Home /News /telangana /

KARIMNAGAR SYMBOLS CHASING TRS AND BJP ARE USELESS 30 PEOPLE IN THE RACE MARKS ASSIGNED TO THEM KNR VB

ఉప ఎన్నికలో అనూహ్యంగా కాంగ్రెస్ కు ప్లస్ చేకూరింది.. ఈ సారి జాగ్రత్త పడకపోతే వారు ఓడిపోవడం పక్కా..! ఎందుకంటే..

కాంగ్రెస్ పార్టీ జెండా

కాంగ్రెస్ పార్టీ జెండా

Huzurabad By Elections: హుజూరాబాద్(Huzurabad) ఉప ఎన్నికల్లో నామి నేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది . చివరగా పోటీలో 30 మంది మిగిలారు. వాస్తవానికి తొలుత ఈ సంఖ్య పదుల సంఖ్యలో ఉంటుందనుకున్నారంతా . మొత్తం 61 మంది 92 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా .. స్క్రుటినీ అనంతరం 42 మందికి చెందిన 69 నామినేషన్లు ఆమోదం పొందాయి.

ఇంకా చదవండి ...
  (P.Srinivas,News18,Karimnagar)

  హుజూరాబాద్(Huzurabad) ఉప ఎన్నికల్లో నామి నేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది . చివరగా పోటీలో 30 మంది మిగిలారు. వాస్తవానికి తొలుత ఈ సంఖ్య పదుల సంఖ్యలో ఉంటుందనుకున్నారంతా . మొత్తం 61 మంది 92 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా .. స్క్రుటినీ అనంతరం 42 మందికి చెందిన 69 నామినేషన్లు ఆమోదం పొందాయి. బుధవారం 12 మంది నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 30 మంది మిగిలారు. వీరిలో ఈటల రాజేందర్(Etal Rajender) (BJP ) , గెల్లు శ్రీనివాస్ యాదవ్(Gellu Srinivasa Yadav) (TRS ) , బల్మూరి వెంకట్(Balmuri Venkat) (Congress) ప్రధానపార్టీల నుంచి పోటీ చేస్తున్నారు .

  Dussehra Offer: దసరా బొనాంజా.. చికెన్ బిర్యానీ, రెండు కిలోల మటన్, మద్యం ఉచితం.. ఇంకా రూ.2 వేలు కూడా..


  వీరు కాకుండా రిజిష్టర్ పార్టీల నుంచి ఏడుగురు(Seven), 20 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు . వీరిలో రెబెల్స్(Rebels) , అసంతృప్తులు ఎవరూ లేకపోవడంతో పార్టీలకు తలనొప్పులు తప్పాయి . బుజ్జగింపులు , చర్చలు , మధ్యవర్తులు వంటి సన్నివేశాలు ఈ ఉప ఎన్నికల్లో కానరాకపోవడం గమనార్హం . దీంతో మిగిలిన రోజుల్లో దూకుడుగా ప్రచారం చేయాలని పార్టీలన్నీ నిర్ణయించాయి .

  ఈటెలకు అది కలిసిరానుందా.. ధర్మం అధర్మానికి మధ్య నడుస్తున్న యుద్ధం లో ఎన్నికల గెలుపు ఎవరిది..?


  ఐతే ఇప్పుడే అసలు కథ మొదలైంది. బీజేపీ - టీఆర్ఎస్ కు కొన్ని సింబల్స్(Symbles) బెడద వెంటాడుతున్నాయి . తమ గుర్తులను పోలి ఉండటంతో ఎక్కడ తమ ఓట్లకు నష్టం వాటిల్లుతుందోనన్న ఆందోళనలో అభ్యర్థులు ఉన్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి(Elections Commission) టీఆర్ఎస్(Trs) ఫిర్యాదు కూడా చేసింది . తమ పార్టీ గుర్తు అయిన కారు మరింత స్పష్టంగా కనిపించేలా కొన్ని మార్పులు చేయాలని కూడా ఆ ఫిర్యాదులో విన్నవించింది .

  TSRTC MD Sajjanar: ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ కీల‌క నిర్ణ‌యం.. ఇక వాటిని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ..


