హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimnagar: జాతీయ రహదారుల పక్కన ఉన్నా రక్షణ మాత్రం కరువైంది.. వరుస ప్రమాదాలతో బెంబేలెత్తిపోతున్న ప్రజలు..

Karimnagar: జాతీయ రహదారుల పక్కన ఉన్నా రక్షణ మాత్రం కరువైంది.. వరుస ప్రమాదాలతో బెంబేలెత్తిపోతున్న ప్రజలు..

ఘటనా స్థలంలోని కార్లు (ఫైల్)

ఘటనా స్థలంలోని కార్లు (ఫైల్)

Karimnagar: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోడ్డు పక్క బావులు , కాకతీయ , ఎస్సారెస్పీ కాలువ లు ప్రాణాలను తోడేస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే స్పందించే అధికారులు వాటిపై చర్యలు తీసుకోవడంలో పూర్తి విఫలం అయ్యారు. ప్రభుత్వ చర్యలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...

(పి. శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా, న్యూస్18 తెలుగు) 

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోడ్డు పక్క బావులు , కాకతీయ , ఎస్సారెస్పీ కాలువ లు ప్రాణాలను తోడేస్తున్నాయి. రోడ్డుపై వాహనాల్లో వెళ్లాలంటే భయపడుతు న్నారు . ప్రమాదాలు జరిగినపుడు మాత్రమే అధికారులు అప్రమత్తమవుతున్నారు. తప్ప రోడ్డు పక్కన ఉన్న బావులు , కాలువల వద్ద శాశ్వత ప్రాతిపదికన జాగ్రత్తలు తీసుకోవడంలో శ్రద్ధ చూపించడంలేదు . ఉమ్మడి జిల్లాలో 2002 సంవత్సరం నుంచి ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి . కాకతీయ కాలువ , ఎస్సారెస్పీ కాలువలో వాహనాలు పడ్డ సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి . జగిత్యాల రోడ్డుపై ఉన్న ఎస్సారెస్పీ కెనాల్ లో 2003 లో ఎస్ఆర్ఎం కళాశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న మారుతి ఓమిని వ్యాన్ పడి విద్యార్థులు మృత్యువాత పడ్డారు . రామడుగు మండలం దేశరాజ్ పల్లి సమీపంలో స్కూల్ బస్సు బావిలో పడి విద్యార్థులు చనిపోయారు . అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ రెండు సంఘటనలను సీరియస్గా తీసుకొని రోడ్డుకు ఆనుకొని ఉన్న కాలువల వెంట సేపీ వాల్స్ నిర్మా ణం చేపట్టింది .

బావులు ఉంటే కనీలను ఏర్పాటు చేశారు . తదతనంతరం వీటి నిర్వహణ , ఏర్పాట్లను మరిచారు . సంఘటనలు జరిగినపుడు ఆ కాలువ వెంట రోడ్డుపై వెళ్లేవారికి ప్రమాదం జరగకుండా ఫెన్సింగ్గ్లు ఏర్పాటు చేయడం , బావులు ఉంటే ఖనీలు పాతడం చేస్తున్నారు . మరోచోట మళ్లీ జరిగినపుడు అదే చేస్తున్నారు . కనీసం కాలువల వెంట , రోడ్డుపక్కన ఉండే బావుల వెంట మనకు హెచ్చరిక బోర్డులు కూడ కనిపించవు . ప్రమాదకరమైన మలుపులు అనే సూచి కలు కూడా ఉండవు. శాశ్వత చర్యలు మాత్రం లేవు . ప్రభుత్వం స్పందించి కాలువలు , రోడ్డుపక్కన బావుల వద్ద శాశ్వత చర్యలు చేపట్టాలని , ప్రమాదకర బావులు ఉంటే పూడ్చేయాలని ప్రజలు కోరుతున్నారు . ఉమ్మడి జిల్లాలో కాకతీ య కాలువ వెంట ముఖ్యంగా కరీంనగర్ నుంచి వరంగల్ వరకు ఉన్న కాలువ లైను వెంట ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి .

తిమ్మాపూర్ వద్ద కాకతీయ కాలువ వద్ద గత సంవత్సరం జనవరి నుంచి ఫిబ్రవరి వరకు జరిగిన నాలుగు సంఘటనల్లో ఎనిమిది మంది చనిపోవడంతో ప్రభుత్వం తేరుకొని కాలువ వెంట ప్రహరీ నిర్మించింది . అయితే ఈ ప్రహరీ ఒకవైపు మాత్రమే నిర్మించారు . మరో వైపు అలానే వదిలా రు . ఈనెల 29 న చిన్నముల్కనూరు బావిలో కారుపడ్డ సంఘటనలో ఒకరు మృతి చెందారు . కారులో ఒక్కడు ఉన్నాడు కనుక సరిపోయింది . నలుగు రు ఉంటే నలుగురు జలసమాధి అయ్యే వారే . ప్రమాదకర సంఘటనలు జరగ కుండా శాశ్వత చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది . జనవరి 25 న పెద్దపల్లి జిల్లా సుల్తానా బాద్ కు చెందిన మాచర్ల శ్రీనివాస్ , స్వరూప దంపతులు కారులో సుల్తానా బాద్ నుంచి కరీంనగర్‌కు వచ్చారు .

వ్యాపారి అయిన శ్రీనివాస్ సాయంత్రం సుల్తానాబాదు వెళ్లే ముందు అల్గునూ రు కాకతీయ కెనాల్ పక్కన చేపలు కొనుగోలు చేసేందుకు వెళ్లారు . చేపల కొనుగోలు అనంతరం శ్రీనివాస్ కారును వెనక్కు తీస్తుండగా అదుపుతప్పి కాకతీయ కాలువలో పడింది . ఇద్దరు దంపతులు మృత్యువాత పడ్డారు . తమ మొదటి పెళ్లి రోజు జరుపుకునేందుకు గన్నేరువరంకుచెందిన ప్రదీప్ , కీర్తన దంపతులు ఈనెల 16 న రాత్రి వెలుతుండగా కాకతీయ కెనాల్ వద్దకు రాగానే ప్రదీప్ కళ్లలో పురుగులు పడటంతో వీరు ప్రయాణిస్తు న్న ద్విచక్రవాహనం అదుపుతప్పి కాక తీయ కెనాల్ లో పడింది . బ్లూకోట్స్ పోలీసులు వెనువెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ప్రదీప్ ను రక్షించగలి గారు , భార్య కీర్తన నీళ్లలో కొట్టుకుపోయి ముంజంపల్లి వద్ద శవమై తేలింది . ఈ సంఘటన విషాదాన్ని నింపింది . - ఈనెల 16 రాత్రి జరిగిన సంఘటనలో స్వరూప మృతదేహం కోసం గాలిం చేందుకు కాకతీయ కాలువకు నీటి విడు దలను ఆపారు . నీరు ఆపడంతో సోమవారం ఉదయం ఈ కెనాలకు కిలోమీటరు దూరంలో కాలువలో కారు తేలుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు . క్రేన్ సహాయంతో కారును బయటకు తీయగా సత్యనారాయణ రెడ్డి , అతని భార్య రాధ , కూతురు వినియశ్రీల మృతదేశాలు కుళ్లిపోయి కనిపించాయి . కారు నెంబర్ ఆధారంగా వీరిని పోలీసు లు గుర్తించగలిగారు . జనవరి 27 న ఇంటి నుంచి బయలుదేరిన వీరు 20 రోజుల తరువాత జలసమాధి అయి కనిపించారు .

రాధ స్వయాన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి . ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు . సంవత్సరం క్రితం సత్యనారాయణ రెడ్డి కొడుకు శ్రీనివాస్ రోడ్డుప్రమాదంలో మృతి చెందగా మిగతా వారంతా సోమవారం కాకతీయ కాలువలో శవాలై తేలారు . ఈ సంఘటన దాసరి బంధువులు , స్నేహితులను దుఖఃసాగరంలో ముంచింది . జనవరి 25 నుంచి ఫిబ్రవరి 16 వరకు కరీంనగర్ జిల్లా అల్గునూరు కాకతీయ కాలువ వద్ద జరిగిన నాలుగు సంఘటనల్లో మొత్తం 14 మంది మృత్యువాత పడ్డారు . అందరు చూస్తుండగా వాహనాలు కాలువలో కొట్టుకుపోయిన సంఘటన లు జరిగాయి . ఫిబ్రవరి 18 రోజున 20 రోజుల క్రితం పడిపోయిన కారు లభ్యం కావడం , మూడు మృతదేహాలు కుల్లి పోయి ఉండటం సంచలనానికి గురి చేసింది . ఫిబ్రవరి 2020 లో కరీంనగర్ సమీపంలోని కాకతీయ కాలువలో పడి ముగ్గురు మృత్యువాత పడిన సంఘటన మరవక ముందే సరిగ్గా సంవత్సరం తరువాత ఫిబ్రవరి 2021 లో జగిత్యాల జిల్లాకు చెందిన అమరేందర్ రావుకు టుంబ సభ్యులు జోగినపల్లికి దైవదర్శనంకు వెళ్లి తిరుగు ప్రయాణంలో మేడి పల్లి మండలం కట్లకుంట వద్ద కారు అదుపుతప్పి ఎస్సారెస్పీ కెనాల్ లో పడి పోగా న్యాయవాది , ఆయన భార్య , కూ తురు మృతి చెందారు . జూలై 29 , 2021 లో కరీంనగర్ నుంచి హుస్నా బాద్కు కారులో వెళ్తున్న రిటైర్డ్ ఎన్ఏ పాపయ్య చిగురుమామిడి మండలం చిన్నముల్క నూరు వద్ద రోడ్డుపక్కన ఉన్న బావిలో పడి మృతి చెందాడు .

ఈకారును వెలికి తీయడానికి సాయంత్రం వరకు శ్రమించాల్సి వచ్చింది. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వరుస ప్రమాదంలో చాలా మంది చనిపోవడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ప్రభుత్వం, రోడ్డు రవాణా శాఖ అధికారులు వెంబడే ఈ ప్రమాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయం రోడ్స్ రవాణా శాఖ అధికారులను అడగ్గా వాహన దారులు మితిమీరిన వేగంతో రావడంమే వరుస ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. బావులు, కాలువ వద్ద కొంచెం మెళ్లగా వెళ్తే ఇలాంటి ప్రమాదాలను అరికట్టవచున్నని అంటున్నారు అధికారులు.

First published:

Tags: Accident, Bike accident, Car accident, Karimnagar

ఉత్తమ కథలు