(Srinivas, News18, Karimnagar)
ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు (Mutual transfer of teachers) తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు మోక్షం కల్పించడంతో ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్ని నెలలుగా బదిలీల (Teachers Transfer) కోసం ఎదురుచూస్తున్న కరీంనగర్ (Karimnagar) జిల్లాలోని ఉపాధ్యాయులు ఉత్తర్వులు వెలువడటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు . గత డిసెంబరు , జనవరి నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపుల్లో (Teachers Allotments) వారిని వివిధ జిల్లాలకు కేటాయించారు.
స్థానికంగా ఉంటున్న జిల్లా కాకుండా దూర ప్రాంతాలకు బదిలీ కావడం , సీనియారిటీ జాబితాలపై ఆక్షేపణలు వ్యక్తం చేస్తూ పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలని పెద్దసంఖ్యలో జిల్లాలోని ఉపాధ్యాయులు విద్యాశాఖకు విజ్ఞప్తులు పెట్టుకున్నారు . అప్పటి నుంచి బదిలీల కోసం ఎదురుచూస్తుండగా , కోర్టు కేసు నేపథ్యంలో జాప్యం నెలకొంది . సోమవారం పరస్పర బదిలీలకు దరఖాస్తు పెట్టుకున్న వారిలో 71 మంది ఉపాధ్యాయులకు కరీంనగర్ జిల్లాకు బదిలీ (Teachers Transfer) చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది .
రూ. 10 నుంచి 15 లక్షలు..
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్ (Karimnagar) మినహా మిగిలిన ఆరు జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు 71 మంది కరీంనగర్ జిల్లాకు పరస్పర బదిలీ రాగా , వారికి సమ్మతి తెలిపిన ఉపాధ్యాయులు ఆయా జిల్లాలకు బదిలీపై వెళుతున్నారు . పరస్పర బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందనే విషయం తెలిసిన నాటి నుంచి కరీంనగర్ జిల్లాకు వచ్చేందుకు చాలా మంది లక్షల రూపాయలు ఆసక్తి చూపిన చాలా మంది ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లే వారితో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
ఇక బదిలీలకు (Teachers Transfer) తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో ఒప్పందం కుదర్చుకున్న టీచర్స్కి ఇప్పుడు దడ మొదలయింది. దాదాపు రూ. 10 నుంచి 15 లక్షలకు పరిస్పర అంగీకార బదిలీల కు ఒప్పందం కుదుర్చుకున్న టీచర్స్ డబ్బులు ఇవ్వాలని ఫోన్ కాల్స్ రావడం తో తలలు పట్టుకుంటున్నారు.
ఒక పక్క ఆనందం మరో పక్క దుఃఖం తో ఉన్నట్లు సమాచారం. బదిలీలకోసం ఇప్పటికే సంగం చెల్లించిన టీచర్స్ ఇప్పుడు మొత్తం కట్టవలిసిన అవసరం ఉండడం తో మళ్ళీ అప్పు చేయవలిసిన పరిస్థితి నెలకొన్నదని టీచర్స్ తలలు బాదుకొంటున్నారు.. ఇప్పటికే అరకొర వసతులతో ఆగం అవుతుంటే ములిగే నక్కమీద తాటి పండు పడ్డటు ఉంది గవర్నమెంట్ టీచర్స్ పరిస్థితి.. చూడాలి మరి ఉపాధ్యాయులు ఎటు వైపు మొగ్గు చూపుతారో మరి డబ్బా..? ఉద్యోగమా..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karimangar, Money Transfer, Teacher jobs