హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: టీఆర్​ఎస్​ లీడర్లకు మావోయిస్టుల హెచ్చరిక..! డబ్బులు ఇచ్చేయాలని డిమాండ్​

Telangana: టీఆర్​ఎస్​ లీడర్లకు మావోయిస్టుల హెచ్చరిక..! డబ్బులు ఇచ్చేయాలని డిమాండ్​

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రామగుండం ఎరువుల కర్మాగారంలో (Ramagundam Fertilizer Factory) ఉద్యోగ నియామకాల (Jobs) వివాదం పరిష్కారం కావడం లేదు. తాజాగా ఈ వివాదంపై మావోయిస్టులు (Maoists) లేఖ విడుదల చేశారు .

 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  (Srinivas, News18, Karimnagar)


  రామగుండం ఎరువుల కర్మాగారంలో (Ramagundam Fertilizer Factory) ఉద్యోగ నియామకాల (Jobs) వివాదం పరిష్కారం కావడం లేదు .. ఇంకా బాధితులు దళారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.ఆందోళన చేసిన సమయంలో బాధితులకు అప్పుపత్రాలు, భూమి పత్రాలు రాసి ఇచ్చిన దళారులు డబ్బులు మాత్రం తిరిగి చేతికి ఇవ్వకపోవడంతో మళ్లీ సమస్య మొదటికొచ్చినట్లయింది.తాజాగా ఈ వివాదంపై మావోయిస్టులు (Maoists) లేఖ విడుదల చేశారు.బాధితులకు న్యాయం చేయకపోతే శిక్ష తప్పదని హెచ్చరించారు .


  ఒంటిపై పెట్రోల్ పోసుకుని..


  ఉద్యోగాలు (Jobs) ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసిన దళారులు ఇంకా బాధితులకు న్యాయం చేయకపోవడంతో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. ఒంటిపై పెట్రోలు పోసుకుని ఓ ఆర్ఎఫ్సీఎల్ (RFCL) బాధితుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు తెలిసింది.మధ్యవర్తుల ద్వారా తనకు రావాల్సిన డబ్బుల కోసం మాట్లాడేందుకు గోదావరిఖనిలోని (Godavarikhani) అడ్డగుంట చెరువు ప్రాంతం వద్దకు వచ్చిన బాధితుడు గుత్తేదారుతో మాట్లాడారు.ఈ క్రమంలోనే అక్కడ డబ్బుల విషయంలో స్పష్టత రాకపోవడంతో ద్విచక్ర వాహనంలోని పెట్రోలు తీసి ఒంటిపై పోసుకున్నడు. అలాగే దళారీపై పొసేశాడు .  వెంటనే స్పందించిన సదరు వ్యక్తి అక్కడికక్కడే రూ .20 వేలు నగదుతో పాటు మరికొంత మొత్తానికి చెక్కు రాసి ఇచ్చినట్లు సమాచారం.మధ్యవర్తుల సమక్షంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.ఈ విషయంపై మాట్లాడేందుకు బాధితుడు, మధ్యవర్తులు ఎవరూ ముందుకు రావడం లేదు .


  Ox Festival: వ్యవసాయానికి దన్నుగా నిలిచే ఎడ్లకూ ఓ పండుగ ఉంది.. ఎక్కడ చేస్తారో తెలుసా?


  అయితే రామగుండం కర్మాగారంలో ఉద్యోగాల పేరుతో వసూలు చేసిన డబ్బులు బాధితులకు తిరిగి చెల్లించాలని మావోయిస్టు జయశంకర్, మహబూబాబాద్, వరంగల్ ( 2 ), పెద్దపల్లి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేశ్ హెచ్చరిక జారీ చేశారు.ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.కొంతమంది పైరవీకారులు నిరుద్యోగుల వద్ద భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారని, బాధితులు తమ డబ్బుల కోసం తిరుగుతున్నారని పేర్కొన్నారు.వెంటనే తిరిగి చెల్లించాలని, లేని పక్షంలో వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు.మావోలు పరోక్షంగా స్థానిక టీఆర్​ఎస్ (TRS)​ నాయకులకు వార్నింగ్​ ఇచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధి అనుచరులు కొంతమంది ఈ దందాలో భాగస్వాములుగా ఉన్నారని, వీరితో పాటు కొందరు కార్మిక సంఘ నాయకులు నిరుద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేశారని ప్రకటనలో పేర్కొన్నారు.వెంటనే స్పందించక పోతే శిక్ష తప్పదని మావోయిస్టులు హెచ్చరించారు. కాగా, ఈ ఉద్యోగ నియామక కుంభకోణంలో స్థానిక నేతల ప్రమేయమే ఎక్కువగా ఉన్నట్లు ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: JOBS, Karimangar, Maoists, Ramagundam

  ఉత్తమ కథలు