• Home
 • »
 • News
 • »
 • telangana
 • »
 • KARIMNAGAR THE POLITICS OF HUZURABAD WAS IN FULL SWING WITH THE DEMONSTRATIONS THE VISITS OF MINISTERS THE ALLOCATION OF FUNDS BY THE GOVERNMENT FOR DEVELOPMENT WORKS VB KNR

Huzurabad By Election: హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి భారీగా తాయిలాలు.. హీటెక్కిన రాజకీయం..

మాట్లాడుతున్న మంత్రులు

Huzurabad By Election: ఈటల బలప్రదర్శన , మంత్రుల పర్యటనలు , తాయిలాల అందిస్తుండటం , ప్రభుత్వం అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తుండటం తో హుజురాబాద్ రాజకీయం హీట్ ఎక్కింది . ఉమ్మడి జిల్లా ప్రజలే కాదు తెలంగాణ ప్రజలు , రాజకీయ పార్టీలు హుజురాబాద్ లో ఏమి జరుగుతుందో , ఏమి జరగబోతుందోన న్న ఆసక్తిలో ఉన్నారు .

 • Share this:
  (పి. శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా, న్యూస్18 తెలుగు)

  ఈటలను టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ , ఆత్మగౌవం పేరుతో టీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టేందుకు ఈటల రాజేందర్ లు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతుండటంతో రాజకీయ పరిణామాలు రోజుకోమలుపు తిరుగుతున్నాయి . ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తరువాత తొలిసారి హుజురాబాద్ పర్యటనకు వచ్చారు . గురువారం ఆయనకంటే ముందు ఆయన సతీమణి జమున కమలామూర్ నియోజవర్గంలో పర్యటించగా ఈటల రాజేందర్ కు శివారు ప్రాంతమైన కాంట్రపల్లి వద్ద బీజేపీ కార్యకర్తలు , ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు . బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి , దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు , మాజీ ఎంఎన్ఏ ఏనుగు రవీదంర్ రెడ్డిలతో కలసి వచ్చా రు . కాంట్రపల్లి నుంచి ఇప్పలనర్సింగా పూర్ , మీదుగా వాజురాబాద్ కు చేరు కొని అక్కడ తెలంగాణ అమరవీరుల స్థూపందవద్ద అమరవీరులకు నివాళు లు అర్పించి అక్కడి నుంచి జమ్మికుంట కు భారీ ప్రదర్శనలో చేరుకున్నారు.  జమ్మికుంటలో కార్యకర్తలు భారీ స్వాగతం పలికారు .

  ఈటల జమ్మికుంట , హుజురాబాద్ లో ప్రదర్శన నిర్వహించ గా ఈటలసతీమణి జమున మాజీ జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ , బీజేపీ లీగల్ సెల్ మేడ్చల్ అధ్యక్షురాలు ప్రసన్నలతో కలిసి కమలాపూర్ మండలం అంబాల , గుని పర్తి , మారన్నపేట , శనిగరం , గోపాల పురం , బత్తివానిపల్లిలలో పర్యటిం చారు . జమునకు అడుగడుగునా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు . ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తరువాత గురువారం మొదటి సారి రావడంతో ఆయనకు అడుగడుగునా స్వాగతం పలికారు . నాలుగు రోజు ల పాటు నియోజవర్గంలో విస్తృతంగా పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నా ఈటల ఈ విధంగా ముందుకు పోతుంటే మంత్రులు కొప్పుల ఈశ్వర్ , గంగుల కమలాకర్ లు గత మూడు రోజులుగా విస్తృతంగా పర్యటిస్తున్నారు . గురువారం కొప్పుల ఈశ్వర్ జమ్మి కుంటలో కార్యకర్తలతో సమావేశం కాగా , గంగుల కమలాకర్ హుజురాబాద్ లో రేషన్ డీలర్ల సమావేశంలో పాల్గొని వరాల జల్లులు కురిపించారు. నిన్ననే హుజురాబాద్, మొన్న జమ్మికుంట, వినవంక, పట్టణ అభివృద్ధికి ఒక్కొక మండలానికి రూ. 35కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన మంత్రి గంగుల కమలాకర్ గురువారం రేషన్ డీలర్ల సభలో కేంద్రప్రబుత్వం కమీషన్ నిధులు విడుదల చేయకున్నా రాష్ట్ర ప్రభుత్వం కమీషన్ అందించిందని పేర్కొంటూ రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరిస్తామనిహామీ ఇచ్చారు .

  కార్యకర్తల సమావే శాల్లో కూడా వారికి అండగా ఉంటామని , టీఆర్ఎస్ పార్టీని నమ్ముకోవాలని , పార్టీ ని వీడవద్దని హితబోధలు చేస్తూ పార్టీ క్యాడర్ ఈటల వైపు వెళ్లకుండా వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారు. నిన్న మంత్రి కేటీఆర్ వెంట సిరిసిల్ల నియోజ వర్గంలో పర్యటించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద కుమార్ గురువారం కరీంనగర్ లో మకాం వేసి హుజురాబాద్ నియోజ వర్గం టీఆర్ఎస్ శ్రేణులతో సమావేశమయ్యారు . ఇప్పటికే ఐదు మండలాల్లో ఒకరిద్దరు మినహా ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ వెంటే ఉంటామని ప్రకటించా రు. పార్టీ క్యాడర్ లో చీలికలు రావడం , కొందరు ఈటలకు జై కొట్టడతో వారిని పిలిపించి మంతనాలు జరుపుతున్నారు . హుజూరాబాద్ నియోజవర్గంలో రోజుకో మార్పు చోటు చేసుకొంటుండటం , రాజకీయ పరిణామాలు రోజు రోజుకు మారుతుండటంతో ఇక్కడి రాజకీయాలను ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. అభివృద్ధి లేని హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక్కసారిగా కోట్ల నిధులు ప్రభుత్వం ఇవ్వడం కూడా ఒక్కింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
  Published by:Veera Babu
  First published: