హోమ్ /వార్తలు /తెలంగాణ /

Gangavva: నిర్మాతలు చేసిన పనికి ఉబ్బితబ్బిబ్బైపోతున్న గంగవ్వ.. ఇంతకీ ఏమైందంటే?

Gangavva: నిర్మాతలు చేసిన పనికి ఉబ్బితబ్బిబ్బైపోతున్న గంగవ్వ.. ఇంతకీ ఏమైందంటే?

గంగవ్వ కారావ్యాన్​

గంగవ్వ కారావ్యాన్​

ఆరు పదుల వయసులో యూట్యూబ్ (YouTube) షేక్ చేస్తున్న పేరు. .గంగవ్వ (Gangavva) అచ్చ తెలుగు బామ్మకు నిఖార్సయిన నిదర్శనంలా ఉంటుంది . చదువు లేదు సంధ్య లేదు కానీ చెప్పిన ప్రతి డైలాగ్ ను ఇట్టే  చక్కబెట్టేస్తుంది .

(Srinivas P, News18, Karimnagar)

ఆరు పదుల వయసులో యూట్యూబ్ (YouTube) షేక్ చేస్తున్న పేరు. .గంగవ్వ (Gangavva) అచ్చ తెలుగు బామ్మకు నిఖార్సయిన నిదర్శనంలా ఉంటుంది . చదువు లేదు సంధ్య లేదు కానీ చెప్పిన ప్రతి డైలాగ్ ను ఇట్టే  చక్కబెట్టేస్తుంది .ఈ వయసులో కూడా తన నటనతో అందరిని మంత్ర ముగ్దలిని చేస్తుంది. తన మాటలతో  నటనతో ఇట్టే కట్టి పడేస్తుంది. తను యాక్టింగ్ లోకి దిగిందంటే యూట్యూబ్ లో లక్షలో లైక్స్ రావలిసిందే . ఎక్కడో జగిత్యాల జిల్లా (Jagityal), లంబాడిపల్లె లో మారుమూల గ్రామంలో ఉండే గంగవ్వ మొదట మై విలేజ్ యూట్యూబ్​ ఛానెల్​ ద్వారా ఒక్కసారిగా ఫేమస్ ఐపోయింది . తరువాత బిగ్ బాస్కెట్​ ద్వారా సెలెబ్రిటీ రేంజ్ కి వెళ్ళిపోయింది.

బిగ్ బాస్ హౌస్​లోకి..

యూట్యూబ్ ద్వారా గంగవ్వ ఎంతో ఫేమస్ ఐపోయింది . ఆమెలోని బామ్మతనాన్ని చూపించేందుకు చాలా మంది యూట్యూబర్స్ ఆమెను సంప్రదిస్తూ ఉంటారు . మై విలేజ్ షో ' పేరుతో ఎన్నో వీడియోస్ కూడా వచ్చాయి . బిగ్ బాస్ హౌస్  (BiggBoss House)లోకి వెళ్ళాక ఎక్కువ కాలం ఉండలేకపోయింది గంగవ్వ . పల్లెటూరిలో హాయిగా ఎగిరే పిట్టలా ఉండే ఆమెను హౌస్ లో కాళ్ళు చేతులు కట్టేసి కూర్చోబెట్టారు అంటూ టాక్ కూడా అప్పట్లో పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు . తర్వాత ఆమెను హౌస్ నుంచి గౌరవంగా పంపారు హోస్ట్ నాగార్జున (Nagarjuna) .

Soccer boy: శ్రీమంతుడు రిపీట్​.. ఓ యువకుడు అమెరికా నుంచి ఖమ్మంలోని సొంత ఊరికొచ్చి ఏం చేస్తున్నాడో తెలుసా?

అంతేకాదు ఆమెకు ఒక కొత్త ఇల్లు కట్టిస్తానని చెప్పారు . చెప్పినట్టే గంగవ్వ పోయినేడాది కొంత ఇంట్లోకి గృహప్రవేశం కూడా చేసేశారు . ఐతే ఇప్పుడు ఆమె కొన్ని మూవీస్ లో యాక్ట్ చేయడానికి సిద్ధమౌతున్నారు. ఈమె కోసం షూటింగ్స్ సమయంలో ప్రత్యేక క్యారవాన్ (Special Caravan) ని కూడా ఏర్పాటు చేస్తున్నారట . ఈ విషయాన్ని డైరెక్ట్ గా చెప్పింది గంగవ్వ .

యూట్యూబ్​లో పోస్టు..

ఇక క్యారవాన్  (CaraVan)లో అన్ని సదుపాయాలు ఉంటాయని చెప్పింది . తాను ఎక్కడికి షూటింగ్ కి వెళ్లినా సరే ఆమె కోసం ప్రత్యేకంగా క్యారవాన్ ఇవ్వడం నిజంగా గొప్ప విషయం . దీనికి సంబంధించిన ఒక వీడియో (Video) కూడా తన యూట్యూబ్ లో పోస్ట్ చేసింది గంగవ్వ . టాప్ మోస్ట్ వాళ్లకు మాత్రమే ఇండస్ట్రీలో క్యారవాన్ సౌకర్యం (Caravan facility) అనేది ఉంటుంది . కానీ ఇప్పుడు నిర్మాతలు గంగవ్వకు క్యారవాన్ సౌకర్యం కల్పించడం అనే విషయం పెద్ద ఎత్తున సోషల్ మీడియా (Social media)లో వైరల్ గా మారింది .

First published:

Tags: Gangavva, Jagityal, Karimnagar, Telugu movies

ఉత్తమ కథలు