Home /News /telangana /

KARIMNAGAR THE INTELLIGENCE INVESTIGATION REVEALED THAT THE RESIDENTS OF KARIMNAGAR ARE IN THE SYMPATHIZING ORGANIZATION OF THE TERRORISTS KNR PRV

Terrorist links in Karimnagar: ఆ ఉగ్రవాద సంస్థతో ఉమ్మడి కరీనంగర్​ జిల్లా వాసులకు లింకులు.. 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఉమ్మడి కరీంనగర్​ (Karimnagar) జిల్లాలో మరోసారి ఉగ్రవాదుల (Terrorism) కలకలం రేగింది. నిజామాబాద్​లో ఒకప్పుడు యాక్టీవ్​గా ఉన్న ఉగ్రవాద సంస్థతో జిల్లాకు చెందిన వాసులకు లింకులు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

    (P. Srinivas, News18, Karimnagar)

    ఉమ్మడి కరీంనగర్​ (Karimnagar) జిల్లాలో మరోసారి ఉగ్రవాదుల (Terrorism) కలకలం రేగింది. నిజామాబాద్ (Nizamabad)​లో యువతకు సామాజిక సేవ పేరుతో కరాటే శిక్షణ (karate Training) ఇస్తూ మతపరమైన దాడులకు పాల్పడేలా ప్రోత్సహిస్తున్నాడనే ఆరోపణలతో అబ్దుల్ ఖాదర్ (Abdul Khadar)అనే కరాటే మాస్టర్​ను అరెస్ట్ చేశారు . మతం పేరిట నిజమాబాద్లో దాదాపు ఇప్పటి వరకు 200 మందికి పైగా ఖాదర్ శిక్షణ ఇవ్వగా ఇందులో హైదరాబాద్ , కర్నూలు , నెల్లూరు , కడప , వరంగల్​తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువకులు ఉన్నట్లు గుర్తించారు. ఖాదర్ నివాసంలో మరణాయుధాలు , నిషేధిత సాహిత్యం, నోట్ బుక్స్ లభ్యమయ్యాయి .
    నిందితులలో కొందరిని అరెస్టు చేయగా ..  అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లావాసులు ఉండటంతో  జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

    ఉగ్రవాద సానుభూతి సంస్థలో జగిత్యాల వాసులు..

    వాస్తవానికి ఉగ్రవాద ఛాయలు , సంబంధాలు ఉమ్మడి జిల్లాకు ఇదే తొలిసారి కాదు . రెండు దశాబ్దాల కింద ఉమ్మడి జిల్లాలోని జగిత్యాలలో జరిగిన ఉగ్రవాది భారీ ఎన్ కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. తాజాగా మరోసారి దేశంలో అలజడి రేపేందుకు ఓ ఉగ్ర సానుభూతి సంస్థలో జగిత్యాల వాసులు కీలక పాత్ర పోషించాడన్న వార్తలు మరోసారి చర్చ నీయాంశంగా మారాయి. కరోనా తరువాత జగిత్యాలలో ఇలాంటి అసాంఘిక శక్తులపై పోలీసులు , ఇంటెలిజెన్స్ , ఎస్బీ నిఘా తీవ్రతరం చేశాయి . దీంతో అలాంటి వారంతా ఇక్కడ నుంచి నిజామాబాద్​కు వెళ్లినట్లు సమాచారం .

    ఉమ్మడి జిల్లాలో ఉగ్రమూలాలు అక్కడితోనే అంతమైపోలేదు . 2005 ఆగస్టు 9 న ఉదయం 9.30 గంటల సమయంలో హైదరాబాద్ - ముంబై ప్లాట్​ఫారం మీద ఓ బ్యాగులో ఉంచిన టిఫిన్ బాక్స్ పేలింది . దాదాపు 20 మంది ప్రయాణికు లు గాయపడ్డారు . పాకిస్తాన్ ప్రేరేపిత ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు ప్రకటించారు . వాస్తవానికి ఆ రోజు సాంకేతిక పొరపాటు వల్ల బాంబు పూర్తిస్థాయిలో పేలలేదని , పేలి ఉంటే దాని తీవ్రతకు ప్రాణ నష్టం కూడా అధికంగా సంభవించి ఉండేదని గుర్తుచేసుకుంటున్నారు .

    2021 జూన్ 17 న .. బిహార్​లోని దర్భంగా రైల్వేస్టేషన్లో పేలుడు సంభవించింది . లష్కర్ - ఎ - తొయిబా శిక్షణ పొందిన యువకులు కొందరు సికింద్రాబాద్​లో పార్సిల్ సెక్షన్లో ద్రవరూపంలో ఉన్న ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్రెజివ్ డివైజ్ (ఐఈడీ ) ను వాడి పేలుడుకు పాల్పడ్డారు. వాస్తవానికి ఈ బాంబు సికింద్రాబాద్ నుంచి దర్బంగా వెళ్తున్న ఎక్స్​ప్రెస్​ రామగుండం రైల్వేస్టేషన్ దాటేలోగా పేలాలి . అలా జరగకపోవడంతో భారీ ప్రాణన ష్టం తప్పింది .

    అసలు ఎవరి ఈ ఖాదర్ పాషా..?

    1990 ల దశకంలో ఆజం ఘోరీ అనే వ్యక్తి పీపుల్స్ వార్ గ్రూప్​లో యాక్టివ్ మెంబర్ గా ఉన్నాడు. వరంగల్​లో జరిగిన ఓ బాంబు దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు . దీంతో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి పారిపోయి పాకిస్థాన్​కు వెళ్లి లష్కరే తోయిబాలో చేరాడు. చురుకైన యువకుడు కావడంతో లష్కరే తోయిబాకి చెందిన ఉగ్రవాద నాయకుల దృష్టిలో పడ్డాడు . దీంతో ప్రత్యేకంగా అతన్ని ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల వద్ద శిక్షణ కోసం లష్కరే నాయకులు పంపించారు. ఇక 1992 లో ఘోరీ భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత తన ఉగ్రవాద దాడులకు వ్యూహరచన చేశాడు . మొదట యువతను ఆకట్టుకునేలా పలు శారీరక శిక్షణా కార్యక్రమాలు రహస్యంగా నిర్వహించేవాడు . ఈ విషయం తెలిసిన హైదరాబాద్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ జి కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలోని బృందం అతని అడ్డాపై రైడ్ చేసింది . అప్పుడే ఘోరీ జరిపిన కాల్పుల్లో కృష్ణప్రసాద్ మరణించాడు . దీంతో పోలీసు , నిఘా వర్గాల్లో ఆజం ఘోరీ పై ఫోకస్ మరింత పెరిగింది .
    తరువాత జగిత్యాల జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో అజమ్ ఘోరి చనిపోయాడు. అప్పటి ఆజం ఘోరీ ఉగ్ర సంస్థలో ఒక్కడైనా  అబ్దుల్ ఖాదర్ మళ్లీ నిజామాబాద్​లో కరాటే మాస్టర్ గా చేరి పలువురు యువతను ఆకర్శించి అమాయక యువత జీవితాలు నాశనం  చేయాలని భావిస్తున్నారని పోలీసులు అంటున్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Karimnagar, Terrorism, Terrorists

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు