హోమ్ /వార్తలు /తెలంగాణ /

Murder in Peddapalli: మళ్లీ మొదలైన గన్ కల్చర్.. గోదావరిఖనిలో సింగరేణి కార్మికుని దారుణ హత్య

Murder in Peddapalli: మళ్లీ మొదలైన గన్ కల్చర్.. గోదావరిఖనిలో సింగరేణి కార్మికుని దారుణ హత్య

మృతుడు (ఫైల్​)

మృతుడు (ఫైల్​)

పెద్దపల్లి (Peddapalli) జిల్లా గోదావరిఖని గంగానగర్ లో జరిగిన సింగరేణి కార్మికుని దారుణ హత్య (Brutal Murder)సంచలనం రేపింది. గత కొంత కాలం తర్వాత మళ్లీ కోల్ బెల్ట్ లో గన్ కల్చర్ (Gun culture) మొదలయింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  పెద్దపల్లి (Peddapalli) జిల్లా గోదావరిఖని గంగానగర్ లో జరిగిన సింగరేణి కార్మికుని దారుణ హత్య (Brutal Murder)సంచలనం రేపింది. గత కొంత కాలం తర్వాత మళ్లీ కోల్ బెల్ట్ లో గన్ కల్చర్ (Gun culture) మొదలయింది. పథకం ప్రకారమే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని పెద్దపల్లి డిసిపి రూపేష్ పరిశీలించి, దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన కోరుకొప్పుల మొండయ్య అమృత దంపతుల కుమారుడు రాజేందర్‌కు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట్‌ గ్రామానికి చెందిన రవళితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఆదిత్య (7), కార్తికేయ (4) సంతానం. రాజేందర్‌ శ్రీరాంపూర్‌ ఏరియా ఆర్కే–7లో జనరల్‌ మజ్దూర్‌గా పనిచేస్తున్నాడు.

  గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి దాటిన తర్వాత తుపాకితో కాల్చి దారుణంగా హత్య చేశారు. నిద్ర మత్తులో ఉన్న రాజేందర్ ను శాశ్వతంగా మృత్యు ఒడిలోకి పంపించేశారు. మంచిర్యాల జిల్లా ఆర్కె న్యూటెక్ బొగ్గు గని లో జనరల్ మజ్దురుగా పనిచేసే రాజేందర్ నిత్యం అక్కడికి వెళ్లి గోదావరిఖని గంగానగర్ లోని తన సొంత ఇంటికి వస్తూ ఉండేవాడు. అయితే శుక్రవారం మధ్యాహ్నం డ్యూటీ కి వెళ్లి అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు. భార్య ఇద్దరు పిల్లలతో ఉండే రాజేందర్ ను నిద్రమత్తులో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపి పరారయ్యారు.

  అయితే సమీపంలో ఉన్న సీసీ కెమెరా ఆధారంగా కొంతమంది రాత్రి రెండున్నర తర్వాత వచ్చి పోయినట్లు తెలుస్తుంది. సంఘటన స్థలాన్ని పెద్దపల్లి డీసీపీ రూపేష్, గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్, వన్ టౌన్ పోలీసులు పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డీసీపీ మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తులు గన్ తో కాల్చి చంపారని తెలిపారు. సంఘటన సంబంధించిన కారణాలు పరిశీలిస్తున్నామన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని, సీసీ ఫుటేజీ ఆధారంగా ఎంక్వయిరీ చేస్తున్నామని చెప్పారు. అలాగే ఫోరెన్సిక్, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ద్వారా పరిశీలిస్తున్నామని తెలిపారు.

  Mulugu: మన్యం పరిధిలో హై టెన్షన్: భద్రాద్రి కొత్తగూడెం - ములుగు సరిహద్దుల్లో ఎన్​కౌంటర్ ​?

  సీసీ పుటిజ్ చూశాక పూర్తి విషయాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ప్రేమ వ్యవహారమే కారణం కావచ్చు అని పోలీసులు అంటున్నారు. గతంలో కూడా ఇతనిపై దాడి కూడా జరిగినట్టు పోలీసులు నిర్దారించారు.

  వివాహేతర సంబంధమా?

  భార్య రవళికి పెళ్లికి ముందే తన మేనబావ, కిష్టంపేట్‌కు చెందిన బందం రాజుతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా చంపించాలని భావించింది. కొన్నాళ్ల క్రితం విధులు ముగించుకుని ఇంటికి ద్విచక్రవాహనంపై వస్తున్న రాజేందర్‌ను కారుతో ఢీకొట్టి చంపించేందుకు ప్రయత్నించగా..త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ప్రమాదంగా భావించి పెద్దగా పట్టించుకోలేదు. మరోసారి ఇంటిముందు గేట్‌కు కరెంట్‌ పెట్టి చంపాలని ప్రయత్నించగా..దాన్ని కూడా ప్రమాదంగానే రాజేందర్‌ భావించాడు. అయితే తాజా ఘటనతో అవి ప్రమాదంగా పరిగణించలేమని స్థానికులు చెబుతున్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Murder, Peddapalli

  ఉత్తమ కథలు