Home /News /telangana /

KARIMNAGAR SON LEFT HIS SICK AND OLD AGE MOTHER AT THE BUS STAND IN KARIMNAGAR DISTRICT SNR KNR

Telangana : ఇప్పుడే వస్తానని తల్లిని బస్టాండ్‌లో వదిలి వెళ్లాడు .. 10రోజుల తర్వాత ఆ తల్లి పరిస్థితి ఎలా ఉందంటే

(OLD MOTHER)

(OLD MOTHER)

Telangana : నవ మాసాలు మోసి కనిపించినతల్లిని ఇప్పుడే వస్తానని నగరం నడిబొడ్డున వదిలిపెట్టి వెళ్లాడు కొడుకు. వెళ్లిన కొడుకు వస్తాడనే ఆశగా పది రోజులుగా బస్టాండ్‌లో ఎదురుచూస్తూ ఉండిపోయింది ఆ తల్లి. ఓవైపు వృద్ధాప్యం, మరోవైపు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్న కన్నకొడుకు కోసం ఎదురుచూసిన ఆ మాతృమూర్తికి చివరకు నిరాశే ఎదురైంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar, India
    (P.Srinivas,New18,Karimnagar)
    ఇప్పుడే వస్తానని చెప్పి నవ మాసాలు మోసి కనిపించినతల్లిని నగరం నడిబొడ్డున వదిలిపెట్టి వెళ్లాడు కొడుకు. వెళ్లిన కొడుకు వస్తాడనే ఆశగా పది రోజులుగా బస్టాండ్‌(Bus stand)లో ఎదురుచూస్తూ ఉండిపోయింది ఆ తల్లి. ఓవైపు వృద్ధాప్యం, మరోవైపు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్న కన్నకొడుకు కోసం ఎదురుచూసిన ఆ మాతృమూర్తికి చివరకు నిరాశే ఎదురైంది. పోయిన కొడుకు రాకపోవడం, ఎవరైనా చెబుతున్నది వినకపోవడం వంటి సమస్యలతో దిక్కు,మొక్కులేని జీవచ్చవంలా పడి ఉండటం చూసి కరీంనగర్‌(Karimnagar)కి చెందిన న ఓ స్వచ్ఛంద సంస్థ (Charity organization)చేరసింది.

    Crime news : పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన డిగ్రీ విద్యార్ధిని .. ప్రియుడు అబార్షన్ చేయిస్తుండగానే ..



    తల్లి ప్రేమను తెంచుకున్నాడు..
    కరీంనగర్ బస్టాండ్‌లో ఓ అరవై సంవత్సరాల వృద్ధురాలు గత పది రోజులుగా తిండి తిప్పలు లేక పలకరించే దిక్కులేక అనాధగా పడి ఉంది. వృద్ధురాలు హనుమకొండ జిల్లాలోని గోపాల్‌పూర్‌కి చెందిన పున్నం సమ్మక్క. వృద్దురాలికి వినికిడి లోపంతో పాటుగా ఫిట్స్ వస్తుంటాయి. అలాగే తలకు ఆపరేషన్‌ కూడా జరిగింది. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతోంది . ఈక్రమంలో ప్రైవేటు ఆసుపత్రిలో మెరుగైన చికిత్స చేయిస్తానని కన్నకొడుకు గోపాల్‌పూర్‌ నుంచి తల్లిని పది రోజుల క్రితం బైక్‌పై కూర్చొబెట్టుకొని కరీంనగర్‌కు తీసుకొచ్చాడు.


    తల్లడిల్లిపోయిన తల్లి మనసు..
    అమ్మ ఇక్కడే కూర్చో మళ్లీ వస్తానని చెప్పి బస్టాండ్‌లో వదిలివెళ్లాడు. కొడుకు ఎక్కడ వదిలిపెట్టి వెళ్లాడో అక్కడే గత 10రోజులుగా తిండి, నిద్ర లేకుండా ఆకలితో జాగారం చేస్తూ ఆశగా ఎదురుచూస్తూ ఉండిపోయింది. వృద్దురాలు పది రోజులుగా ఒకే చోట ఉండటంతో అక్కడి వాళ్లు ఆమెను వివరాలు అడిగే ప్రయత్నం చేసినప్పటికి చెవుడు కారణంగా వినిపించలేదు. ఎవరికైనా చెప్పాలంటే ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. ఈవిధంగా కొడుకు కనబడకపోవడంతో వృద్దాప్యంలో ఆ తల్లి పడిన వేదన అంతా ఇంతా కాదు. ఇదంతా చూసిన ఓ వ్యక్తి డయల్‌ 100కి ఫోన్‌ చేసి ఆమె పరిస్థితిని వివరించాడు. స్పందించిన పోలీసులు ఆమె పరిస్థితిని విచారించి కరీంనగర్‌లోని ఎల్డర్స్ హెల్ప్‌లైన్ క్షేత్రాధికారి స్వర్ణలతకు సమాచారమందించారు.

    Hyderabad : ప్రిన్సిపాల్ గదిలో స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం .. కారణం తెలిస్తే షాక్ అవుతారు



    బస్టాండ్‌లోనే పది రోజులుగా మకాం..
    స్వచ్చంద సంస్థ నిర్వాహకులు సమ్మక్క వివరాలను సేకరించి ఎల్డర్స్ హెల్ప్ లైన్ కేంద్రంలో ఆశ్రయం కల్పించారు. బుధవారం తనపేరు, గ్రామం పేరును మాత్రమే చెప్పిన సమ్మక్క గురువారం కొంత తేరుకున్న తర్వాత తన కుమారుడి పేరు , ఆసుపత్రికి తీసుకెళ్తానని చెప్పిన విషయాలు , బస్టాండ్‌లో ఇన్ని రోజులు ఎందుకు వేచి చూడాల్సిన పరిస్థితులను వివరించింది. ఇంత జరిగిన తర్వాత కూడా ఆ తల్లికి ఇంకా తన కొడుకు వస్తాడని ఆసుపత్రికి తీసుకెళ్తాడనే నమ్మకం మెండుగా ఉంది. అందుకే బస్టాండ్‌కి వెళ్లి చూడాలి నా బిడ్డ వస్తాడని చెప్పడం చూసి ఎల్డర్స్ హెల్ప్ లైన్‌ నిర్వాహకులతో పాటు పోలీసుల కళ్లు చెమ్మగిల్లాయి. నవమాసాలు మోసి కని, పెంచి పెద్ద చేసిన తల్లిని కొడుకు వద్దనుకొని వదిలించుకున్నప్పటికి తల్లి ప్రేమ మాత్రం ఆ బిడ్డ కోసం తల్లడిల్లిపోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు కొడుకు వివరాలు తెలుసుకుంటున్నారు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Karimnagar, Telangana News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు