Home /News /telangana /

KARIMNAGAR THE ED SUSPECT THAT SEVERAL TRS LEADERS FROM KARIMNAGAR AND WARANGAL MET CHIKOTI PRAVEEN THE ACCUSED IN THE CASINO CASE KNR PRV

Casino case: క్యాసినో కేసులో మరో ట్విస్ట్​.. చికోటి ప్రవీణ్​ను రహస్యంగా కలిసిన TRS నాయకులు..?

చికోటి ప్రవీణ్(file)

చికోటి ప్రవీణ్(file)

తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు , సినీతారలను కుదిపివేస్తున్న క్యాసినో ప్రకంపనలు ఇపుడు టీఆర్​ఎస్​ను.. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ ​ (Karimnagar), వరంగల్​ జిల్లాలను తాకాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar, India
    (Srinivas. P, News18, Karimnagar)

    తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు , సినీతారలు , ప్రజాప్రతినిధులను కుదిపివేస్తున్న క్యాసినో ప్రకంపనలు ఉమ్మడి కరీంనగర్ ​ (Karimnagar) జిల్లాను తాకాయి . నేపాల్ , శ్రీలంక , థాయిలాండ్ తదితర దేశాలకు తీసుకెళ్లి చికోటి ప్రవీణ్ (Cheekoti Praveen) పేకాట ఆడిస్తూ కోట్ల రూపాయల లావాదేవీలను నడిపిస్తున్న విషయం తెలిసిందే . క్యాసినోపై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టర్ ( ED ) చేపట్టిన విచారణలో.. కరీంనగర్, వరంగల్ (Warangal)​లకు చెందిన ప్రముఖ చిట్ ఫండ్ కంపెనీల ద్వారా హవాల డబ్బుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు జరిగినట్లుగా ఈడీ దర్యాప్తులో వెలుగు చూసినట్లు తెలుస్తోంది . ఒకవైపున చికోటి ప్రవీణ్​ను ఈడీ విచారణ జరుపుతున్న నేపథ్యంలోనే రెండు రోజుల క్రితమే భవితశ్రీ చిట్స్​ఫండ్స్​  , మరో భాగస్వామిగా ఉన్న కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ టీఆర్​ఎస్​ (TRS) పార్టీ నాయకులు  హైదరాబాద్ లోని ఓ రహస్య ప్రాంతంలో కలిసినట్లు ఈడీకి సమాచారం.

    క్యాసినో వ్యవహరంలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయనేతల ప్రమేయం కూడా ఉందని ప్రచారం జరుగుతుండటంతో కొంతమంది నాయకుల వ్యవహారాలపై  ఈడీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.  ఆర్థిక వ్యవహారాలన్నీ ఓ చిట్ ఫండ్ ద్వారానే నిర్వహిస్తున్నట్లు ఈడీ (ED) విచారణలో తేలినట్లు స్పష్టమవుతున్నది. మరోవైపు చిట్ ఫండ్ ఎండీ , కరీంనగర్, వరంగల్​కు చెందిన టీఆర్​ఎస్ (TRS)​ నాయకులు, రహస్యంగా చికోటి ప్రవీణ్​ను కలవడంతో ఈ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది.



    విదేశాల్లో క్యాసినో ఆటలు ఆడే వారికి అందించే డబ్బులు  చిట్​ఫండ్​ ద్వారా వెళ్తున్నాయనే ఆరోపణలు పెద్దఎత్తున వస్తున్నాయి .ఈ నేపథ్యంలో ఆ చిట్ ఫండ్ కంపెనీ చైర్మన్ , గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్  నాయకులతో పాటు మరో ప్రధాన భాగస్వామిగా ఉన్న కరీంనగర్ జిల్లా నాయకులను ఈడీ విచారిస్తుందనే  చర్చలు జోరుగా సాగుతున్నాయి.

    ఫామ్‌హౌస్‌లో కొండచిలువలు, రామచిలకలు,..

    చీకోటి ప్రవీణ్‌ చీకటి దందా ఏళ్ల క్రితం నుంచే నడుస్తోంది. గోవా, శ్రీలంక, నేపాల్‌, థాయ్‌లాండ్‌లలో క్యాసినోల నిర్వహణతోపాటు స్థానికంగానూ జూదం సాగించి అతడు పోలీసులకు చిక్కిన ఉదంతాలున్నాయి. నగరంలోని కొన్ని క్లబ్‌లు ఇతడి కనుసన్నల్లో నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నగర శివార్లలోని తన ఫామ్‌హౌస్‌లో కొండచిలువలు, రామచిలకలు, గుర్రాలు, ఉడుములు, ఆస్ట్రిచ్‌, బాతుల్లాంటి వన్యప్రాణుల్ని చీకోటి ప్రవీణ్‌ పెంచుకుంటున్నట్లు తేలింది.

    నేపాల్ అయితే ఇలాంటి వాటికి సేఫ్ అని నిర్వాహకుల నమ్మకం. అందుకే ప్రవీణ్‌ ఇటీవలి కాలంలో నేపాల్‌పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తన దందాకు ప్రచారం కోసం పలువురు సినీతారల్ని వినియోగించాడు. గత నెలలో జరిగిన క్యాసినో కోసం అమీషా పటేల్‌, ఈషా రెబ్బా, డింపుల్‌ హయతీ, ముమైత్‌ఖాన్‌తో ప్రచారం చేసి ఆ వీడియోల్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పెట్టుకున్నాడు. తాము ఆ క్యాసినోకు వస్తున్నట్లు సినీతారలతో చెప్పించి పెద్ద ఎత్తున పంటర్లను ఆకర్షించాడు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Crime news, Karimnagar, Trs, Warangal

    తదుపరి వార్తలు