హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimnagar: ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి..తల్లిదండ్రుల కర్కశత్వం..అత్తింటి నుంచి అపహరించి ఏం చేశారంటే?

Karimnagar: ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి..తల్లిదండ్రుల కర్కశత్వం..అత్తింటి నుంచి అపహరించి ఏం చేశారంటే?

ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి..తల్లిదండ్రుల కర్కశత్వం

ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి..తల్లిదండ్రుల కర్కశత్వం

తమ ఇష్టాన్ని కాదని, వేరే యువకుడిని పెళ్లాడిన కుమార్తె పట్ల ఆమె తల్లిదండ్రులు కర్కశంగా ప్రవర్తించారు. కన్నబిడ్డ అనే మమకారాన్ని కూడా మరచి ఆమెను అత్తింటి నుంచి అపహరించారు. తీవ్రంగా కొట్టి కారులో తీసుకెళ్తూ శిరోముండనం చేశారు. రాత్రంతా ఆమె మనుసు మార్చేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో చివరకు వదిలిపెట్టారు. కన్నోళ్లు ఎన్ని హింసలు పెట్టినా చివరికి కట్టుకున్నోడే కావాలంటూ ఆ యువతి పోలీసు స్టేషన్ కు చేరింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Karimnagar

(జగిత్యాల జిల్లా, శ్రీనివాస్.పి, న్యూస్ 18 తెలుగు ప్రతినిధి)

తమ ఇష్టాన్ని కాదని, వేరే యువకుడిని పెళ్లాడిన కుమార్తె పట్ల ఆమె తల్లిదండ్రులు కర్కశంగా ప్రవర్తించారు. కన్నబిడ్డ అనే మమకారాన్ని కూడా మరచి ఆమెను అత్తింటి నుంచి అపహరించారు. తీవ్రంగా కొట్టి కారులో తీసుకెళ్తూ శిరోముండనం చేశారు. రాత్రంతా ఆమె మనుసు మార్చేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో చివరకు వదిలిపెట్టారు. కన్నోళ్లు ఎన్ని హింసలు పెట్టినా చివరికి కట్టుకున్నోడే కావాలంటూ ఆ యువతి పోలీసు స్టేషన్ కు చేరింది.

ఇది చదవండి: నల్లమలలో గుప్త నిధుల తవ్వకాలు.., నిధి దొరికిందా..? పురాతన ఆలయాల వద్ద ఏం జరుగుతుంది..?

జగిత్యాలలో ఆదివారం రాత్రి కలకలం సృష్టించిన ఈ అపహరణ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. జగిత్యాల గ్రామీణ పోలీసుల కథనం మేరకు..జగిత్యాల జిల్లా గ్రామీణ మండలం బాలపల్లికి చెందిన జక్కుల మధు (23), రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన జువ్వాజి అక్షిత (20) ప్రేమించుకున్నారు. యువతి తల్లిదండ్రులు నిరాకరించడంతో రహస్యంగా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అక్షిత అత్తవారి ఇంట్లో ఉండగా ఆదివారం సాయంత్రం రెండు కార్లలో వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు మధు కుటుంబంపై దాడిచేసి యువతిని అపహరించుకుపోయారు.

ఇది చదవండి: ఏజెన్సీలో లంపిస్కిన్ వ్యాధి కలవరం.. పశువైద్యుల సూచనలు ఇవే..!

కారులో బలవంతంగా తీసుకెళ్తూ వారు యువతిని తీవ్రంగా కొట్టారు. ఆమె కేకలు వేస్తున్నా వదలకుండా శిరోముండనం చేశారు. సోమవారం జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న యువతి జరిగిన ఘాతుకాన్ని పోలీసులకు వివరించింది. ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎస్సై అనిల్ న్యాయం చేస్తామని బాధితురాలికి హామీ ఇచ్చారు. యువతిని ఇప్పటికే ఆమె భర్తకు అప్పగించామని, ఆమె తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఒడిత సాయంతో రాయి పెట్టి కొడితే కోతులు పరార్.. అసలు ఒడిత అంటే తెలుసా..?

యువతి తల్లిదండ్రులు నిరాకరించడంతో రహస్యంగా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అక్షిత అత్తవారి ఇంట్లో ఉండగా ఆదివారం సాయంత్రం రెండు కార్లలో వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు మధు కుటుంబంపై దాడిచేసి యువతిని అపహరించుకుపోయారు. కారులో బలవంతంగా తీసుకెళ్తూ వారు యువతిని తీవ్రంగా కొట్టారు. ఆమె కేకలు వేస్తున్నా వదలకుండా శిరోముండనం చేశారు. సోమవారం జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న యువతి జరిగిన ఘాతుకాన్ని పోలీసులకు వివరించింది.

ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎస్సై అనిల్ న్యాయం చేస్తామని బాధితురాలికి హామీ ఇచ్చారు. యువతిని ఇప్పటికే ఆమె భర్తకు అప్పగించామని, ఆమె తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

First published:

Tags: Karimnagar, Love marriage, Telangana

ఉత్తమ కథలు