హోమ్ /వార్తలు /తెలంగాణ /

Love Marriage: ప్రేమ వివాహం.. పది మంది వ్యక్తులతో దాడి చేయించిన అమ్మాయి తండ్రి.. తన భార్యను బలవంతంగా..

Love Marriage: ప్రేమ వివాహం.. పది మంది వ్యక్తులతో దాడి చేయించిన అమ్మాయి తండ్రి.. తన భార్యను బలవంతంగా..

పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట

పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట

Love Marriage: పెద్దపల్లిజిల్లాలో మరో పరువు దాడి జరిగింది. సుల్తానాబాద్ పట్టణంలో ప్రేమజంట ఒకే కమ్యూనిటీ కాకపోవడంతో ఇంట్లో చెప్పకుండా వివాహం చేసుకున్నారు. దీంతో అతడిపై అమ్మాయి తరఫు బంధువులు దాడి చేసి అమ్మాయిని లాక్కెళ్లిపోయారు. వివరాలిలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

(పి. శ్రీనివాస్, పెద్దపల్లి జిల్లా, న్యూస్18 తెలుగు)

వారిద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. ఇరువురు ఒకరినొకరు ఇష్టపడ్డారు. కానీ వాళ్ల కమ్యూనిటీ వేరు కావడంతో ఇంట్లో చెప్పేందుకు ధైర్యం చేయలేదు. దీంతో వాళ్లు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇద్దరు మేజర్లు కావడంతో ఓ రోజు ప్రేమ వివాహం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న వధువు తరఫు బంధువులు పెళ్లైన ఐదు రోజుల తర్వాత పది మంది గుండాలతో అతడిపై దాడి చేయించారు. అంతే కాకుండా అతడి భార్యను కూడా బలవంతంగా తీసుకెళ్లినట్లు అతడు పోలీసులకు తెలిపాడు. దీనికి సబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 15 న సుల్తానాబాద్ కి చెందిన కరుణాకర్, హైదరాబాద్ కి చెందిన మౌనిక మేజర్లు కావడంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ మ్యారేజ్ విషయం వాళ్ల తల్లిదండ్రులకు తెలియడంతో ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించారు. ఇరు కుటుంబాలకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

అయితే పెళ్లయిన ఐదు రోజుల తర్వాత మౌనిక తండ్రి పదిమంది కిరాయి గుండాలతో కరుణాకర్ ఇంటిపై దాడి చేసి , తన భార్యను బలవంతంగా తీసుకెళ్లారని స్థానిక పోలీసులను కరుణాకర్ ఆశ్రయించాడు. అయితే కరుణాకర్, మౌనిక హైదరాబాదులో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసినట్లు తెలిసింది. మౌనిక తండ్రి వల్ల తనకు ప్రాణహాని ఉందని కరుణాకర్ పోలీసులను వేడుకుంటున్నాడు. తనకు న్యాయం జరిగేలా చూడాలని కరుణాకర్ పోలీసులను ఆశ్రయించారు.


మౌనికను తిసుకెళ్లిన వారి ఆచూకీ తెలుసుకొని పోలీసులు మౌనికను సుల్తానాబాద్ కి తీసుకొచ్చారు. పెద్దపల్లి ఏసీపీ వద్ద ఇరువురికి కౌన్సెలింగ్ నిర్వహించారు .దాడికి పాల్పడ్డ వారిలో ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు కు తరలించినట్లు ఏసీపీ సారంగపాణి తెలిపారు.

First published:

Tags: Attack peoples, Crime, Karimnagar, Love marriage, Lovers, Telangana crime news

ఉత్తమ కథలు