హోమ్ /వార్తలు /తెలంగాణ /

karimnagar : ఒక్కటైన గులాబీ మంత్రులు..తమ మధ్య ఏమీ లేదంటూ చెట్టాపట్టాల్ వేసుకున్న నేతలు

karimnagar : ఒక్కటైన గులాబీ మంత్రులు..తమ మధ్య ఏమీ లేదంటూ చెట్టాపట్టాల్ వేసుకున్న నేతలు

చాలా రోజుల తర్వాత ఒకే వేదికపై మంత్రి ఈటల రాజేందర్ గంగుల కమాలకర్

చాలా రోజుల తర్వాత ఒకే వేదికపై మంత్రి ఈటల రాజేందర్ గంగుల కమాలకర్

karimnagar politics : ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికార పార్టీ రాజకీయాలు గాడిన పడ్డాయా.. ఇద్దరు మంత్రుల మధ్య సయోధ్య కుదిరిందా..ఇన్నాళ్లు ఎడ మోహం పెడమోహం గా ఉన్నా ఆ మంత్రులు తిరిగి ఒకే వేదిక మీదకు ఎందుకు వచ్చారు.. పార్టీ సీనియర్ నాయకుడు , ఇటివలే మంత్రి పదవి దక్కించుకున్న నాయకుల మధ్య భేదాభిప్రాయాలు ఎలా తగ్గిపోయాయి..

ఇంకా చదవండి ...


బంగారం, భారీకాయం ఉంటే నాయకులు కారు...ప్రజలకు సేవ చేసేవారే నాయకులు అవుతారు.... తాము కూడ గులాబీ పార్టీకి ఓనర్లమే అనే వ్యాఖ్యలు టీఆర్ఎస్ మంత్రి సీనియర్ నేత ఉద్యమకారుడు ఈటల రాజేందర్ నోటినుండి వచ్చిన తూటాలు..అయితే ఈ తూటాలు ఎవరిని ఉద్దేశించి వదిలారో.. రాష్ట్ర ప్రజలకు అందరికి తెలుసు..కరీంనగర్ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తనదంటూ ఓ ముద్ర వేసిన ఈటల రాజేందర్ రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభావం తగ్గిందని పార్టీ కార్యకర్తలు , ఆయన సన్నిహితులు భావిస్తున్నారు.

ఇందుకు కారణం జిల్లా రాజకీయాలే అని చెప్పక తప్పదు.. కరీంనగర్ ‌లో ఓవైపు మంత్రి కేటీఆర్ మరోవైపు ఈటల ఇద్దరే ఇన్నాళ్లు తమ అధికారాన్ని చలాయించారు. కొత్త ప్రభుత్వం తర్వాత మరో ఇద్దరికి సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే..ఎంపీగా కవిత ఓటమి తర్వాత రాష్ట్రంలో సామాజికంగా మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో కవిత ఓటమికి కారణమని భావిస్తున్న సామాజిక వర్గానికి చెందిన మున్నూరు కాపు నేత గంగుల కమలాకర్‌కు మంత్రి పదవిని సీఎం కట్టబెట్టారు.

ఒక్కటైన గులాబీ మంత్రులు

దీంతో అప్పటి నుండి అటు ఈటల ప్రభావం తగ్గుతుందనే ప్రచారం జోరందుకుంది. ఇంకా ఈటల బెర్తు కూడ ఉండదని గుసగుసలు వినబడ్డాయి. కాని అవేవి కొన్నాళ్లు బయటకు రాలేదు. చివరకు మంత్రి ఈటల తన ఆవేదనను పలు వేదికల్లో వెళ్లగక్కారు. పార్టీ అధినేత సీఎం కేసీఆర్ తోపాటు స్థానికంగా తనకు అడ్డువస్తున్న మంత్రి గంగుల కమాలాకర్ లకు షాక్‌లు ఇచ్చారు. గులాబి పార్టీకి తాము కూడ ఓనర్లమే అంటూ సీఎం కేసీఆర్ కు, బంగారం , భారీకాయం అంటూ మంత్రి గంగుల కమాలాకర్‌కు చెక్ పెట్టారు. దీంతో ఇద్దరి మధ్య కొన్నాళ్లుగా సంఖ్యత కొరవడింది. జిల్లాలో జరిగే కార్యక్రమాలకు ఎవరికి వారే అన్నట్టు వ్యవహరించారు. మంత్రి ఈటల కూడ తన నియోజవర్గానికి పరిమితమై పోయాడు. దీంతో అసమ్మతి పోరు మరింత పెరిగినట్టయింది.

ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్న మంత్రులు

అయితే తాజాగా కరీంనగర్ పట్టణంలో శుక్రవారం జరిగిన పలు కార్యక్రమాల్లో మంత్రి గంగుల కమాలాకర్ తోపాటు మంత్రి ఈటల రాజేందర్ ప్రత్యక్షమయ్యారు. పలు కార్యక్రమాల్లో పాల్గోని కార్యకర్తలకు షాక్ ఇచ్చారు. తమ మధ్య ఏలాంటి భేదాభిప్రాయాలు లేవన్నట్టుగా వ్వవహరించారు. దీంతో కరీంనగర్ జిల్లాలో రాజీకీయం రంగు మారిందనే వార్తలు వినబడుతున్నాయి. ఇద్దరు నేతలు ఒక్కటికి కావడంలో మతలబు ఏంటని ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఇద్దరి సంఖ్యత ఇన్నాళ్లు ఎమైందనే సందేహాలు వెలిబుచ్చుతున్నారు. ఏది ఏమైనప్పటికి మొహమాటాలు పక్కన పెట్టి పార్టీ పరంగా జిల్లాను అభివృద్ధి చేయాలనీ ప్రజలు కోరుతున్నారు.

శంకుస్థాపన చేస్తున్న మంత్రి ఈటల రాజేందర్

First published:

Tags: Eetala rajender, Gangula kamalakar, Karimangar, Trs

ఉత్తమ కథలు