( Srinivas, News18, Karimnagar)
రాష్ట్రపతి ఎన్నికలు (Presidential Elections) సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల అయింది. జూన్ 29న నామినేషన్ దాఖలకు .. జులై 2న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు అని ఈసీ(Election Commission Of India) ఇదివరకే వెల్లడించింది. జులై 18 ఎన్నికలు జరుగుతాయి. జులై 21న కౌంటింగ్ జరుగుతుంది. అయితే ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిగా తెలంగాణ (Telangana) నుంచి ఓ నామినేషన్ (Nomination) దాఖలైంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సిలివేరు శ్రీకాంత్ (Siliveru Srikanth) శనివారం ఢిల్లీలో నామినేషన్ దాఖలు చేసి సంచలనానికి తెరదీశారు. ఇంతకీ ఎవరీ శ్రీకాంత్. ఇతనికున్న అర్హతలేంటి? ఇప్పటివరకు ఎక్కడైనా పోటీ చేశారా? ఒకసారి తెలుసుకుందాం..
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ పోటీ..
సిలివేరు శ్రీకాంత్ 2018 లో హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసి ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత 2019 లో కరీంనగర్ ఎంపీగా , 2019 లో హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీలో నిలిచారు . 2020 లో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. 2021 లో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో .. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీలో నిలిచి ప్రత్యార్థులకు దడ పుట్టించారు . రోటి మేకర్ గుర్తుతో పోటీ చేశారు . తాజాగా రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది . ఇదే విషయం న్యూస్ 18 ప్రతినిధి సిల్వరి శ్రీకాంత్ ఫోన్ లో సంప్రదించగా..ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఏ ఎన్నికకైనా పోటీ చేసే అర్హత ఉందని అన్నాడు . ప్రజాస్వామ్య దేశంలో రాష్ట్రపతి గా ఎన్నికై దేశానికీ సేవచేయాలని ఉందని ఆయన చెప్పారు .
రాష్ట్రపతి (President Elections 2022) గా పోటీ చేయాలంటే లోక్ సభలో మెజారిటీ అఫ్ మెంబెర్స్ ఉండాలని అడగగా అదృష్టం ఉంటే మనమే గెలుస్తాం కావచ్చు.. గెలుపు ఓటమి తరువాత అని ఫస్ట్ రాష్ట్రపతి కి నామినేషన్ వేయాలన్నదే నా కర్తవ్యం అని శ్రీకాంత్ చెప్పాడు. గతంలో ఎంపీకి , ఎమ్మెల్యేగా పోటీ చేసి తనదైన ప్రచారం చేశానని చెప్పుకొచ్చాడు శ్రీకాంత్ . ఇప్పుడు కూడా అన్ని ప్రధాన పార్టీలను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరుతనని అంటున్నాడు.
ఏది ఏమైనా రాష్ట్రపతి గా నామినేషన్ వేయడం అనేది మాములు విషయం కాదు. రాష్ట్రపతి గా పోటీ చేయాలంటే ప్రధాన పార్టీ లు జంకుతున్నాయి అలాంటిది ఒక సాధారణ మనిషి రాష్ట్రపతి రెసులో ఉండటం మాములు విషయం కాదని రాజకీయ విశ్లేషకు అంటున్నారు . శ్రీకాంత్ ధైర్యసాహసాలకు మెచ్చుకోవాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఎన్నికల వివరాలు..
కాగా, రాష్ట్రపతి ఎన్నికల (President Elections 2022) పోలింగ్ రహస్య బ్యాలెట్ పద్ధతిలో(Secret Ballot Voting) జరుగుతుంది. ఓటింగ్ ప్రక్రియలో ఎన్నికల అధికారులు ఇచ్చే పెన్నును మాత్రమే ఉపయోగించాలి. ఈ ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు తమ ఎంపీ, ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయకూడదని ఈసీ స్పష్టం చేసింది. నామినేషన్ వేసే అభ్యర్థిని కనీసం 50 మంది బలపరచాలని పేర్కొంది. ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే ఓటర్ల మొత్తం ఓట్ల విలువ 10,86,431. పార్లమెంట్, అసెంబ్లీ ప్రాంగణాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. మొత్తం 776 మంది ఎంపీలు, 4033 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఎంపీల ఓటు విలువ 5,43,200 కాగా.. ఎమ్మెల్యేల ఓటు విలువ 5,43,231. తెలంగాణ ఎమ్మెల్యేల ఓటు విలువ 15,708. తెలంగాణ ఎంపీల మొత్తం ఓటు విలువ 16,992. ఏపీ ఎంపీల మొత్తం ఓటు విలువ 25,488 కాగా, ఏపీ ఎమ్మెల్యేల ఓటు విలుల 27,825. పార్లమెంట్‌లో, వివిధ రాష్ట్రాల్లో బీజేపీ, ఎన్డీయేకు మెజార్టీ ఉన్నప్పటికీ.. సొంతంగా రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకోలేని పరిస్థితిలో ఎన్డీయే ఉంది. దీంతో ఇతర మిత్రపక్షాల మద్దతును కూడబట్టే పనిలో బీజేపీ నాయకత్వం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.