హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimnagar: పరీక్ష రాస్తుండగా రచయితకు వింత అనుభవం..ఏంటో తెలుసా?

Karimnagar: పరీక్ష రాస్తుండగా రచయితకు వింత అనుభవం..ఏంటో తెలుసా?

పరీక్ష రాస్తుండగా రచయితకు వింత అనుభవం

పరీక్ష రాస్తుండగా రచయితకు వింత అనుభవం

కరీంనగర్ రచయితకు వింత అనుభవం ఎదురైంది. పీహెచ్ డీ కోసం పరీక్ష రాస్తుండగా..తను రాసిన పుస్తకంలోంచే ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇది చూసిన ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మీరు ఎప్పుడైనా ఒక పరీక్ష రాస్తున్నారు అనుకోండి. ఆ పరీక్షలో ఇచ్చిన ఓ ప్రశ్న మీరు రాసిన పుస్తకంలో నుంచి వచ్చింది అనుకోండి. ఎంత వింతగా ఉంటుంది? అలాగే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. అలాంటి సంఘటనే ఇటీవలే కరీంనగర్ రచయితకు ఎదురైంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar | Hyderabad

(P.Srinivas,New18,Karimnagar)

కరీంనగర్ రచయితకు వింత అనుభవం ఎదురైంది. పీహెచ్ డీ కోసం పరీక్ష రాస్తుండగా..తను రాసిన పుస్తకంలోంచే ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇది చూసిన ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మీరు ఎప్పుడైనా ఒక పరీక్ష రాస్తున్నారు అనుకోండి. ఆ పరీక్షలో ఇచ్చిన ఓ ప్రశ్న మీరు రాసిన పుస్తకంలో నుంచి వచ్చింది అనుకోండి. ఎంత వింతగా ఉంటుంది? అలాగే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. అలాంటి సంఘటనే ఇటీవలే కరీంనగర్ రచయితకు ఎదురైంది.

TS News: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పాదర్శకత కోసమే ఇదంతా..

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ కవి, రచయితకు ఇలాంటి ఓ వింత అనుభవం ఎదురయింది. ఆ రచయిత పేరు పెద్దింటి అశోక్ కుమార్ ఆయన రచించిన పలు పుస్తకాలు, కథలు ప్రస్తుతం వివిధ యూనివర్సిటీలలో పొందుపరిచిన పాఠ్యాంశాలుగా సిలబస్ లో ఉన్నాయి. ఇక ఇప్పటికే దాదాపు మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీలు 6, నాలుగు పీహెచీలు పొందిన ఘనత పెదింటి అశోక్ కుమార్ సొంతం. అయితే సాహిత్యానికి సంబంధించిన తెలుగులో డాక్టరేట్ కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్డ్ పరీక్షలు రాస్తున్నారు. అయితే అందులో భాగంగా జరిగిన ఓ పరీక్షలో తను రాసిన జిగిరీ నవల పైనే ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నకి సమాధానం ఇస్తే ఏకంగా 25 మార్కులు కేటాయించారు.

ఇది చదవండి: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై డెడ్ లైన్.. అధికారులకు కలెక్టర్ ఆదేశం

పరీక్ష పత్రాన్ని తయారు చేసిన వారు. పెద్దింటి అశోక్ కుమార్ ఈ విషయాన్ని సన్నిహితులతో పంచుకున్నారు. నవలలు, కథల సబ్జెక్టుకు సంబంధించి రెండవ పేపర్ విభాగంలో మొత్తం 8 ప్రశ్నలు ఇవ్వగా అందులో నాలుగింటికి సమాధానం రాయాలని సూచించారు. ఇక తను రాసిన జిగిరి నవల గురించి అందులోని పాత్రల గురించి వివరించాలంటూ అందులో పేర్కొనడంతో ఆయన ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నారు. రాసింది తనే కాబట్టి ఆ ప్రశ్నని చాయిస్ కింద వదిలేసి మిగతా వాటి గురించి రాశారు. అయితే ఇలాంటి అనుభవం అత్యంత అరుదుగా రచయితలకు కలుగుతూ ఉంటుందని..ఆ సమయంలో ఆనందానికి ఆశ్చర్యానికి లోనయ్యానని పెద్దింటి అశోక్ కుమార్ తెలిపారు.

గతంలో కూడా ఇలానే కరీంనగర్ ప్రభుత్వం మహిళా డిగ్రీ కళాశాలలో చదువుకున్న విద్యార్థులే..కొన్ని సంవత్సరాల తర్వాత అదే కాలేజీకి లెక్చరర్ గా రావడం.. ఇలా ఒకరిద్దరు కాకుండా 7గురు  మహిళా లెక్చరర్ గా అదే కాలేజీలో విధుల్లో చేరారు. ఇలా తమ కాలేజీలో తము వర్క్ చేయడం చాలా ఆనందాన్ని సంతృప్తినిచ్చిందని మహిళ లెక్చరర్ తెలిపారు. కష్టపడి చదివితే కానిది ఏది లేదని నిరూపించారు.

First published:

Tags: Hyderabad, Karimnagar, Telangana

ఉత్తమ కథలు