(న్యూస్ 18 తెలుగు కరస్పాండెంట్ శ్రీనివాస్. పి)
కరీంనగర్ (Karimnagar) జిల్లా చిగురుమామిడి మండలంలోని ఓ ఉపాధ్యాయుడు పరస్పర బదిలీపై ఇతర జిల్లాలకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నారనే విషయం తెలుసుకున్న పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు బదిలీ కోసం ఫోన్లో ఆయన్ను సంప్రదించారు. సదరు ఉపాధ్యాయుడు మీ నుంచి కొంత ఆశిస్తున్నట్లు సమాధానమిచ్చి , బయట పెద్దమొత్తంలో నడుస్తుందని చెప్పారు. కరీంనగర్ జిల్లాకు బాగా డిమాండ్ ఉందని బేరాలు ఆడారు. దాదాపు రూ . 10 లక్షల వరకు డిమాండ్ చేస్తూ సంభాషించారు . ఇది గురువారం వాట్సాప్ గ్రూపుల్లో (WhatsApp groups) చక్కర్లు కొట్టింది .
తెలంగాణలో గత కొద్దిరోజులుగా ఉపాధ్యాయ బదిలీలు, కేటాయింపులు (Teachers allotments) హాట్ టాపిక్‌గా మారాయి. కొత్త జిల్లాలకు కేటాయింపుల (Allotment to new districts) అనంతరం ఉపాధ్యాయులు పలువురు పరస్పర బదిలీలపై దృష్టి నిలిపారు . వారు కోరుకుంటున్న జిల్లాకు సాధారణ బదిలీల్లో (Transfers) వెళ్లే అవకాశం బంద్ కావడంతో పరస్పర బదిలీపై వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు . అవసరమైతే లక్షల రూపాయలను ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదు .
ఇది కూడా చదవండి: మద్యం తాగిన భర్త కిడ్నాప్.. భర్త ప్రాణాల కోసం మానాన్ని పణంగా పెట్టిన ఇల్లాలు.. ఆ రాత్రి ఏం జరిగిందంటే..
కొందరు ఉపాధ్యాయులు (Teachers) ఈ వ్యవహారానికి మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి . స్థానికతకు ప్రాధాన్యం లేకుండా సీనియారిటీ (Seniority) ప్రకారం కొత్త జిల్లాలకు కేటాయింపులు జరపడంతో చాలా మంది ఉపాధ్యాయులు సొంత జిల్లాలకూ దూరంగా పక్క జిల్లాలకు వెళ్లారు . ఉపాధ్యాయులుగా ఉన్న భార్య , భర్తలు తలో జిల్లాకు కేటాయించారు . ఇలాంటి వారు పరస్పర బదిలీల కోసం ఎదురుచూస్తూ ఇలాంటి అడ్డదారులను వెతుక్కుంటున్నారు.
ఇది కూడా చదవండి: అయ్యో ఎంత పని చేశావమ్మా... డాక్టర్ చెప్పాడని నిండు గర్భిణి అయి ఉండి ఇంతటి కఠోర నిర్ణయం తీసుకున్నావా..? .
పరస్పర బదిలీపై డబ్బులు..
మరో వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సైతం ఈ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, మార్గదర్శకాలే జారీ తరువాయి కావడంతో పరస్పర బదిలీల బేరసారాలు మరింత ఊపందుకున్నాయి . పరస్పర బదిలీపై డబ్బులు తీసుకుని ఎక్కడికైనా వెళ్లేందుకు ముందుకు వస్తున్న వారు ఇందు కోసం జిల్లా , మండలాన్ని బట్టి లక్షల్లో డిమాండ్ చేస్తున్నారు .
వివిధ రకా వ్యాపారాలున్న వారు , స్పౌజ్ కేటగిరిలోని వారు ఇలా బదిలీపై వచ్చేందుకు అత్యధికంగా ఆసక్తి చూపుతున్నారు . హెచ్ఐస్ఏ పొందే అవకాశం గల బడులకు ఇంకా ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేస్తున్నారు . సర్వీసు ఎక్కువగా ఉన్న మరికొందరు స్థానిక జిల్లాకు వెళ్లేందుకు పరస్పర బదిలీ ఇచా వారి కోసం వెతుకుతున్నారు . పదవీ విరమణకు తక్కువ కాలం ఉన్న వారు అందినంత దండుకుంటున్నారనే చర్చ జరుగుతోంది .
ఇవి కూడా చదవండి : రైతులకు సీఎం కేసీఆర్ చెబుతానన్న గుడ్‌న్యూస్ అదేనా.. రైతులకు ఫించన్ ఇచ్చే యోచనలో తెలంగాణ సర్కారు?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Employees, Karimnagar