హోమ్ /వార్తలు /తెలంగాణ /

జాతీయ స్థాయి యోగాలో రాణిస్తున్న సహస్ర..ఈ ఆసనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!

జాతీయ స్థాయి యోగాలో రాణిస్తున్న సహస్ర..ఈ ఆసనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!

యోగాలో రాణిస్తున్న సహస్ర

యోగాలో రాణిస్తున్న సహస్ర

కరోనా సమయం చాలా మంది జీవన విధానంలో మార్పు తీసుకువచ్చింది. కోవిడ్ సమయంలో ఇంట్లోనే కాలం వెల్లదీయకుండా చాలా మంది ఏదో ఒక రంగంపై దృష్టి పెట్టారు. కరోనా కాలాన్ని సద్వినియోగం చేసుకొని ఓ చిన్నారి యోగా సాధన చేసి ఇప్పుడు జాతీయ స్థాయిలో రాణిస్తుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar, India

కరోనా సమయం చాలా మంది జీవన విధానంలో మార్పు తీసుకువచ్చింది. కోవిడ్ సమయంలో ఇంట్లోనే కాలం వెల్లదీయకుండా చాలా మంది ఏదో ఒక రంగంపై దృష్టి పెట్టారు. కరోనా కాలాన్ని సద్వినియోగం చేసుకొని ఓ చిన్నారి యోగా సాధన చేసి ఇప్పుడు జాతీయ స్థాయిలో రాణిస్తుంది.

కరీంనగర్ జిల్లా కోతి రాంపూర్ కి చెందిన రుద్రోజు సహస్ర లక్ష్మి సెయింట్ మేరీస్ పాఠశాలలో 4వ తరగతి చదువుతుంది. కరోనా సమయంలో యోగ సాధన చేయండి. రోగ నిరోధక శక్తి పెంచుకోండని చెప్పడంతో సహస్ర యోగ సాధన చేస్తానని తల్లిదండ్రులు రాజమౌళి వనితకి చెప్పగా యోగ కోచ్ ప్రదీప్ కుమార్ ని సంప్రదించారు.

సహస్ర యోగాపై చూపుతున్న మక్కువని గమనించిన కోచ్ ఆన్లైన్ శిక్షణ ఇవ్వడానికి ముందుకు రాగా ప్రతి రోజు కోచ్ ప్రదీప్ కుమార్ సహస్రకి యోగాలో ఆన్లైన్ తరుగతులు చెప్పి తీర్చిదిద్దాడు.

కరోనా అనంతరం స్కూల్ లో యోగా కోచ్ కిష్టయ్య రామకృష్ణలు సహస్రని యోగాలో తీర్చి దిద్దారు. సహస్రకి యోగాపై ఆసక్తి ఉండడంతో తొందరలోనే జాతీయ స్థాయిలో రాణించే స్థాయికి చేరుకుంది.

యోగ సాధన ప్రారంభించాక రేండేళ్ల సమయంలోనే సహస్ర యోగాసనాలని అవలీలగా చేసి అందరిని అబ్బుర పరిచింది. వృక్షాసనం, పాదహస్తాసనం, బ్రుస్టాసనం, శాశంగాసనం , ఆకర్ణ ధనురాసనం, గర్భాసనం, ఏకపద శిఖందసనం, చక్రాసనం, సర్వాంగాసనం లాంటి యోగ ఆసనాలని సులువుగా చేస్తుంది.

ఆసనాలను అవలీలగా చేస్తున్న సహస్రని పోటీలకు పంపాలని కోచ్ మరియు తల్లితండ్రులు నిర్ణయించుకొని పోటీలకు అనుకూలంగా శిక్షణ లో ఆరి తెరేలా శిక్షణ ఇప్పించారు.

ఆన్లైన్ శిక్షణ తీసుకున్న సహస్ర తోలి ప్రయత్నంలోనే జిల్లా రాష్ట్ర స్థాయిలో బంగారు పతకాలు సాధించింది. 2021 లో ఎనిమిది నుండి పది ఏళ్ల కేటగిరి పోటిలలో పాల్గొని బంగారు పథకం గెలుచుకుంది. కరీంనగర్ లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటిలలో పాల్గొని బంగారు పతకం గెలుచుకొని జాతీయ స్థాయికి ఎంపిక అయ్యింది.

రాజస్తాన్ లోని జైపూర్ లో జరిగిన పోటిలలో సత్తా చాటింది. ఇటివల జరిగిన యోగాసన పెడరేషన్ కప్ పోటిలలో పాల్గొని ఆరవ స్థానంలో నిలిచి కరీంనగర్ జిల్లా పేరును చాటి చెప్పింది. రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు తెస్తానని సహస్ర లక్ష్మి అంటుంది.

First published:

Tags: Karimnagar, Telangana, Yoga

ఉత్తమ కథలు