KARIMNAGAR THEY ARE COOKING OUTSIDE THE HOUSE AS THE HOUSE IS ON FIRE EVERY DAY KNR VB
Peddapalli: ఆమె అక్కడ వంట ఎందుకు చేస్తుందో తెలుసా.. ఆమె ఇంట్లో జరిగే ఘటనలతో ఊరంతా ఆశ్చర్యం..
ఇంటి ఆవరణలో వంట చేస్తున్న మహిళ
Peddapalli: ఓ ఇంటిలో ప్రతీ రోజు మంటలు వ్యాపిస్తున్నాయి. దీంతో ఆ ఇంటిలో రోజూ ఎదో ఒక వస్తువు కాలిపోతుంది. ఏ జరుగుతుందో తెలియని ఆ ఇంటి సభ్యులు ఇంటి బయట ఆవరణలో వంట వండుకోవడం ప్రారంభించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పెద్దపెల్లి జిల్లా, ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలో కన్నె వెంకటమ్మ, నాంపల్లి నివసిస్తున్నారు. ఎప్పిటిలాగే వాళ్లంతా ఇంట్లో ఆ రోజు భోజనం చేశారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఇంట్లో మంటలు వ్యాపించాయి. ఆ మంటలకు గడ్డివాము దగ్ధం అయింది. షార్ట్ సర్క్యూట్ ద్వారా ఇలాంటి మంటలు వ్యాపిస్తున్నాయి అని అందరూ అనుకున్నారు. ఇది జరిగి 13 రోజులు అయింది. తర్వాత మరుసటి రోజు ఇంట్లో మరోసారి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
ఈ సారి ఇంట్లోని బెడ్డు, ఇతర సామాన్లు కాలిపోయాయి. దీంతో ఇంట్లో వాళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంట్లో ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తర్వాత వాళ్లు ఇంట్లో భయం భయంగానే గడిపారు. మూడో రోజు కూడా ఇలానే మంటలు వ్యాపించడంతో టీవీ దగ్ధం అయిపోయింది. దీంతో వాళ్లు ఎక్కడ నుంచి మంటలు వ్యాపిస్తున్నాయో అర్థం గాక ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఇలా ప్రతిరోజు ఆ ఇంటిలో మంటలు వ్యాపించి ఏదో ఒకటి కాలి బూడిద అవుతుండడంతో భయాందోళనకు గురయ్యారు.
ఇలా 13 రోజులుగా వాళ్లు రోడ్డు పైనే వంట చేసుకొని అక్కడే పడుకోవడం జరుగుతుందని బాధితులు తెలిపారు. ఇలా ఎందుకు అవుతుందని ఊరు ఊరంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంటి కింద ఏదైనా లావ ఉందన్న కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించాలని బాధితులు కోరుతున్నారు.
ఇదిలా ఉండగా.. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆ ఘటన తర్వాత బాధిత బాలిక హైదరాబాద్ లోని నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా..బాలికను, కుటుంబసభ్యులను ఆసుపత్రికి వెళ్లి కేటీఆర్ పరామర్శించారు.
ఇటువంటి ఘటనలు జరగడం బాధకరమని.. నిందితులు ఎవరైనా కఠిన శిక్ష పడాల్సిందే అని అన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం.. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆ బాలికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.