తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay)పుత్రరత్నం బండి సాయి భగీరథ్ (Bandi Sai Bhageerath)రెండ్రోజుల క్రితం మహీంద్ర యూనివర్సిటీ(Mahindra University)లో జూనియర్‌ని కొట్టిన వీడియో వైరల్(Video viral)అయింది. ఆ సంఘటనకు సంబంధించి కరీంనగర్( Karimnagar)ఎంపీ కుమారుడిపై పోలీస్ కేసు నమోదైంది. ఈ మొత్తం ఎపిసోడ్ పూర్తిగా మర్చిపోక ముందే బండి సంజయ్ కుమారుడు భగీరథ్ మరొక యువకుడ్ని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో.. ఓ యువకుడు అద్దం ముందు కూర్చుంటే అతడి చుట్టూ చాలా మంది గుమీ కూడి కొట్టారు. వాళ్లలో బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ కూడా ఉన్నాడు. అందరూ బూతులు తిడుతూ కాళ్లు, చేతులతో దాడి చేస్తూ ఉన్నారు. మరికొందరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇదంతా అక్కడే ఉన్న మరొక వ్యక్తి వీడియో తీయడంతో ఎంపీ బండి సంజయ్ పుత్రరత్నం దౌర్జన్య పర్వం మరోసారి బయటపడినట్లైంది. దీనిపైనే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా విద్యార్ధి సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు.
రెండో వీడియో రచ్చ..
రెండ్రోజుల క్రితం బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మహీంద్ర యూనివర్సిటీలో ర్యాగింగ్ పేరుతో ఓ జూనియర్‌ని కొట్టాడు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయింది. బండి సాయి భగీరథ్‌పై హైదరాబాద్ శివారులోని దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఐపీసీ 341, 323, 504, 506, 34 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే బండి సాయి భగీరథ్ మొదటి వీడియో వైరల్ అయిన తర్వాత బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. తన కుమారుడు సాయి తప్పు చేస్తే అతడ్ని తానే పోలీస్ స్టేషన్లో అప్పగిస్తానన్నారు. పిల్లలు ఇప్పుడు కొట్టుకున్నా తర్వాత కలిసిపోతారని అన్నారు. కేసులు పెట్టి వారి జీవితాలను నాశనం చేయడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులపై అటు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరువు తీస్తున్న బండి పుత్రరత్నం..
మొదటి వీడియోలో సాయి భగిరథ్ చేతిలో తన్నులు తిన్న యువకుడు తాను తప్పు చేసిన అందుకే సాయి కొట్టాడని చెప్పడం కొసమెరుపు అయితే..మరో వీడియోలో ఇంకొకడ్ని కొడుతూ బండి సంజయ్ పుత్రరత్నం అడ్డంగా దొరికిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా గ్రూప్‌లో వైరల్ అవుతోంది.
విద్యార్థిపై బండి సంజయ్ కొడుకు భగీరథ్ దాడి.. మరో వీడియో వైరల్ #BandiSanjaySong #BandiSanjay #ViralVideo pic.twitter.com/CZIiiT7I1Q
— News18 Telugu (@News18Telugu) January 18, 2023
మరి ఈ వీడియోపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎలా స్పందిస్తారో...తన కొడుకును ఎలా సమర్ధించుకుంటారో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Telangana News