(P.Srinivas,New18,Karimnagar)
నగర, పురపాలికల్లో ఆస్తుల సమగ్ర సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు కరీంనగర్ జిల్లా మునిసిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను జియో ట్యాగింగ్ (Geo tagging)చేసే ప్రక్రియను పూర్తి చేసేలా సర్వే కొనసాగుతోంది. కరీంనగర్ (Karimnagar)నగర పాలక సంస్థతో పాటు మున్సిపాలిటీల్లో ఇళ్లకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు భువన్ యాప్(Bhuvan App)లో నమోదు చేసేలా రెండేళ్ల కిందట కార్యాచరణ తీసుకోగా అత్యధిక పురపాలికల్లో పూర్తయింది. కొన్ని చోట్ల సాంకేతిక కారణాలతో వెనుకబడి పోగా ప్రస్తుతం లక్ష్యాన్నిదుకు నగర పాలక రెవెన్యూ అధికారులు వీధుల్లో పర్యటించి ఆస్తుల నమోదు చేస్తున్నారు. విలీన కాలనీల్లో భువన్ సర్వే (Bhuvan Survey)చేపట్టగా ఆ వివరాలన్నీ నిక్షిప్తమయ్యాయి.
అందుబాటులో పక్కా సమాచారం..
భువన్ యాప్‌లో ప్రతి ఇంటి వివరాలు ఆన్‌లైన్‌లో ధరణి వెబ్‌సైట్‌లో నమోదవుతాయి. ఎవరి ఆస్తి ఎవరి పేరు మీద ఉందనే పక్కా సమాచారం అందులో ఉండనుంది.నగరంలోని ఇళ్లకు జియోట్యాగింగ్ చేస్తుండగా ఈ సమయంలో భవనానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని క్రోడికరిస్తారు. ప్రతి ఇంటికి కొలతలు నిర్వహిస్తారు. ఇప్పటివరకు ఆస్తిపన్ను మదింపు పరిధిలోకి రాని అంతస్తులను కూడా ఇందులో పరిగణనలోకి తీసుకుంటారు. పన్ను పెంచకుండానే ఆదనంగా ఎంతమేర కట్టుకుంటారో ఆ మేరకు ఆస్తి పన్ను మదింపు ఆటోమెటిక్ గా జరిగిపోతుంది. ప్రస్తుతం నిర్వహించే కొలతల భవనాలకు వచ్చే ఏడాది పన్ను పెరిగే అవకాశముంది. ఎక్కువ కొలతలు ఇచ్చి తక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉన్నట్లేయితే వాటికి పన్ను సర్దుబాటు కానుండది.సర్వే సమయంలో ఆస్తి మదింపు వివరాలు, భవన చిత్రం, అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా ఫోన్‌తో ఫోటోలు తీస్తారు.
డేటా ఆధారంగా సంక్షేమ పథకాలు..
ఇంటి నెంబర్లు లేని ఇళ్లు, పన్ను పరిధిలోకి రాని అంతస్తులు, ఆక్రమ నిర్మాణాలు, భవన విస్తీర్ణం, ప్రభుత్వ భవనం వంటి ప్రతీ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. వాణిజ్య భవనాల వివరాలు, నల్లా కనెక్షన్లు, సెల్ టవర్లు, దుకాణాల లైసెన్స్లు ఇందులో నమోదు చేస్తారు.గతంలో 35.39 సర్వే పూర్తి కాగా, రెండో విడతలో 55 శాతానికి చేరింది. జియోట్యాగింగ్ పూర్తి చేయాలని పురపాలక శాఖ ఆదేశించడంతో రెండు నెలలుగా మళ్లీ ప్రారంభించారు. ఇప్పటివరకు 73.11 శాతం పూర్తి చేశారు. బిలకలెక్టర్లతో పాటు వారధి నుంచి కొంతమందిని తీసుకొని సర్వే చేస్తున్నారు. ట్రేడ్ లైసెన్స్ సర్వే కారణంగా తాత్కాలికంగా బ్రేక్ పడగా ఈసారైనా పూర్తి చేసేలా చర్యలు తీసుకుం లేదో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karimangar, Telangana News