(P.Srinivas,New18,Karimnagar)
బంగారు తెలంగాణగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. అందులో భాగమే యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చారు. తెలంగాణ తిరుమలగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ మరో పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలోని రెండో అతిపెద్ద పవిత్రక్షేత్రంగా మార్చాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకోసమే ఈనెల 14తేదిన జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని కొండగట్టు (Kondagattu)ఆంజనేయస్వామి దేవస్థానాన్ని(Anjaneyaswamy Devasthanam)పరిశీలిస్తారని తెలుస్తోంది.
14న కొండగట్టుకు కేసీఆర్ ..
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈనెల 14వ తేదిన జగిత్యాల జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. జిల్లాలోని మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానాన్ని దర్శించుకుంటారు. అటుపై ఆలయ అభివృద్దికి సంబంధించిన పనులపై చర్చిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే యాదాద్రిని అభివృద్ధి చేసిన సీఎం కేఆర్ తెలంగాణలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అందుకే దేవస్థానం అభివృద్ధికి 100కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. సీఎం పర్యటన నేపధ్యంలో కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయు కాలేజీలో హెలిప్యాడ్‌ను పరిశీలించారు జిల్లా ఎస్పీ భాస్కర్. జిల్లా అధికారులు సైతం సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
మరో ఆలయానికి మహర్ధశ..
కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం అభివృద్ధి పనులు...ఆలయంలో చేపట్టాల్సిన పునః నిర్మాణ పనులపై మాస్టార్ ప్లాన్ రూపొందించేందుకు ప్రముఖ ఆర్కిటెక్ ఆనంద్ సాయి ఆదివారం కొండగట్టుకు వెళ్లనున్నారు. ఆలయ అభివృద్దిపై ఆనంద్ సాయి మాస్టర్ ప్లాన్ సిద్దం రూపొందించనున్నారు. యాదాద్రి ఆలయ పునః నిర్మాణ పనులు, ఆలయ గోపురాల డిజైన్స్ రూపొందించింది ఆనంద్‌సాయినే. అందుకే ఇప్పుడు కొండగట్టు ఆంజనేయస్వామి టెంపుల్ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఆయనకు అప్పగించినట్లుగా తెలుస్తోంది.
సెంటిమెంట్..
తెలంగాణలో కొండగట్టు దేవాలయం వాహన పూజలతో పాటు ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే ఆలయాల్లో ప్రముఖమైనది. అందుకే ఇటీవలే జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ సైతం తన ఎన్నికల ప్రచార వాహనం వారాహికి ఇక్కడే పూజలు నిర్వహించారు. ఇక్కడి నుంచే తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. పొలిటికల్‌గానే కాకుండా చాలా మందికి ఈ ఆలయం సెంటిమెంట్‌గా చూస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Jagityal, Telangana new secretariat