Etala Rajender-Bjp: హుజూరాబాద్ గెలుపుతో కేసీఆర్ కు సరైన మొనగాడని నిరూపించుకున్న నేత ఈటెల. అరంగేట్రంతోనే బీజేపీలో టాప్ లీడర్ గా ఎదిగిన నాయకుడు . అందుకే , ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ లేకున్నా .. బీజేపీలో అధిక ప్రాధాన్యం లభిస్తోంది . ఒక్క గెలుపుతో అధిష్టానం దృష్టిలో పడ్డాడు.
హుజూరాబాద్ (Huzurabad) గెలుపుతో కేసీఆర్(KCR) కు సరైన మొనగాడని నిరూపించుకున్న నేత ఈటెల (Etala). అరంగేట్రంతోనే బీజేపీలో టాప్ లీడర్ గా ఎదిగిన నాయకుడు . అందుకే , ఆర్ఎస్ఎస్(RSS) బ్యాక్ గ్రౌండ్ లేకున్నా .. బీజేపీలో అధిక ప్రాధాన్యం లభిస్తోంది . ఒక్క గెలుపుతో అధిష్టానం దృష్టిలో పడ్డాడు. ఎమ్మెల్సీ పోటీలో రవీందర్సింగ్ను బరిలో నిలిపి ఢిల్లీ దృష్టిని ఆకర్షించారు. కావలసినంత ఆర్థిక బలం.. అంతులేని అనుచర గణం.. ఉద్యమ నేతగా అభిమాన దళం , ప్రభుత్వంలో.. పాలనలో సుదీర్ఘ అనుభవం.. ఇవి చాలవా ఈటల రాజేందరన్ను మరింత ఎత్తుకు తీసుకెళ్లడానికి. ఇప్పుడిదే జోరుగా చర్చ జరుగుతోందని అంటున్నారు.
త్వరలోనే ఈటల రాజేందరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తారంటూ సోషల్ మీడియా లో.. రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి.. తెలంగాణ ప్రెసిడెంట్గా బండి సంజయ్ ఉన్నారు అనే అనుమానంరావొచ్చు . అంతకుముందు కె.లక్ష్మణ్ కూడా ఉన్నారుగా .. అలానే , ఇప్పుడు బండి సంజయ్ ఉన్నారు. బీజేపీ వ్యక్తుల పార్టీ కాదు .. సిద్ధాంత పార్టీ , దమ్మున్న పార్టీకి దమ్మున్న లీడర్ ఈటెల అంటూ ఇప్పుటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ చర్చ జరుపుతున్నారు. 22 సంవత్సరాలు రాజకీయ అనుభవం, రెండుసార్లు మంత్రిగా.. ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిగా ఈటెల ప్రాధాన్యత ఉంది. దీని దృష్టిలో పెట్టుకొని బిజెపి అధిష్టానం ఈటెలకు తెలంగాణ బిజెపి చీఫ్ ఇవ్వాలని చూస్తుందని రాజకీయ వర్గాలలో గుసగుసలు వినబడుతున్నాయి. ఈటెల రాజేందర్ బిజెపి తీర్థం విచ్చుకున్న నాటినుండి బిజెపిలో ఈటల రాజేందర్ చురుకైన పాత్ర పోషిస్తూ మంచి దూకుడు మీద ఉన్నాడని.. కచ్చితంగా కొద్దిరోజుల్లోనే ఈటెల ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం ఖామయని బీజేపీ శ్రేణులు అంటున్నారు.
భూ వివాదం విషయంలో అక్రమాలకు పాల్పడ్డాడని టీఆర్ఎస్ నుంచి పార్టీ నుంచి టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేసిన విషయం విధితమే. దాని తర్వాత పరిణామాలు రాజకీయ కోణాలు ఎన్నో మలుపులు తిరిగాయి. తదనంతరం ఈటెల బీజేపీ లోకి వెళ్లడం.. వెంటనే ఎన్నికలు రావడం అన్నీ చకచకా జరిగిపోయాయి. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై 25,000 పైచిలుకు ఓట్లతో గెలుపొందాడు. తర్వాత అన్ని జిల్లాలో పరామర్శల తో బిజీబిజీగా ఉంటున్నాడు. మరి చూడాలి ఈ వార్త ఎంత వరకు నిజమనేది. ఇద గనుక నిజమైతే అధికార టీఆర్ఎస్ కు వచ్చే ఎన్నికలో బీజేపీ నుంచ గట్టి పోటీ ఎదురు కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.