KARIMNAGAR THE MOTHER IS MOURNING THE SUICIDE DEATH OF HER TWO SONS DURING THE YEAR IN JAGITYAL DISTRICT KNR PRV
Sad Story: అయ్యో పాపం.. నాడు అన్న, నేడు తమ్ముడు.. ఆ తల్లికి కడుపుగోస మిగిల్చారు.. ఏం జరిగిందంటే..?
మృతిచెందిన బ్రదర్స్
ఇప్పుడే వస్తానని చెప్పిన కొడుకు నాలుగు రోజులైనా రాకపోవడం తో ఏమైందోనన్న భయంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆ తల్లికి తన కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలిసి గుండె పగిలేలా రోదించింది .
ఇప్పుడే వస్తానమ్మా నా కోసం ఎదురు చూడకు .. తిని పడుకో అమ్మ అని వెళ్లిన కొడుకు ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆ తల్లి మనసు తల్లడిల్లిపోతుంది .నా కోసం ఎదురు చూడకమ్మా అని చెప్పిన కొడుకు (Son) మాటల్లో ఉన్న అంతరార్థం గ్రహించలేక పోయింది ఆ పిచ్చి తల్లి (Mother) . ఇప్పుడే వస్తానని చెప్పిన కొడుకు నాలుగు రోజులైనా రాకపోవడం తో ఏమైందోనన్న భయంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆ తల్లికి తన కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని (Died) తెలిసి గుండె పగిలేలా రోదించింది . వివరాల్లోకి వెళితే..
నూకపెల్లి కెనాల్లో..
మేడిపెల్లి మండలం పోరుమల్ల గ్రామానికి చెందిన కటకం కృష్ణారి రాజమణి దంపతులకు ఇద్దరు కుమారులు బతుకుదెరువు నిమిత్తం జగిత్యాల (Jagityal) లో స్థిరపడ్డారు . రాహుల్ (Rahul) ఈ నెల 19 వ తేదీన మళ్ళీ వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళాడు. నాలుగు రోజులైనా తిరిగిరకపోవడం తో తెలిసిన వాళ్ళ దగ్గర బంధువుల ఇంట్లో వెతకగా ప్రయోజనం లేకపోయింది .
చివరికి 22 వ తేదీన జగిత్యాల (Jagityal) పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు . ఈ రోజు ఉదయం నూకపెల్లి కెనాల్లో (Nooka palli Canal) గుర్తు తెలియని యువకుని మృతదేహం లభ్యం కావడం తో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోరుమల్ల కు చెందిన రాహుల్ గా నిర్ధారించి అతని తల్లిదండ్రులకు (Parents) సమాచారమిచ్చారు . మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు .
నాడు అన్న .. నేడు తమ్ముడు..
మృతుడు రాహుల్ కు అన్న అయిన రంజిత్ ( 29 ) కూడా గత ఏడాది మే నెలలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు . బాసటగా నిలుస్తాడనుకున్న ఉన్న ఒక్క కొడుకు కూడా ఇప్పుడు అనూహ్యంగా ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లిదండ్రులు ఒంటరయిపోయారు .
చేతికి అందొచ్చిన కొడుకులు ఇద్దరు (Both sons) ఇలా మధ్యలోనే తనువు చాలించడంతో (Died) ఆ తల్లిదండ్రులు అనాధలుగా మారారు . నువ్వు కూడా అన్న దగ్గరకే వెళ్లిపోయావా తలకొరివి పెడతారనుకున్న కొడుకులకు తండ్రే తలకొరివి పెట్టాల్సి వస్తుందని ఆ తల్లి రోధించిన (Mother Crying) తీరు అందరినీ కలచివేసింది. అందరితో కలివిడిగా ఉండే అన్నదమ్ములు ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో పోరుమల్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి .
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.