(P.Srinivas,New18,Karimnagar)
నేటి విద్యార్ధుల్ని రేపటి భావి భారత పౌరులుగా తీర్దిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు దారి తప్పాడు. పరీక్షలు రాస్తున్న విద్యార్ధులను పరిశీలించాల్సిన అధికారిగా డ్యూటీ వేస్తే అక్కడికి బాధ్యతారాహిత్యంగా వచ్చి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నాడు. విషయం పైస్థాయి అధికారుల వరకు చేరడంతో సస్పెండ్ అయ్యాడు. కరీంనగర్(karimnagar )జిల్లా హుజూరాబాద్( Huzurabad)జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలోని 10 వ తరగతి పరీక్ష కేంద్రంలో టెన్త్ ఎగ్జామ్స్ (Tenth Exams) జరుగుతున్నాయి. అక్కడికి ఇన్విజిలేషన్ విధులు నిర్వర్తిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు వేముల రవికుమార్(Vemula Ravikumar) మంగళవారం (Tuesday)విధుల నిర్వాహించడానికి వస్తూ మద్యం సేవించారు(Drinking alcohol). తాగిన మత్తులోనే ఇన్విజిలేషన్(Invigilation)చేశారు. స్టూడెంట్స్(Students)ఎగ్జామ్స్ రాసే పనిలో నిమగ్నమైపోతారు..తనను ఎవరూ గుర్తు పట్టరని భావించారు డ్రిల్ మాస్టర్ రవికుమార్.
పంతులు ఇది మంచి పద్దతేనా..
అయితే ఎగ్జామినేషన్ సెంటర్‌లో మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు అందిన సమాచారంతో రవికుమార్ ఇన్విజిలేటర్‌గా ఉన్న పరీక్ష కేంద్రాన్నిఅధికారులు తనిఖీ చేశారు. ఆ సమయంలో రవికుమార్ మద్యం సేవించి వచ్చినట్లుగా గమనించారు డీఈవో. ఎగ్జామినేషన్ సెంటర్‌కు మద్యం తాగొచ్చిన టీచర్ రవికుమార్‌ని డీఈవో మందలించారు. వెంటనే పోలీసులకు సమాచారం చేరవేశారు. సీఐ వచ్చి బ్రీతింగ్ ఎనలైజర్ పరీక్ష చేయగా 112 శాతం నమోదైంది. మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడంతో రవికుమార్‌ను సర్వీసు నుంచి సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు వెల్లడించారు.
తాగి డ్యూటీకి వస్తే అదే పనిష్మెంట్..
డీఈవో ఎగ్జామ్ సెంటర్‌కు వచ్చి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న సమయంలోనే కొందరు కిటికీల నుంచి చీటిలు వేయడాన్ని గమనించారు డీఈవో. తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ ఆసియా , డిపార్ట్మెంటల్ అధికారి స్వామిరావును విధుల నుంచి తప్పించినట్లు డీఈవో తెలిపారు. మద్యం తాగి విధులకు హాజరై సస్పెన్షన్‌కు గురైన రవికుమార్ హుజూరాబాద్ మండలం రాంపూర్‌లోని జిల్లా ప్రజాపరిషత్ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
ఏం మెసేజ్ ఇద్దామని..
సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా గొప్పదని అందరూ భావిస్తారు. కలెక్టర్ పిల్లలైనా, మంత్రిగారి బిడ్డలైనా ఓ టీచర్ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిందే. అలాంటిది ఉన్నతమైన స్థానంలో ఉండి..ఇలాంటి పాడుపని చేయడం ఏమిటని తోటి ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ఎగ్జామ్ డ్యూటీకే తాగొచ్చిన ఇలాంటి ఉపాధ్యాయులు ఇక స్కూళ్లలో విద్యార్దులకు ఏం పాఠాలు చెబుతారని తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ల విద్యార్ధులు చెడు అలవాట్లు నేర్చుకునే అవకాశం కూడా ఉందంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.