హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimnagar: ఆ యూనివర్సిటీలో స్టూడెంట్స్‌ హాస్టల్ నుంచి బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నారంట.. కారణం అదే

Karimnagar: ఆ యూనివర్సిటీలో స్టూడెంట్స్‌ హాస్టల్ నుంచి బయటకు వెళ్లాలంటే భయపడిపోతున్నారంట.. కారణం అదే

(ఆ యూనివర్సిటీలో అదో భయం)

(ఆ యూనివర్సిటీలో అదో భయం)

Karimnagar: ఉన్నత విద్యతో ఉద్యోగాలు పొందాలనుకున్న ఆ విద్యార్థులు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని చదువుతున్నారు . వీరంతా ఏ అడవిలో చదువుకోవడం లేదు . జనారణ్యంలో ఉన్నా వారు పుస్తకాలతో కుస్తీ పడడం కంటే హాస్టల్ రూం కు చేరితే చాలనుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

ఇంకా చదవండి ...

(P.Srinivas,New18,Karimnagar)

ఉన్నత విద్యతో ఉద్యోగాలు పొందాలనుకున్న ఆ విద్యార్థులు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని చదువుతున్నారు . వీరంతా ఏ అడవిలో చదువుకోవడం లేదు . జనారణ్యంలో ఉన్నా వారు పుస్తకాలతో కుస్తీ పడడం కంటే హాస్టల్ రూం(Hostel room)కు చేరితే చాలనుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు . సాక్షాత్తు కరీంనగర్(Karimnagar)జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీ(Satavahana University) విద్యార్థుల దీనస్థితి చూస్తే ఆందోళనకరంగా ఉందనే చెప్పాలి . విష పూరీతమైన జీవాలతో సహవాసం చేయాల్సిన పరిస్థితి తయారెంది.

ఏటా ఇదే తీరు ..

కరీంనగర్ శాతవాహన యూనివర్శిటీ విద్యార్థులు నిత్యం భయం నడుమే జీవనం సాగిస్తున్నారు. ప్రతి వేసవిలో ఇక్కడ మంటలు చెలరేగడం కామన్‌గా మారింది. ఎండాకాలం వచ్చిందంటే చాలు .. ఫైర్ ఇంజన్లు ఇక్కడ వాలిపోవల్సిందే . మంటలు పూర్తిగా ఆరిపోయే వరకూ ఎస్యూ విద్యార్థులు ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాందోళనలో రోజులు గడుపుతూ ఉంటారు. విశ్వ విద్యాలయం చుట్టూ ఉన్న చెట్లు , గుట్టల్లో మంటలు చెలరేగడం సర్వ సాధారణంగా తయారైంది.

భయం గుప్పిట్లో ..

వేసవిలో అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నప్పటికి ఎస్యూలో స్టూడెంట్స్ ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. దీనికి తోడు ఎలుగుబంట్లు వీరి ధైర్యానికి సవాల్ విసురుతున్నాయనే చెప్పాలి. రాత్రిపూట ఎలుగుబంట్ల అరుపులతో ఉలిక్కిపడి నిద్ర నుంచి లేచి గజగజ వణికిపోతున్నారు యూనివర్సిటీ స్టూడెంట్స్. అర్ధరాత్రి నుంచి తెల్లవార్లు అలాంటి అరుపులతోనే నిద్రపోకుండా జాగారం చేస్తున్న భయానక పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

(శాతవాహన యూనివర్సిటీ)
(శాతవాహన యూనివర్సిటీ)

రక్షణ కల్పించాల్సిందే..

గతేడాది మార్చి 12వ తేదీ నాటి నుంచి మూడ్రోజుల పాటు ఎలుగుబంటి యూనివర్సిటీ స్టూడెంట్స్‌ను భయపెట్టింది. స్టూడెంట్స్‌ ద్వారా విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు వచ్చి ఎలుగుబంటిని పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికి ఫలితం లేకపోియంది. తాజాగా మరోసారి బుధవారం రాత్రి నుండి ఎలుగుబంటి శాతవాహన యూనివర్సిటీలోకి రావడంతో స్టూడెంట్స్ హడలిపోతున్నారు. వేసవి అగ్నిప్రమాదాలు, మిగిలిన సీజన్‌లో ఎలుగుబంట్లు, పాముల బెడదతో అనుక్షణం భయపడుతూనే చదువుకుంటున్నారు.

వర్సీటీలో వర్రీ..

సాయంత్రం నుంచి గజగజ వణుకుతున్నారు . చీకటి పడిందంటే ఎటువైపు నుండి ఏ వన్యప్రాణి వస్తుందో అనే భయంతో గడుపుతున్నారు. రెండు రోజుల క్రితం పాము కాటుకు గురై ఓ విద్యార్థి ఆసుపత్రి పాలయ్యారు . సాయంత్రం 5 గంటలు అయిందంటే బయటకు రావద్దని యూనివర్సిటీ అధికారులు చెప్తున్నారు . లైబ్రరీకి వెళ్లడం కూడా ఇబ్బందిగా తయారైందని వాపోతున్నారు . అసలే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల అయిన ఈ సమయంలో వన్యప్రాణుల భయంతో హాస్టల్ నుండి బయటకు వెళ్లలేక పోతున్నామని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో యూనివర్సిటీ యంత్రాంగం కూడా హాస్టల్‌కే పరిమితం కావాలని చెబుతుండటంతో తాము పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. సేఫ్టీ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.

Crime news : ప్రియుడే ముద్దు .. మొగుడు వద్దు కామారెడ్డి జిల్లాలో వివాహిత చేసిన దారుణం అంతా ఇంతా కాదు


First published:

Tags: Karimnagar, Telangana News

ఉత్తమ కథలు