హోమ్ /వార్తలు /తెలంగాణ /

OMG: ఓరి దేవుడో.. కరీంనగర్​లో పీక్స్​కి వెళ్లిన మూఢనమ్మకం.. మరీ ఇంత దారుణమా? 

OMG: ఓరి దేవుడో.. కరీంనగర్​లో పీక్స్​కి వెళ్లిన మూఢనమ్మకం.. మరీ ఇంత దారుణమా? 

ఆలయం వద్ద గుట్టపై బాలుడిని కట్టేసిన చిత్రం

ఆలయం వద్ద గుట్టపై బాలుడిని కట్టేసిన చిత్రం

గత కొన్ని సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడేవారిని , మానసిక రోగులను జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి కి ఆలయ పరిధిలో కొన్ని రోజులపాటు బంధించి బస చేస్తే బాగుపడుతారన్న మూఢ నమ్మకం ఆశ్చర్యం కలిగిస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar, India

(Srinivas, News18, Karimnagar)సైన్స్ రాకెట్లా దూసుకుపోతున్న  ఈ కాలంలో మూఢనమ్మకాలు (Superstitions) వదలడం లేదు.  గత కొన్ని సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడేవారిని , మానసిక రోగులను (The sick and the mentally ill ) జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి (Anjaneyaswamy temple in Kondagattu) కి ఆలయ పరిధిలో కొన్ని రోజులపాటు బంధించి బస చేస్తే బాగుపడుతారన్న మూఢ నమ్మకం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ పని వారిని మరింత అనారోగ్యానికి గురిచేస్తోంది .. మానసిక రోగులను కుటుంబ సభ్యులు కొండగట్టు ప్రాంతానికి తీసుకొచ్చి వదిలేసి వెళ్లిపోవడంతో కొంత కాలంపాటు ఇక్కడికి వచ్చే భక్తులను అడుక్కొని జీవనం సాగిస్తున్నారు. చివరికి అనారోగ్యం బారిన పడి మృతి చెందుతున్నారు .
కొండగట్టులో గుర్తు తెలియని వ్యక్తులు
అనారోగ్యం లేదా మానసిక రోగులు చనిపోతే పోలీసులు గుర్తు తెలియని వ్యక్తుల శవాలుగా పేర్కొంటూ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఖననం చేయడం సర్వ సాధారణంగా మారింది . దాదాపు మూడు నెలల క్రితం నిర్మల్ (Nirmal) జిల్లా రాజురా గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు మానసిక వ్యాధితో బాధపడుతుంటే సమీప బంధువులు అతడి కాళ్లకు ఇనుప సంకెళ్లు అమర్చి కొండగట్టు ప్రాంతంలో వదిలివెళ్లిన సంఘటన  (Superstitions) పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు


గతంలో jagityal కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం (Anjaneyaswamy temple in Kondagattu)  ముందు మానసిక రోగులను గొలుసులతో బంధించి కొండగట్టు ప్రాంతంలో వదిలేసి వెళ్లడంవల్ల వారు కొంతకాలం భక్తులను అడుక్కొంటూ జీవిస్తూ చివరికి అనారోగ్యం బారిన పడి చనిపోవడం లేదా రోడ్డు ప్రమాదాల్లో గుర్తు తెలియని వ్యక్తిగా మృతి చెందడం జరుగుతుందని స్థానికులు తెలిపారు . ఈ విధంగా ప్రతి నెలా ఇద్దరు , ముగ్గురు వ్యక్తులు మరణిస్తుంటారని , వారికి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలోనే ఖననం చేయిస్తుంటామని సర్పంచి బద్దం తిరుపతిరెడ్డి తెలిపారు . మానసిక రోగులను క్రమం తప్పకుండా సంబంధిత ఆసుపత్రులకు తీసుకెళ్లి చికిత్స చేయిస్తే ఆరోగ్యవంతులవుతారని మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు .
Talking parrot: ఈ చిలుక మామూలుది కాదండోయ్​.. అలిగి ఇంటి నుంచి పారిపోయింది.. ఎందుకు అలిగిందంటే..?  
గతంలో కొండగట్టులో నిత్యం పదుల సంఖ్యలో మానసిక రోగులను ఆలయం ముందు చెట్టుకు బంధించేవారు . వారి పరిస్థితిని గమనించిన అప్పటి జిల్లా కలెక్టర్​ సుమితాడావ్రా మానసిక రోగులను నిర్బంధించడం చట్ట విరుద్ధమని , వారిని మానసిక చికిత్సా కేంద్రాలకు  తరలించాలని ఆదేశించడంతో అధికారులు స్పందించారు . అప్పటి నుంచి మానసిక రోగులను ఆలయం ముందు చెట్టుకు గొలుసులతో బంధించడం తగ్గినప్పటికీ పలు సందర్భాల్లోకుటుంబ సభ్యులు మానసిక రోగులను ఆలయ పరిసరాల్లో వదిలివెళ్లడం కొత్త సమస్యకు తెరలేపింది . ఈ విషయమై ఉన్నతాధికారులు , వైద్యాధికారులు మానసిక రోగులకు సరైన చికిత్స అందేలా ఏర్పాట్లు చేయాలని , వారిని గొలుసులు , సంకెళ్లతో బంధించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని మానవహక్కుల సంఘాల ప్రతినిధులు సూచిస్తున్నారు .
మూఢ విశ్వాసమే కారణం..
కొండగట్టులో తమ ఇష్ట దైవాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. అనారోగ్యంతో బాధపడేవారిని , మానసిక రోగులను ఆసుపత్రులకు తీసుకెళ్లి సరైన చికిత్స చేయించకుండా కొందరు తల్లిదండ్రులు , కుటుంబ సభ్యులు వారిని కొండగట్టుకు తీసుకొచ్చి ఆలయ పరిసరాల్లో గొలుసులు , సంకెళ్లతో బంధించడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి . మానసిక రోగులకు 20 లేదా 40 రోజులపాటు అంజన్న ఆలయ పరిసరాల్లో బంధిస్తే బాగవుతారని కుటుంబ సభ్యుల విశ్వాసం . అయితే వారి మూఢ విశ్వాసం కారణంగా మహిళలు , చిన్నారు వృద్ధులు అనే తేడా లేకుండా గొలుసులు , సంకెళ్లతో బంధించడంవల్ల వారు మరింత మానసిక ఒత్తిడికి లోనై అనారోగ్యం బారిన పడ్డూ చివరికి కొన్ని సందర్భాల్లో  మృత్యువాత కూడా పడుతున్నారు .దైవ దర్శనానికి వచ్చే భక్తులు ఇలాంటి వారిని చూసి భయబ్రాంతులకు గురవుతున్నారు.

First published:

Tags: Jagityal, Karimnagar

ఉత్తమ కథలు