హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nature Lover: 70 ఏళ్ళ మర్రి చెట్టు ఎండిపోతుంటే చూడలేకపోయాడు.. దానిని వేరే చోట నాటాడు.. తర్వాత ఏమైందంటే..

Nature Lover: 70 ఏళ్ళ మర్రి చెట్టు ఎండిపోతుంటే చూడలేకపోయాడు.. దానిని వేరే చోట నాటాడు.. తర్వాత ఏమైందంటే..

70 ఏళ్ళ మర్రి చెట్టుకు పునర్జన్మను పోసిన ప్రకృతి ప్రేమికుడు..డాక్టర్ ప్రకృతి ప్రకాష్ ప్రత్యేక చొరవ తో మఱ్ఱి చెట్టు కు పునర్జన్మచెట్టును ట్రాన్స్ ప్లాంటేషన్ పరిజ్జానంతో మరోచోటకు తలించి శాశ్వతంగా బతికించడు. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

70 ఏళ్ళ మర్రి చెట్టుకు పునర్జన్మను పోసిన ప్రకృతి ప్రేమికుడు..డాక్టర్ ప్రకృతి ప్రకాష్ ప్రత్యేక చొరవ తో మఱ్ఱి చెట్టు కు పునర్జన్మచెట్టును ట్రాన్స్ ప్లాంటేషన్ పరిజ్జానంతో మరోచోటకు తలించి శాశ్వతంగా బతికించడు. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

70 ఏళ్ళ మర్రి చెట్టుకు పునర్జన్మను పోసిన ప్రకృతి ప్రేమికుడు..డాక్టర్ ప్రకృతి ప్రకాష్ ప్రత్యేక చొరవ తో మఱ్ఱి చెట్టు కు పునర్జన్మచెట్టును ట్రాన్స్ ప్లాంటేషన్ పరిజ్జానంతో మరోచోటకు తలించి శాశ్వతంగా బతికించడు. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

  (P.Srinivas,News18,Karimnagar)

  మూడు నెలల క్రితం గతంలో ఎన్నడూ చూడని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. భారీ వర్షాలకు జిల్లాలోని కోనారావుపేట మండలం సుద్దాల గ్రామ శివారులో బుర్ర భూమయ్య గౌడ్, బుర్ర రమేష్ గౌడ్ ల వ్యవసాయ క్షేత్రంలో ఉన్న70 ఎండ్ల మఱ్ఱి చెట్టు కూకటి వేళ్ళతో పెకిలి పోయింది. నీరు అందక కొద్ది రోజులకు మఱ్ఱి చెట్టు మోడు గా మారింది. చూపరులకు నిర్జీవంగా దర్శనం ఇస్తుంది. అదే గ్రామానికి చెందిన ప్రకృతి ప్రేమికుడు, వృక్షో రక్షతి రక్షితః అనే మాటలను త్రికరణ శుద్ధి గా నమ్మే వ్యక్తి డాక్టర్ దొబ్బల ప్రకాష్ ఈ దృశ్యాన్ని చూసాడు. మొన్నటి వరకూ... మహా వృక్షంగా టివిగా నిలబడి ఎంతో మందికి నీడ నిచ్చి ... ప్రాణులు, పక్షులకు గూడు గా నిలిచిన చెట్టే ప్రకృతి వైపరీత్యానికి నిస్సహాయంగా, నిర్జీవంగా ఉండడం చూసి కలత చెందాడు.

  Gurukula Teachers: వారిద్దరు ఏకాంతంగా ఉండగా వీడియో షూట్.. పాఠశాలలోనే ఇలాంటి ఘోరం.. చివరకు ఏమైందంటే..


  ఆయువు తీరిందని ప్రజలు భావిస్తున్న మఱ్ఱి చెట్టుకు నీటిని అందిస్తే మఱ్ఱి వృక్షానికి ఆయువు తిరిగి పోయవచ్చు అని భావించాడు. అనుకున్నదే తడవుగా... రైతు బుర్ర భూమయ్య గౌడ్, బుర్ర రమేష్ గౌడ్ ల తో మాట్లాడాడు. మోడు వారిన చెట్టుకు తిరిగి ప్రాణం పోసి ఇక్కడ నుంచే మరో చోటికి తరలిస్తాననీ తెలిపాడు. పక్కనే గల రైతు దొబ్బల దాస్ వ్యవసాయ క్షేత్రo లోని బావి నీటిని వాడుకునేందుకు నీటినీ వాడుకునేందుకు అనుమతి తీసుకున్నాడు. అతడు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజా సంబంధాల అధికారి కార్యాలయంలో తెలంగాణ సాంస్కృతిక సారథి గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే రెండు నెలల పాటు క్రమం తప్పకుండా చెట్టు కు నీటిని అందించాడు. ప్రకాష్ కృషి ఫలించింది. క్రమంగా చెట్టు తిరిగి చిగురించడం ప్రారంభించింది. ఆ విషయాన్ని గమనించిన ప్రకాష్ ద్విగుణీకృత ఉత్సాహంతో రెండు నెలల పాటు నీటిని పట్టాడు.

  Lawer-Young Women: అతడు ఒక లాయర్.. కానీ ఆ అమ్మాయి జీవితంలో మాయని మచ్చ తీసుకొచ్చాడు.. ఏం జరిగిందంటే..


  ఇంకా కొనసాగిస్తున్నాడు. ఫలితంగా మోడు వారిన చెట్టు చిగురించిన ఆకులతో పచ్చగా దర్శనం ఇస్తుంది.చెట్టు వేళ్ళు బయటకి రావడంతో... వెళ్లకు ఉన్న మట్టిని తడపడం ద్వారా చెట్టుకు ప్రకాష్ ప్రాణం పోశారు. అయితే వేళ్ళు బయట ఉండడంతో నీరు పడుతుంటే మట్టి కొద్ది కొద్దిగా ఊడి పోతుంది.చాలా కాలం ఇలాగే ఉంటే మట్టి పూర్తిగా తొలగి పోయి చెట్టు చనిపోయే ప్రమాదం ఉందని ... అలా అయితే 70 ఎండ్ల చెట్టు ఆయువు శాశ్వతంగా పోతుందని ప్రకాష్ ఆందోళన చెందడు . అలా జరగకుండా ఉండాలంటే సాధ్యమైనంత త్వరగా మఱ్ఱి చెట్టు నుట్రాన్స్ ప్లాంటేషన్ పరిజ్జానంతో ఒకచోట నుంచి మరోచోటకు తరలించి నాటడమే పరిష్కార మార్గo అని అక్కడున్న మర్రి చెట్టును తమ గ్రామంలోని స్కూల్ కు తరలించి విద్యార్థులకు నీడ నిచ్చేలా ట్రాన్స్ ప్లాంటేషన్ చేసాడు. .ట్రాన్స్ ప్లాంటేషన్ కు  లిఫ్ట్ చేయడం, వాహనంలో తరలించడం, తిరిగి నాటడం చేయాలి.

  అందుకు రూ. 1 లక్ష రూపాయలు ఖర్చు ఐనట్టు ప్రకాష్ తెలిపాడు. చెట్టు కు ప్రాణ మైతే పోయగలిగాడు గానీ.. ఇంకా కొంత డబ్బు ఖర్చు అవుతుందని  ఖర్చు ను వెచ్చించే డబ్బు తన వద్ద లేదు.. దాతలు ఎవరైనా ముందుకు వస్తే... 70 ఎండ్ల వయస్సు ఉన్న మఱ్ఱి చెట్టు ను శాశ్వతంగా కాపాడుకోగలమని ప్రకాష్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పిలుపు... పద్మశ్రీ వనజీవి రామయ్య స్ఫూర్తి తో దొబ్బల ప్రకాష్ రాజన్న సిరిసిల్ల జిల్లా లో పచ్చదనం పెంచేందుకు తనవంతు సామాజిక బాధ్యతగా వృక్షాలను రక్షిస్తే అవి మిమ్మల్ని రక్షిస్తాయి అని నమ్మి అనేకమొక్కలు నాటాడు.

  Christmas-Central Government: : కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు క్రిస్మ‌స్ కానుక‌.. డీఏ, డీఆర్ విషయంలో కీలక నిర్ణయం..?


  వేసవి కాలం విత్తనాలను సేకరించి వర్షాకాలం డ్రోన్ సహాయంతో జిల్లాలోని గుట్టల్లో వాటిని జార విడిచి పచ్చదనం పెంచేందుకు కృషి చేశాడు.తద్వారా దొబ్బల ప్రకాష్ .... ప్రకృతి ప్రకాష్ గా జిల్లాలో పాపులర్ అయ్యాడు. ఇతని సేవలను గుర్తించిన తమిళనాడుకు చెందిన ఓ విశ్వ విద్యాలయం సామాజిక సేవా విభాగంలో డాక్టరేట్ ను ప్రదానం చేసింది. పర్యావరణ పరిరక్షణ కు ప్రకాష్ చేస్తున్న సేవలకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు పొందాడు.

  First published:

  Tags: Karimnagar, Nature

  ఉత్తమ కథలు