  హుజూరాబాద్(Huzurabad) ఉప ఎన్నికలో ట్రక్కు , ఆటో లేక పోయినప్పటికీ రోడ్ రోలర్ , చపాతి రోలర్, ఇద్దరు అభ్యర్థులకు కేటాయించడంతో ఆ పార్టీ మరోసారి ఆందోళనలో పడింది. ఇదే సమయంలో బీజేపీ నేతలను సైతం సింబల్ పంచాయతీ వెంటాడుతోంది . పెన్నుపాళి ( పెన్ విత్ సెవెన్ రేస్ ) , కాలీఫ్లవర్ దూరం నుంచి చూసి నప్పుడు , కంటి సమస్యలు ఉన్నవారు కమలం పువ్వు అని భ్రమపడే ప్రమాదం లేకపోలేదు .

  అందుకే .. ఈ గుర్తులు ఎక్కడ తమ ఓట్లకు గండికొడ తాయో అన్న ఆందోళన కమలనాథుల్లోనూ నెలకొంది ..దీనిపై స్పందించిన ఎన్నికల అధికారి రవీందర్ మాట్లాడుతూ..ఎన్నికల సంఘం వద్ద అందుబాటులో ఉన్న గుర్తులనే కేటాయించాం అని సమాధానమిచ్చారు . ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని తెలిపారు.

  Huzurabad By Election: ఆ రిపోర్టు ప్రకారం హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదా.. !అసలేం జరుగుతోంది..


  పోటీ చేస్తోంది వీరే వారికీ ఇచ్చిన గుర్తులు..
  1. ఈటల రాజేందర్, బిజెపి కమలం, గుర్తు, 2. గెల్లు శ్రీనివాసయాదవ్ టిఆర్ఎస్ కార్ గుర్తు, 3. బల్మూరి వెంకట నర్సింగ్ రావు కాంగ్రెస్, చేయి గుర్తు 4. అలీ మన్సూర్ మహ్మద్ అన్న వైయస్సార్పార్టీ , బ్యాట్స్ మెన్ గుర్తు, 5. కన్నం సురేష్ కుమార్, జై స్వరాజ్,పార్టీ.పెన్ విత్ నిబు గుర్తు 6. కర్ర రాజిరెడ్డి ఎంసీఐ (యు ),పార్టీ.కంప్యూటర్ గుర్తు,7. కేశెట్టి విజయకుమార్, యువతరం పార్టీ, glass tumbler గుర్తు, 8. దేవునూరి శ్రీనివాస్, దళిత బహుజన పార్టీ, కప్పు సాసర్ గుర్తు, 9. లింగిడి వెంకటేశ్వర్లు, ప్రజావాణి పార్టీ, రోడ్ రోలర్గుర్తు , 10. సిలివేరు శ్రీకాంత్, ప్రజా వక్త పార్టీ, చపాతీ రోల్ గుర్తు,

  Telangana News: వామ్మో.. ఏందిది.. హుజురాబాద్ ఎన్నికల ప్రచారానికి దేవుడిని కూడా వదలట్లేదుగా.. వీడియో వైరల్..


  ఇండిపెండెంట్లు 11. ఉప్పు రవీందర్ హెలికాప్టర్ గుర్తు, 12. ఉరుమల్ల విశ్వం, అగ్గిపెట్టె గుర్తు,13. ఎడ్ల జోగిరెడ్డి, కాలిఫ్లవర్ గుర్తు, 14. కుమ్మరి ప్రవీణ్, గ్యాస్ సిలిండర్ గుర్తు. 15. కోట శ్యామ్కుమార్, బ్యాట్ గుర్తు,16. కంటే సాయన్న, డైమండ్ గుర్తు.17. గుగులోతు తిరుపతి, గౌను గుర్తు.18. గంజి యుగంధర్, కుండ గుర్తు. 19. చెలిక చంద్రశేఖర్, విజిల్ గుర్తు.20. చిలుక ఆనంద్, బీరువా గుర్తు.

  21. పల్లె ప్రశాంత్, కెమెరా గురు.22. పిడిశెట్టి రాజు, కత్తెర గుర్తు.23. బుట్టింగారి మాధవరెడ్డి, రింగు గుర్తు.24. మేకమల్ల రత్నయ్య, కుట్టు మిషన్ గుర్తు,25. మౌటం సంపత్, సోప్ డిష్ గుర్తు,26. శనిగరపు రమేష్ బాబు, టీవీ గుర్తు. 27. రావుల సునీల్, హార్మోనియం గుర్తు.28. లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నాగలి గుర్తు.29. వేముల విక్రమ్ రెడ్డి, గాజుల గుర్తు, 30. సీ.వీ సుబ్బారెడ్డి, ఏసీ గుర్తు గుర్తు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Huzurabad, Huzurabad By-election 2021

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు