హోమ్ /వార్తలు /తెలంగాణ /

Business Idea: ఆర్మీ చాయ్‌ వాలా పేరుతో టీ వ్యాపారం..నెలకు 40-50వేల ఆదాయం.. ఫ్రాంచైజీ కావాలా..?

Business Idea: ఆర్మీ చాయ్‌ వాలా పేరుతో టీ వ్యాపారం..నెలకు 40-50వేల ఆదాయం.. ఫ్రాంచైజీ కావాలా..?

ARMY CHAI WALA

ARMY CHAI WALA

Army Chai Wala: ఇప్పటి వరకు మిలటరీ భోజన హోటల్‌ అనే పేరు మాత్రమే విన్నాం. కాని కొత్తగా కరీంనగర్‌ టౌన్‌లో ఆర్మీ చాయ్‌ అనే కొత్త టీ సెంటర్‌ అందర్ని ఆకర్షిస్తోంది. అసలు దాని ప్రత్యేకత ఏంటీ..? అక్కడ దొరికే టీ, కాఫీలో ఏం కలుపుతారో తెలుసుకుందా.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar, India

(P.Srinivas,New18,Karimnagar)

ఒకప్పుడు వినియోగదారులకు అవసరమైన వ్యాపారాలు, షాప్‌లు పెట్టి నాలుగు రాళ్లు వెనకేసుకునే వాళ్లు. కాని ప్రస్తుతం ట్రెండ్‌ మారిపోవడంతో..ఫస్ట్ బిజినెస్‌ పెట్టాలంటే ..నలుగురు కళ్లలో పడే విధంగా వెరైటీ పేర్లు, లేదంటే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వ్యాపారం స్టార్ట్ చేస్తున్నారు. అదే ఫార్ములాను ఫాలో అవుతూ సక్సెస్ అవుతున్నారు. పెట్టిన షాపు పేరును ఉపయోగించుకొని మరికొన్ని బ్రాంచ్‌లు అంటే ఫ్రాంచైజీలు ప్రారంభిస్తున్నారు. కరీంనగర్‌ (Karimnagar)టౌన్‌లో కూడా ఇప్పుడు ఓ టీ సెంటర్‌ అలాగే ఫేమస్ అయింది. అంతలా ఫేమస్ కావడానికి ఆ టీ స్టాల్‌కి పెట్టిన పేరే ముఖ్య కారణం. ఆర్మీ చాయ్‌ వాలా(Army Chai Wala)పేరుతో జిల్లాకు చెందిన గౌతమ్‌ రెడ్డి(Gautam Reddy)అనే ఓ ఆర్మీ ఉద్యోగి (Army Employee)ఉద్యోగానికి లాంగ్‌ లీవ్ పెట్టి చాయ్ బార్ ఓపెన్ చేశాడు. వెరైటీ ఫ్లేవర్స్‌తో టీ, కాఫీలు ఇక్కడ అమ్ముతూ ఒకటికి రెండు షాపులు పెట్టాడు.

ఆర్మీ టీ, కాఫీలు..

టీ, కాఫీలు చాలా రకాలు ఉంటాయి. అనేక టేస్టుల్లో దొరుకుతాయి. ఇది అందరికి తెలిసిన విషయమే. కాకపోతే అలాంటి టీ, కాఫీ అమ్మే షాపులు మాత్రం ప్రజెంట్ జనరేషన్‌కు తగ్గట్లుగా చాలా డిఫరెంట్‌గా ఉంటున్నాయి. కొత్త కొత్త పేర్లతో స్టార్టప్ బిజినెస్‌లా మెట్రో సిటీల నుంచి నగరాలు, టౌన్‌లకు విస్తరించాయి. కరీంనగర్ టౌన్‌లో కూడా ప్రస్తుతం అలాంటి ఓ టీ సెంటర్‌ ఫేమస్‌గా మారింది. ఆర్మీ చాయి వాలా పేరుతో ఓ ప్రారంభించడం టీ, కాఫీ ప్రియుల్ని తెగ అట్రాక్ట్ చేస్తోంది. ఇప్పటి వరకు ఆన్ టీ, టీ,టైమ్, చాయ్ వాలా చాయ్, టీ బార్ ఇలా కొత్త పేర్లతో టీ సెంటర్‌లు వెలిశాయి.

టేస్ట్‌కి ఫిదా అవుతున్న జనం..

కాని కరీంనగర్‌కు చెందిన గౌతమ్‌ రెడ్డి అనే ఆర్మీ ఉద్యోగి జాబ్‌కి లాంగ్ లీవ్ పెట్టి ఆర్మీ చాయ్ వాలా పేరుతో రెండు టీ స్టాళ్లను ఏర్పాటు చేశాడు. ఇక్కడ టీతో పాటు శాండ్విచ్, ఫ్రెంచ్ ఫ్రై, బర్గర్ పిజ్జాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని టేస్ట్ చేసేందుకు యువతీ యువకులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అందరిలా కాకుండా కొద్దిగా డిఫరెంట్ గా ఆలోచించాలని  ఈ  ఆర్మీ చాయి బార్ అనే పేరును పెట్టినట్టు ఓనర్ గౌతమ్‌రెడ్డి న్యూస్ 18 కి తెలిపారు. మెరెక్కడ  దొరకనటువంటి ఫ్లేవర్స్ ఇక్కడ అందుబాటులో ఉండడంతో టీ ప్రియులు  ఇక్కడికి క్యూ కడుతున్నారు.

TSPSC : బండి సంజయ్‌కి మళ్లీ సిట్ నోటీస్.. ఆధారాలు ఇవ్వాలన్న అధికారులు

వెరైటీ కాన్సెప్ట్‌తో క్లిక్ అయిన బిజినెస్..

ఇక్కడ ప్రధానంగా ఎక్కువగా  బ్లాక్ కాఫీ, చాక్లెట్ కాఫీ,జంజీర్ కాఫీ నార్మల్ టి,బీరు కాఫీ, వైన్ కాఫీ, వోడుక కాఫీ కూడా అందుబాటులో  ఉన్నాయి. ఆర్మీలో పని చేస్తున్నప్పుడు అక్కడ అయితే ఎలాంటి కాఫీలు, టీలు దొరికేవో అలాంటి వాటినే ఇక్కడ విక్రయిస్తున్నారు. ఆర్మీ జవాన్లు ఎలాంటి తేనీటి పానియాలు తీసుకుంటారో తెలియజేయాలని ..అందరికి రుచి చూపించాలనే ఉద్దేశంతోనే ఈ ఆర్మీ చాయి బార్ పేరుతో  బ్రాంచీలను ఓపెన్ చేసినట్లు యజమాని తెలిపారు.

త్వరలోనే మరికొన్ని బ్రాంచ్‌లు..

ఈ ఆర్మీ చాయ్‌ బార్‌ నెలకోల్పవడం ద్వారా ఖర్చులన్ని పోయి నెలకు 40 వేల రూపాయల నుంచి 50వేల రూపాయల ఆదాయం వస్తోందని యజమాని ధీమాగా చెబుతున్నారు. ఎవరైనా ఇలాంటి టీ షాప్ పెట్టాలనుకుంటే ఫ్రాంచైజీ కోసం తమను సంప్రదించాలంటున్నారు. సుమారు 4లక్షల ఖర్చుతో ఈ ఫ్రాంచైజీ ఇవ్వడం జరుగుతుంది. ఆర్మీ చాయ్‌ బార్‌కి కావాల్సిన మెటీరియల్ కూడా తామే సప్లై చేస్తామని వీటి సంస్థ చైర్మన్ గౌతమ్ రెడ్డి,సాయి చందు తెలిపారు. తెలంగాణలో మొదటి రెండు బ్రాంచ్‌లు కరీంనగర్ లో ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణా వ్యాప్తంగా మరికొన్ని బ్రాంచీలు ఏర్పాటు చేస్తామని సంస్థ యజమానులు తెలిపారు.

First published:

Tags: Chai bisket, Karimangar, Telangana News

ఉత్తమ కథలు