KARIMNAGAR SYMPATHETIC WINDS BLOW THE SPEARS WHO WILL WIN THE ELECTION IN THE ONGOING WAR BETWEEN RIGHTEOUSNESS AND LAWLESSNESS KNR VB
ఈటెలకు అది కలిసిరానుందా.. ధర్మం అధర్మానికి మధ్య నడుస్తున్న యుద్ధం లో ఎన్నికల గెలుపు ఎవరిది..?
ఈటల రాజేందర్(ఫైల్)
Huzurabad By Elections: తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానంతో భంగపాటుకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించాలన్న పట్టుదలతో ప్రచారాన్ని సాగిస్తున్నారు . టిఆర్ఎస్ వైఫల్యాలతో పాటు ప్రధానంగా తనకు అన్యాయాన్ని ప్రజల్లోకి కూడగట్టుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరి ఈ సానుభూమి పవనాలు ఈటెలను గట్టెక్కిస్తాయా.. గెలుపెవరిది..?
తెలంగాణ(Telangana) రాష్ట్ర సమితి అధిష్టానంతో భంగపాటుకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్(Etal Rajender) హుజురాబాద్ (Huzurabad) ఉప ఎన్నికలో విజయం సాధించాలన్న పట్టుదలతో ప్రచారాన్ని సాగిస్తున్నారు . టిఆర్ఎస్ వైఫల్యాలతో పాటు ప్రధానంగా తనకు అన్యాయాన్ని ప్రజల్లోకి కూడగట్టుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ(Telangana) రాష్ట్ర ఉద్యమంలో తాను మమేకమై పోరాటం సాగించిన తీరు , ఆ సమయంలో తగిలిన ఎదురు దెబ్బలు , కష్టనష్టాలను ఏకరువు పెడుతూ ప్రజల్లో ప్రచారాన్ని సాగిస్తున్నారు . ఇదే సమయంలో తన పట్ల పార్టీ అధినేత కెసిఆర్(KCR) తన పట్ల వ్యవహరించిన తీరు , సహచర మంత్రుల వ్యవహారాలను ఎండగడుతూ ప్రచార పర్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు . తనకు జరిగిన అన్యాయాన్ని , ప్రజల్లో తనకు ఉన్న సానుభూతి పవనాలే తనను గట్టెక్కించే అంశాలుగా ఆయన భావిస్తున్నారు .
2009 నుంచి 2018 వరకు కమలాపూర్ , హుజురాబాద్ అసెంబ్లీ(Huzurabad ) నియోజకవర్గాల నుంచి ఘన విజయాలను సాధించిన ఈటల రాజేందరకు ఈ ఉప ఎన్నిక కొత్త అనుభవాన్ని రుచి చూపిస్తోందన్నది నిజం . గతంలో గెలిచిన సందర్భాల్లో టిఆర్ఎస్ జెండాతో ప్రచారం సాగించిన ఆయన ఈ ఎన్నికల్లో బిజెపి(BJP) అభ్యర్థిగా బరిలోకి ఆయన దిగారు . గతంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ఓ వైపు ,ఈటెల రాజేందరక్కున్న ఇమేజ్ మరోవైపు విజయానికి బాటలు వేశాయి . ప్రస్తుత ఉప ఎన్నిక వాతావరణం మాత్రం అందుకు భిన్నంగా తయారైంది .
గతంలో ఆయన వెంట ఉన్న టిఆర్ఎస్ శ్రేణులు పార్టీ వ్యవహారాల కారణంగా దూరంగా మెదులుతుండడం , ఆయన అభ్యర్థిత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నెలకొన్న విభేదాల కారణంగా సొంత ఇమేజ్‌పైనే విజయం సాధించడమే ఆయనకు మార్గంగా కనిపిస్తోంది . గతంలో జరిగిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే కూడా ఇదే అవగతమవుతోంది . 2018 లో హుజురాబాద్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈటల రాజేందర్ లక్షా 4 వేల 840 ఓట్లు సాధించారు . మొత్తం పోలైన ఓట్లలో 59.34 శాతం ఓట్లు ఆయనకే లభించాయి . కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన కౌశిక్ రెడ్డికి 62 వేల 121 ఓట్లు లభించి ద్వితీయ స్థానంలో నిలిచారు .
అప్పుడు ఆ పార్టీ 34.60 శాతం ఓట్లు సాధించింది . బిజెపి నుంచి పోటీ చేసిన పుప్పాల రఘుకు కేవలం 1,683 ఓట్లకు మాత్రమే పరిమితమయ్యారు . ఈ ఎన్నికలో 0.95 శాతం ఓట్లు మాత్రమే భారతీయ జనతా పార్టీకి లభించాయి . బిజెపి అభ్యర్థి కన్న స్వతంత్ర అభ్యర్థి , నోటా ఓట్లు రెట్టింపు ఉండడం గమనార్హం . తదనంతరం పార్లమెంటు నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో ఆ పార్టీ నుంచి బరిలో దిగిన ప్రస్తుత బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్‌కు మాత్రం ఈ నియోజకవర్గంలో ఊహించిన దాని కన్న అత్యధిక ఓట్లు లభించాయి , టిఆర్ఎస్కు పట్టున్న హుజురాబాద్ నియోజకవర్గంలో సంజయ్ కున్న ఇమేజ్ ఓట్లను రాబట్టింది .
కానీ ప్రస్తుత ఎన్నికలో బిజెపి ఓట్ల శాతం ఏ మేరకు ఉంటుంది , ఈటల రాజేందర్ పట్ల ప్రజలకు ఉన్న విశ్వసనీయత ఆధారంగానే ఆయన గెలుపోటములు ఆధారపడి ఉన్నాయన్నది విశ్లేషకులు అంచనా .
ఈటల పట్ల సానుభూతితోపాటు బిజెపి అధినాయకత్వంపైన ప్రజల్లో ఉన్న నమ్మకం పైనే విజయావకాశాలు కనిపిస్తున్నాయి . ఈ ఎన్నికలో ఎలాగైనా సరే ఈటలను ఓడించాలని కంకణం కట్టుకున్న టిఆర్ఎస్ విశ్వప్రయత్నాలనే చేస్తోంది . ఈటల రాజేందర్ రాజీనామా చేసిన జూన్ 12 వ తేదీ నుంచి ఈ ప్రాంతంలో ప్రతి రోజు ఆ పార్టీ ప్రధాన నాయకులు , మంత్రుల పర్యటనలు సాగుతూనే ఉన్నాయి . అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం , సంక్షేమ పథకాల అమలుతో ఓట్లను రాబట్టుకునే పనిలో ఆ పార్టీ అధిష్టానం మంత్రాంగాన్ని నడిపిస్తోంది .
ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో సిఎం కేసీఆర్ అన్ని కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇటు అధికార పార్టీ నుంచి ఎదురవుతున్న ఒత్తిడికి తోడు , సొంత పార్టీలోని స్థానిక నాయకత్వంలో పొడసూపుతున్న విభేదాల మధ్యన ఈటల రాజేందర్ ఏ మేరకు సఫలీకృతుడు కానున్నారో వేచి చూడాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.