(P.Srinivas,New18,Karimnagar)
అనారోగ్యంగా ఉంటే ఆసుపత్రికి ప్రాణాలు పోతే కాటికి తీసుకెళ్లడం సహజం. కానీ , ప్రాణాలతో వుండగానే కట్టుకున్న భార్య, కన్న కూతురే స్వయంగా కన్న తండ్రిని స్మశానం తీసుకెళ్లడం ఎక్కడైనా చూసారా. ఇంత ఒడిగట్టాడానికి కారణమేమిటి. ఇంతకీ ఎక్కడ జరిగింది ఈ దుర్మార్గమైన ఘటన. దౌర్భాగ్యానికి ప్రాణాలతో వుండగానే స్మశానంలో శవంలా బతికి చనిపోయిన దీనుడి దీనగాధపై న్యూస్ 18 తెలుగు ప్రత్యేక కథనం..
కరీంనగర్ జిల్లా కేంద్రంలో మానవజాతి సిగ్గుతో తలదించుకునే సంఘటన ఒకటి ఆలస్యంగా వెలుగు చూసింది. అనారోగ్యంతోఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక అభాగ్యురాలయిన ఓ భార్య, తన అవిటి కూతురు కలిసి ఇద్దరు అబలలు కట్టుకున్న భర్తను, కన్నతండ్రిని ప్రాణం వుండగానే దిక్కుతోచని స్థితిలో స్మశానానికి తరలించారు. ఇక బతికుండగానే చావులను కళ్ళారా చూస్తూ స్మశానంలోనే 24 గంటలు క్షణక్షణం నరకయాతన అనుభవించి విడిచిన ఓ అభాగ్యుడి యధార్థ గాధ యావత్ ప్రపంచం నివ్వెరపోయేలా ఉంది. బతికుండగానే కాటికి తరలించిన భార్య , కూతురులు ప్రత్యక్షంగా చూపించారు. ఇక ఘోరకలికి కుటుంబీకుల నిస్సహాయ స్థితికి కారణం వింటే నిజంగా సభ్యసమాజానికే తలవంపులు తెచ్చేలా ఉంది. కేంద్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన హృదయం ఉన్న ఎవ్వరినైనా ఇట్టే ద్రవింప చేస్తుంది.
కరీంనగర్ పట్టణంలో బస్వరాజు కనుకయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. అప్పటికే రెండు కిడ్నీలు చెడిపోయిన కారణంగా జబ్బు ముదిరిందని వైద్యులు బతకడం కష్టం అని చెప్పారు. ఇక పేదరికం కారణంగా ఖరీదైన హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకోలేని దీనస్థితి. ఇక దర్మాసుపత్రిలో వైద్యం చేసినా ఫలితం లేదనడంతో చేసేదేమీ లేక కిరాయి ఇంటికి తీసుకెళ్లడానికి నిర్ణయించారు. కానీ అప్పుడే వారికి ఊహించని షాక్ తగిలింది. యుముడి ఇంటి ఓనరు రూపంలో ఇంటికి తీసుకురావద్దని హుకుం జారీ చేశాడు. ఉన్న ఒక్క మగదిక్కు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటే అతను భార్య ఇద్దరూ కూతుర్లు ఏం చేయాలో దిక్కుతోచక బిక్కుబిక్కమంటూ పుట్టెడు దుఖంతో వేరే దారి లేక ఆ ఇద్దరు కూతుర్లు కన్న తండ్రిని కట్టుకున్న భర్తను ఆ భార్య కాటికి తీసుకొచ్చారు. ఆ పక్కనే శవాలు కాలుతున దృశ్యాల చూస్తూ నిశ్చేష్టుడయిన బతికి వుండగానే కనుకయ్య స్మశానంలో 24 గంటలు చావును ప్రత్యక్షంగా చూసి తనువు చాలించాడు.
ఇక అతని భార్య , ఇద్దరు కూతుర్లు ఉండీ కూడా ఏం చేయలేని దుస్థితిలో పరిస్థితిని కుమిలి తల్చుకుంటూ ఏడుస్తుండడం ఇంతకన్నా విషాదకర ఘటన కన్నా ఇంకా ఏమి ఉండదేమో అనిపించక మానదు. ఆ భార్య బిడ్డల దుస్థితిని చూస్తే..ఇక అందులో ఆ ఆవిటి కూతురు వ్యధ చూస్తే ఎవరికైనా కన్నీటి పర్యంతం కావడం ఖాయం. ఇక ఇంతటి కష్టం పగ వాడికి కూడా రాకూడదు అని అనుకునేలా ఉన్న ఈ ఘటన కరీంనగర్ పట్టణంతో పాటు జిల్లాలో కలకలం రేపుతోంది. చావెంటో బతికుండగానే కళ్ళారా చూసిన బస్వరాజు కనుకయ్య ఇప్పుడు కీర్తిశేషుడయాడు. తన దుస్థితికి కీ కారణమైన చెడిపోయిన కిడ్నీలకు వైద్యం చేయించుకోలేక మృత్యువాత పడ్డారు. ఇక వుండగానే ప్రాణాలతో స్మశానానికి తరలించడంతో చావును బతికి వుండగానే కళ్ళారా చూసాడు. ఇక తన కథ కూడా ఇంతెనని తెల్సుకుని నరకయాతన అనుభవించి మృత్యువు ఒడిలోకి చేరాడు. కనుకయ్య కథ కంచికి చేరింది. ఇక ఇంటి ఓనరు కారణంగా ఆ ఇద్దరు కూతుర్లు , విధవ అయిన భార్యా ఆ స్మశానంలోనే పది రోజులు ఉంటున్నారు. ఇల్లు రోజులుగా మైల పడడానికి వీలు లేదు. ముట్టుడుతో ఇంట్లోకి రాకూడదు అని ఓనర్ చెప్పడంతో దిక్కులేని ఆ ముగ్గురు మహిళలు అదే స్మశానంలో కాలుతున్న శవాల మధ్య సహవాసం చేస్తున్నారు. తండ్రి కనుకయ్యా చచ్చిపోయి బతికితే బతికిన భార్య అవిటి కూతురు మాత్రం బతికినా చావు నరకం చవిచూస్తున్నారు. ఇక పెళ్ళైన పేదరాలే కావడం...ఇక మరో కూతురుకు అగ వైకల్యం బతుకెలా వెళ్లదీయాలో తెలియని దీన దైన్యస్తితిలో ఉన్నారు.
ఇక తన తల్లిని పోషిస్తానని అంటున్న ఆ అవిటి కూతురు తనకో దారి చూపాలని కనిపించిన వారందరినీ వేడుతోంది దీనంగా. ఇక కడు దౌర్భాగ్యుల దీనస్థితి మాత్రం కడు దయనీయంగా ఉంది. రాస్తే మరో సీత కష్టాల నవ రామాయణం..వింటే మరో బతుకు దగా మహా భారతం సమ సమాజంలో దారుణ మారణ వికృతంగా ఖాండ...విధి వెక్కిరించిన విగతజీవుల వ్యధ. ఈ యధార్థ గాధలో తండ్రిని కోల్పోయిన భాద ఓ వైపు ఇంటి ఓనర్ రానీయని భాద మరోవైపు ఇక ఉన్న ఒక్క మగదిక్కు దూరమైన విషాదం ఇంకోవైపు కుటుంబంను వెంటాడుతోంది. బతుకుబారం వెంటాడుతోంది. రేపటిరోజు గడిచేదెలా అని మధనపడుతున్న అబలల కన్నీటి కష్టాలను తీర్చే ఆపన్న హస్తం వారి కష్టాలను తీర్చి కాస్త ఓదార్పు అందించాలనే లక్ష్యంసామాన్యుల స్వరం వినిపిస్తోంది. ఇక ఈ గాథను చూసిన స్పందించే ప్రతి ఒక్క హృదయానికి నిలువెల్లా కృతజ్ఞతలు తెలుపుతుంది. ఈ ఒక్క సంఘటనే కాదు. ఇలాంటి సంఘటనలు కరీంనగర్ లో రోజురోజుకు మితిమీరుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karimnagar, Telangana, Telangana News