Home /News /telangana /

KARIMNAGAR THE CROPS GOT INFECTED WITH PESTS AND THE COTTON CROP FELL OFF DUE TO HEAVY RAINS IN KARIMNAGAR KNR PRV

Rains in Telangana: రైతన్న కంట కన్నీరే.. పంటలకు తెగుళ్లు.. రాలిపోతున్న పత్తి పూత.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆరు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు. పత్తి పూత రాలిపోతుంది . ఇప్పటివరకు 70 వేల ఎకరాల్లో పత్తి వేసినట్లు సమాచారం.ఎడతెరిపి లేని వర్షంతో చెలక , నల్లరేగడి భూముల్లో మొక్కలు ఎర్రబడ్డాయి. సాగైన పంటలో 45 శాతం వరకు తెగుళ్లు వ్యాప్తి చెందినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇంకా చదవండి ...
  (Srinivas, P,  News 18, Karimnagar)

  కరీంనగర్ (Karimnagar) ఉమ్మడి జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు (Rains) వాగులు , వంకలు పొంగిపొర్లుతున్నాయి . లోతట్టు ప్రాంతాలు జలమయమై , రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పురాతన ఇళ్లకు నష్టం వాటిల్లింది . మంత్రులు కేటీఆర్ , గంగుల కమలాకర్ , కొప్పుల ఈశ్వర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులకు తగుసూచనలు చేశారు. అధికారులు ఎల్లంపల్లి , సుందిళ్ల బ్యారేజీల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఎస్సారెస్పీ (SRSP) గేట్లు ఎత్తడం ద్వారా మిడ్ మానేరు , ఎల్ఎండీలకు ఇన్​ఫ్లో పెరిగింది. వాగులు , వంకలు జలకళను సంతరించుకున్నాయి. పెద్దపల్లి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాను రెడ్ అలర్ట్ ప్రకటించగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది . కలెక్టర్లు ఇప్పటికే యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు.  ఆరు రోజులుగా కురుస్తున్న వర్షంతో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలుచోట్ల వరిపై వేసిన ఇసుక మేటలు మరింత కలవరానికి గురిచేస్తున్నాయి.  తెల్లబంగారాన్ని పండించే రైతులకు ఈ సారి గడ్డు రోజులేనని స్పష్టమవుతోంది .

  జిల్లాలో రెండే ప్రధాన పంటలు వరి , పత్తి కాగా పత్తి పూత రాలిపోతుంది (cotton crop fell off) . ఇప్పటివరకు 70 వేల ఎకరాల్లో పత్తి వేసినట్లు సమాచారం. ఎడతెరిపి లేని వర్షంతో చెలక , నల్లరేగడి భూముల్లో మొక్కలు ఎర్రబడ్డాయి. సాగైన పంటలో 45 శాతం వరకు తెగుళ్లు  (crops got infected with pests) వ్యాప్తి చెందినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వరి , అపరాలదీ అదే పరిస్థితి జిల్లాలో కరీంనగర్ (Karimnagar) అర్బన్ మినహా మిగతా మండలాల్లో వరి , పత్తి , అపరాలైన కంది , పెసర , మినుము పంటలను సాగు చేశారు. ఉమ్మడి జిల్లాలో వరి పంట పూర్తిగా జల సమాధి ఐనది అని చెప్పవచ్చు. ప్రస్తుతం చెరువులన్నీ నిండి అలుగు పారుతుండగా ఎల్ఎండీ , మిడ నేరు జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోం ది . మరో రెండు రోజులు భారీ నుంచి అతి వర్షం ఉండడం వల్ల  ఇప్పటికే యంత్రంగా అన్ని చర్యలు చేపడుతుంది.  అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.

  ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయని, ప్రజలు అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని ఉమ్మడి జిల్లా మంత్రులు పిలుపునిచ్చారు. మంగళవారం పెద్ద పల్లి జిల్లా కేంద్రం సమీపంలోని రంగంపల్లి, రాజీవ్ రహదారి పై వరద ఫ్లోటింగ్ కు రోడ్డు తెగి కరీంనగర్ టూ మంచిర్యాల వెళ్ళే రవాణా మొత్తం స్టాభించించింది. వెంటనే తిరుకున్న యంత్రాంగం. .కరీంనగర్ నుండి మంచిర్యాల వెళ్ళవలిసిన బస్సు లను చొప్పదండి, లక్సటిపేట మీదగా బసులను తరలించారు.

  రిపోర్టర్​ గల్లంతు..

  కాగా,  జిల్లాలో వరదలో చిక్కుకున్న  గిరిజన కూలీల న్యూస్ కవరేజ్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులు ప్రమాదంలో చిక్కుకున్నారు . రాయికల్ మండలం బోర్నపల్లికి చెందిన 9 మంది కూలీలు కుర్రులో పత్తి ఏరేందుకు వెళ్లి జలదిగ్భందనంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే . ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా యంత్రాంగం వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది . నిర్మల్ జిల్లా ఖానాపూర్ కేంద్రంగా మంగళవారం సాయంత్రం నుండి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్ఎఫ్ బృందాలు కూలీలను కాపాడే న్యూస్ కవర్ చేసేందుకు జగిత్యాలకు చెందిన ఇద్దరు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఓ కారులో బయలు దేరారు. వీరు రాయికల్ మండలం రామోజీపేట , భూపతిపూర్ గ్రామాల మధ్యలో ఉన్న కల్వర్ట్ దాటుతుండగా వాగులో ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహంలో కారు కొట్టుకపోయింది . ఇందులో ఉన్న ఓ జర్నలిస్ట్ ప్రాణాపాయం నుండి తప్పించుకుని రామోజీపేటకు చేరుకున్నాడు . ఈ సమాచారం అందుకున్న స్థానికులు కారు కోసం గాలింపు ముమ్మరం చేశారు . అయితే కారు, అందులో ప్రయాణిస్తున్న జమీర్ ( ఎన్టీవీ రిపోర్టర్ ) ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు . జిల్లా అధికార యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన కూడా ఇంతవరకు ఆచూకీ లభ్యం కాలేదు. ఇంకా చాల చోట్ల పాత ఇల్లు కూలి ముగ్గురు మృతి చెందిన ఘటనలు కూడా కలకాలం సృష్టిస్తున్నాయి. ఇంకా రెండు రోజులు వర్షాలు ఉండడం తో జనం ఆందోళనలో ఉన్నరు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Agriculture, Farmers, Heavy Rains, Karimangar

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు