KARIMNAGAR TELANGANA CONGRESS LEADERS HAVE STARTED WORK ON A PLAN TO BRING ABOUT 6 LAKH PEOPLE TO THE RAHUL GANDHI MEETING TO BE HELD IN WARANGAL KNR PRV
Rahul gandhi waragal Meeting: రాహుల్ గాంధీ తెలంగాణ టూర్‌పై అలర్ట్.. 6 లక్షల మందితో సభ.. టీ కాంగ్రెస్ ప్రణాళికలివే..
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)
మే 6 న వరంగల్‌లో నిర్వహించనున్న రైతు సంఘర్షణ సభకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు . ఈ సభకు జన సమీకరణతోపాటు ఇతర అంశాలపై చర్చించేందుకు టీ కాంగ్రెస్ సిద్ధమైంది.
మే 6 న వరంగల్ (Warangal meeting)లో నిర్వహించనున్న రైతు సంఘర్షణ సభకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul gandhi) హాజరుకానున్నారు . ఈ సభకు జన సమీకరణతోపాటు ఇతర అంశాలపై చర్చించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth reddy) సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు కరీంనగర్ (Karimnagar)జిల్లా కాంగ్రెస్ పార్టీ (T Congress) కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరుకానున్నారు. రేవంత్ రెడ్డి గారితో పాటు , రాహుల్ గాంధీ బహి రంగ సభ కరీంనగర్ పార్లమెంట్ పీసీసీ ఇన్‌ఛార్జి , మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి , ఉమ్మడి జిల్లాకు చెందిన మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ , నాలుగు జిల్లాలకు చెందిన డీసీసీ అధ్యక్షులు పాల్గొననున్నా రు .
ఈ సమావేశానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మండల కాంగ్రెస్ , బ్లాక్ కాంగ్రెస్ , నగర , పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు , కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు , పీసీసీ , డీసీసీ కార్యవర్గ సభ్యులు , అనుబంధ సంఘాల అధ్యక్షులతో పాటు , ఇత ర ముఖ్య నాయకులు హాజరుకానున్నారు . రాహుల్ గాంధీ పర్యటన (Rahul gandhi tour)కు సంబంధించి జన సమీకరణ , ఇతర అంశాలు, పార్టీ నేతలను సమన్వయ పరిచేందుకు కరీంనగర్ ఇన్‌చార్జీగా మాజీ మంత్రి షబ్బీర్ అలీని టీపీసీసీ నియమించింది . మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబును మహబూబాబాద్ జిల్లాకు ఇన్ఛార్జిగా నియమించారు .
50 కిలోమీటర్ల లోపు 10 వేలమంది..
హన్మకొండలో జరిగే రాహుల్ సభ (Rahul meeting)ను 6 లక్షల మందితో నిర్వహించాలని టీపీసీసీ (TPCC) నిర్ణయించింది . వరంగల్ , హన్మకొండ జిల్లాలకు సమీపంలో ఉండే ఉత్తర తెలంగాణ జిల్లాలు ఇందులో కరీంనగర్ , సిద్దిపేట జిల్లాల నుంచి ఎక్కువ సంఖ్యలో పార్టీ నేతలు , కార్యకర్తలను సమీకరించాలని నిర్ణయించారు . ఈ క్రమంలోనే సోమవారం రేవంత్ రెడ్డి కరీంనగర్‌కు రాను న్నారు.
పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు , నాయకులకు దిశానిర్దేశం చేయడంతోపాటు ముఖ్యనేతలతో రాహుల్ సభపై సమీక్షించనున్నారు. రాహుల్ గాంధీ బహిరంగ సభ జరిగే వరంగల్ జిల్లాకు 50 కిలోమీటర్ల లోపు ఉన్న మండలాల నుంచి 10 వేల మంది చొప్పున కార్యకర్తలను ప్రజలను సమీకరించాలని నిర్ణయించారు . అలాగే 70 కిలోమీటర్ల దూరం ఉంటే ఐదు వేలు , వంద కిలోమీటర్లపై దూరం ఉంటే 3 వేల చొప్పున రాహుల్ సభకు తరలించాలని నిర్ణయించారు .
పార్టీ పునర్వవైభవం కోసం..
వరంగలు 50 కిలో మీటర్ల పరిధిలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని హుజురాబాద్ , కమలా పూర్ , ఎల్కతుర్తి , భీమదేవరపల్లి మండ లాలు ఉంటాయి . ఈ మండలాలు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోనివి . కనుక మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పై ఈ మండలాల నుంచి ఎక్కువ జనసమీకర ణ బాధ్యత ఉంటుంది . ఇప్పటికే ప్రభాకర్ పార్టీ పునర్వవైభవం కోసం యాత్ర ప్రారంభించారు . హుజురాబాద్ తరువాత 70 కిలోమీటర్ల దూరంలో కరీంనగర్ నగరంతోపాటు మానకొండూరు , తిమ్మాపూర్ , హుస్నాబాద్ , సైదాపూర్ మండలాలు ఉంటాయి. ఇక్కడి మండ లాల నుంచి ఐదు వేల చొప్పున తరలిం చాల్సి ఉంటుంది.
మానకొండూరు ఇన్చార్జీ , పార్టీ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ , హుస్నాబాద్ ఇన్చార్జీ బొమ్మ శ్రీరాంచక్రవర్తి , నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిలపై ఎక్కువ బాధ్యత ఉంటుంది . బొమ్మ శ్రీరాం, నరేందర్ రెడ్డిలు ఇప్పటికే తమ తమ ప్రాంతంలో పర్యటిస్తున్నారు .
ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు..
టీపీసీసీ అధ్యక్ష హోదాలో మొదటి సారి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి వస్తుండటంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు . రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రచారానికి వచ్చారు . పార్టీ సమావేశానికి రావడం ఇదే మొదటి సారి. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా నుంచి పార్టీ నాయకులతోపాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు . ఘన స్వాగతం పలికేందుకు జిల్లా కాంగ్రెస్ , నగర కాంగ్రెస్ నేతలు ఆదివారం సమావేశమయ్యారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ స్థానిక నేతలకు దిశానిర్దేశం చేశారు . రేవంత్ రెడ్డికి రాజీవ్ బైపాస్ నుంచి ఇందిరా భవన్ వరకు స్వాగతం పలకాలని నిర్ణయించారు .
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.