Home /News /telangana /

KARIMNAGAR THE POLLUTION CONTROL BOARD HAS ISSUED ORDERS TO STOP PRODUCTION AT RAMAGUNDAM FERTILIZERS KNR PRV

Fertilizers production: రామగుండం ఫెర్టిలైజర్స్​ మూసివేత..! పొల్యూషన్ బోర్డు సంచలన నిర్ణయం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రామగుండం ఫెర్టిలైజర్స్​లో (Ramagundam Fertilizers) ఉత్పత్తి నిలిపేయాలని కాలుష్య నియంత్రణ మండలి (Pollution Control Board ) ఉత్తర్వులు జారీ చేసింది .

    (Srinivas. P, News 18, Karimnagar)

    రామగుండం ఫెర్టిలైజర్స్​లో  (Ramagundam Fertilizers) ఉత్పత్తి నిలిపేయాలని కాలుష్య నియంత్రణ మండలి (Pollution Control Board ) ఉత్తర్వులు జారీ చేసింది . రామగుండం ఎరువుల కర్మాగారంలో గ్యాస్ లీకేజ్ (Gas leakage) కాకుండా యాజమాన్యం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ (Ramagundam MLA Korukanti Chander) పొల్యూషన్ బోర్డును  సంప్రదించిన సంగతి తెలిసిందే. రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి అమ్మోనియా లీకేజీతో పాటు ఆర్.ఎఫ్.సి.ఎల్ (RFCL) వ్యర్థ నీరు గోదావరి నదిలో కలవటం మూలంగా గోదావరి నది కలుషుతం అవుతుందని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు  దీంతో హైదరాబాద్లో రాష్ట్ర కలుష్య నియంత్రణ మండలి అధికారులు సమావేశం నిర్వహించారు. మూడు రోజులపాటు సమావేశం నిర్వహించి పొల్యూషన్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

    గ్యాస్​ లీకేజీపై స్థానికులు ఆందోళన..

    పీసీబీ (PCB) వారం రోజుల పాటు కర్మాగారంలో తనిఖీలు చేపట్టింది . ఏడాది కాలంగా ఇక్కడ ఉత్పత్తి (Fertilizers production) జరుగుతోంది. అధికారికంగా ఈ నెల 26 న ప్రధాని మోదీ దీన్ని ప్రారంభిస్తారని ప్రచారం జరిగింది .  అయితే ఈ పరిశ్రమపై కొంత కాలంగా అనేక ఫిర్యాదులొచ్చాయి. గ్యాస్ లీకేజీ తదితర అంశాలపై పలుసార్లు స్థానికులు ఆందోళనలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో రామగుండం ఎమ్మెల్యే స్పందించి ఫిర్యాదు చేయడంతో కర్మాగారంలో పీసీబీ తనిఖీలు నిర్వహించింది .

    RFCL


     12 లోటు పాట్లు ఉన్నట్లు గమనించి..

    తనిఖీలు (Checking) చేసిన అనంతరం  12 లోటు పాట్లు ఉన్నట్లు గమనించి కర్మాగార అధికారులకు పీసీబీ సమాచారం ఇచ్చింది . లోపాలను సరి చేసే వరకు కర్మాగారాన్ని మూసేయాలని పొల్యూషన్​ బోర్డు సూచించింది . ప్రమాదాలు అధికంగా జరిగే ఆస్కారం ఉన్న కర్మాగారం అయినా .. సిబ్బంది , స్థానిక ప్రజలకు సంబంధించి భద్రతా చర్యలు తీసుకోలేదని పీసీబీ వివరించింది . మరోవైపు తనిఖీల్లో భాగంగా పీసీబీ అధికారులు రూ .12 లక్షల గ్యారెంటీ సొమ్ము జప్తు చేశారు .

    యాజమాన్యం నిర్లక్ష్యంతో అమ్మోనియా గ్యాస్ లీకేజ్..

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. ఎరువుల కార్మగారం నుంచి గ్యాస్ లీకేజ్ వల్ల  చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, పలుమార్లు  కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్న  పాపాన పోలేదని, అలాగే భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపించారు. ఎరువుల కర్మాగారంలో ఎరువుల ఉత్పత్తి (Fertilizers production) సమయంలో యాజమాన్యం నిర్లక్ష్యంతో అమ్మోనియా గ్యాస్ లీకేజ్ అవుతుందన్న‍ారు. గ్యాస్ లీకేజ్ ప్రజలు తీవ్ర అనారోగ్యంతో పాటు ఉపిరాడక  అస్వస్థత గురి అవుతున్నారని అందుకే  ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని రామగుండం ఎమ్మెల్యే  చందర్ అన్నారు..
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Farmers, Fertilisers, Karimnagar, Ramagundam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు