Home /News /telangana /

KARIMNAGAR STUDENTS YOUTHS ARE BECOMING ADDICTS OF GANJA ARE SUPPLIED IN A NEW WAY IN KARIMNAGAR KNR PRV

Ganja cases: పంథా మార్చిన కేటుగాళ్లు.. గుప్పుమంటున్న గంజాయి మత్తు.. యువత, విద్యార్థులే సమిధలు

గంజాయి

గంజాయి

గంజాయి (Ganja) వ్యాపారం జోరుగా సాగుతోంది . పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా చాపకింద నీరులా కొనసాగుతూనే ఉంది . ఇటీవల యువత , విద్యార్థులు (Students) ఎక్కువగా గంజాయికి బానిసలుగా మారుతున్నారు .

  (Srinivas P, News18, Karimnagar)

  గత కొద్ది రోజులుగా కరీంనగర్ (Karimnagar) జిల్లాలో గంజాయి (Ganja) వ్యాపారం జోరుగా సాగుతోంది . పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా చాపకింద నీరులా కొనసాగుతూనే ఉంది . ఇటీవల యువత , విద్యార్థులు (Students) ఎక్కువగా గంజాయికి బానిసలుగా మారుతున్నారు . ఉన్నత చదువులు చదువుకుని ఉన్నతంగా ఎదగాల్సిన సమయంలో మత్తులో జోగుతున్నారు . జల్సాలకు అలవాటు పడి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఈ దందాను చేపడుతూ పోలీసులకు చిక్కుతున్నారు . ఇటీవల కాలంలో అత్యధికంగా విద్యార్థులు , యువకులు గంజాయి బారిన పడటమే కాకుండా .. అక్రమ దందాను కొసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు . కొత్త పంథాను ఎంచుకొని తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు . గంజాయి మత్తు కోసం వారు కొత్త పుంతలు తొక్కుతున్నారు.

  మధ్యలో చదువు మానేసిన వారే..

  పోలీసులు చేపడుతున్న తనిఖీల్లో అధిక శాతం యువకులు , విద్యార్థులు పట్టుబడుతున్నారు. చదువుల పేరుతో ఇంటి నుంచి కళాశాలలకు బయలుదేరి కొత్త స్నేహంతో గంజాయిని (Ganja) వినియోగిస్తున్నారు . శివారు ప్రాంతాలను అడ్డాలుగా మార్చుకుంటున్నారు . ఇందులో 75 శాతం మార్కులు వచ్చిన విద్యార్థులు సైతం ఉన్నారని పోలీసులు చెబుతున్నారు . ప్రతి రోజు రూ .500 వరకు ఖర్చు చేస్తూ ఇంట్లో వారిని వేధిస్తున్నారు . వారు డబ్బులు ఇవ్వకపోవడంతో గంజాయి విక్రేతలుగా మారి పోలీసులకు చిక్కి జైలుకెళుతున్నారు. తాజాగా కరీంనగర్లోని (Karimnagar) విద్యానగర్​కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి మిత్రులతో పాటు తోటి విద్యార్థులకు గంజాయి విక్రయిస్తూ ఎక్సైజ్ పోలీసులకు చిక్కాడు . డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మరో ఇద్దరు విద్యార్థులు సైతం చదువును మధ్యలోనే ఆపేసి గంజాయి వ్యాపారం సాగిస్తున్నారు. మత్తుకు బానిసలుగా మారిన వారు గుట్టు చప్పుడుకాకుండా వ్యాపారం చేస్తున్నారు. వచ్చిన లాభాలతో స్పీడ్ బైక్లు కొనుగోలు చేస్తూ సరకు తరలించడంలో ఆరితేరుతున్నారు .

  రూటు మార్చి..

  మహారాష్ట్ర , ఛత్తీస్గఢ్ , బిహార్​కు చెందిన అనేక మంది కార్మికులు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్నారు . వారి ద్వారానే గంజాయి సరఫరా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు . రైలు , బస్సు మార్గాల్లోనే సరకును జిల్లాకు చేరవేస్తున్నారు . వ్యాపారులు ఆయా రాష్ట్రాలకు వెళ్లకుండా మధ్యవర్తుల ద్వారా గంజాయిని ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్ , ఆదిలాబాద్ , కరీంనగర్ ఉమ్మడి జిల్లాల సరిహద్దు ప్రాంతాలకు దిగుమతి చేసుకుంటున్నారు . కూరగాయలు , పండ్లు తరలించే వాహనాలను ఎంచుకుంచుకుంటున్నారు . స్థానిక పరిస్థితులను బట్టి ద్విచక్రవాహనాలను వినియోగిస్తూ 5 కిలో వరకు గంజాయిని కొనుగోలు చేస్తూ లోకల్గా విక్రయిస్తున్నారు . ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం , అరకు నుంచి ఇద్దరు యువకులు కరీంనగర్లో కార్మికులుగా పని చేసుకుంటూ గంజాయి నూనె వ్యాపారం సాగించడంతో కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు . గంజాయితో నింపిన సింగరెట్కు రూ .100 , 100 గ్రాముల గంజాయి నూనె రూ .1000 విక్రయిస్తున్నారు .   కొత్త పంథా..

  గంజాయి వాడేందుకు యువత , విద్యార్థులు కొత్త పంథా ఎంచుకున్నారు . ఆకు పొడిని సిగరెట్లలో నింపుకుని తాగుతున్న విషయం తెలిసిందే . కానీ ఇప్పుడు నూనె ను కొత్త పద్ధతుల్లో వాడుతున్నారు . కొత్తగా హుక్కా మాదిరిగా గంజాయిని కొంత మంది యువత వినియోగిస్తున్నట్లు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పసిగట్టారు . ప్లాస్టిక్ సీసాకు చిన్నపాటి రంద్రం చేసి గంజాయితో నింపిన సింగరెట్ను దానికి జోడించి కింద మంట పెట్టి వేడికి అందులో నుంచి వచ్చే ఆవిరిని హుక్కా మాదిరిగా పీల్చుతున్నారు . కరీంనగర్లో ఇలాంటివి ఎక్సైజ్ అధికారులు గుర్తించారు .

  ప్రత్యేక తనిఖీలు ద్వారా 2019 నుంచి 2022 జులై 10 వ తేదీ వరకు 130 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు పోలీసు రికార్డుల ద్వారా తెలుస్తోంది . 185 మందిపై కేసులు నమోదు చేశారు . ఇక ఎక్సైజ్ పోలీసులు సైతం సుమారుగా 22 కిలోల గంజాయిని పట్టుకొని 55 మందిని జైలుకు పంపించారు . పోలీసులు ప్రత్యేక తనిఖీలు , చెక్​ పోస్టులు పెట్టి గంజాయిని కట్టడి చేయాలని ప్రయత్నిస్తున్నా వ్యాపారం మాత్రం ఆగడంలేదని స్పష్టమౌతోంది .
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Crime news, Ganja case, Ganja smuggling, Karimnagar

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు