్సవానికి వెళ్లారు. అక్కడ అందరితో సరదాగా గడిపారు. తోటి స్నేహితులతో కలిసి డ్యాన్స్‌లు , జోకులతో జీవితానికి సరిపడ సంతోషాన్ని అనుభవించారు. కాలేజీ వార్షికోత్సవ వేడుకలు ముగియగానే ఇంటికి బయల్దేరారు. ఈ గ్యాప్‌లోనే వారిని మృత్యువు వెంటాడం జరిగింది. ప్రాణస్నేహితులుగా ఉన్న ముగ్గుర్ని చివరకు చావు కూడా విడదీయలేకపోయింది. మంచిర్యాల(Manchiryala) జిల్లా కొత్తపల్లి(Kottapalli) మండలం చింతకుంట(Chintakunta)దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను వెనుక నుంచి వస్తున్న ఓ బొలెరో వాహనం ఢీకొట్టింది. యాక్సిడెంట్ జరిగిన సమయంలో బైక్‌పై ముగ్గురు యువకులు ఉన్నారు. అందులో ఇద్దరు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం(Tuesday)మృతి చెందాడు. మృతులు ముగ్గురు 20సంవత్సరాల లోపు వాళ్లే కావడం విశేషం. మృతుల్లో మహేష్(Mahesh)డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. కొత్తపల్లి మండలం లక్ష్మీపూర్(Lakshmipur)గ్రామానికి చెందిన తుర్పాటి రాజయ్య(Rajayya)నాగమణి(Nagmani)ఇద్దరు కూలీ పని చేసుకుంటూ కొడుకుని చదివిస్తున్నారు.

మృత్యువులో కూడా కలిసే..

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగుకు చెందిన పడిగెల విష్ణువర్ధన్ కుటుంబం జీవనోపాధి నిమిత్తం కరీంనగర్‌కు వచ్చారు. కమాన్ ప్రాంతంలో అద్దెకు ఉంటున్నారు . తల్లి గంగవ్వ కూలీ పని చేసుకొని బిడ్డను చదివిస్తోంది. మూడో వ్యక్తి వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన హర్షవర్ధర్ తెలంగాణ చౌక్ సమీపంలోని డిగ్రీ కళాశాలలో బీకాం ఫస్ట్ ఇయర్‌ చదువుతున్నాడు.

(చావులో కూడా కలిసే )
(చావులో కూడా కలిసే )

స్నేహితుల్ని విడదీయలేని చావు..

ఈ ముగ్గురు కలిసి సోమవారం కాలేజీలో జరిగిన వార్షికోత్సవ వేడుకలకు మహేష్ ద్విచక్రవానంపై వెళ్లారు. తిరిగి వస్తుండగా చింతకుంట నుంచి లక్ష్మీపూర్‌కి వేళ్లే క్రమంలో బొలెరో ఢీకొట్టింది.ప్రమాదంలో మహేష్ , విష్ణువర్ధన్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. హర్షవర్ధన్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. చనిపోయిన ముగ్గురిలో ఇద్దరు తల్లిదండ్రులకు ఒక్కరే కొడుకు కావడం ప్రమాదంలో వాళ్లు చనిపోవడంతో కుటుంబ సభ్యుల బోరున విలపించడం అందర్ని కలచి వేసింది. ఒక్క యాక్సిడంట్‌తో మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

మృత్యుప్రయాణం..

స్నేహం బంధం ఎంతో బలమైనది. ఎవరూ విడదీయలేనిది కూడా. ఏ స్థాయిలో ఏర్పడిన స్నేహమైన చచ్చే వరకు కొనసాగుతూనే ఉంటుంది. కాని ఆ ముగ్గురు విషయంలో మాత్రం చావులో కూడా స్నేహం విడిపోలేదు.ముగ్గురు మిత్రులు ఒకే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఆ ముగ్గురు కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని నింపింది.

First published:

Tags: Manchirala, Road accident

ఉత్తమ కథలు