హోమ్ /వార్తలు /తెలంగాణ /

Ac water Fight: ఏసీ నీళ్లు ఇంటిపై పడుతున్నాయంటూ కత్తితో దాడికి దిగిన పక్కింటి వ్యక్తి.. చివరికి

Ac water Fight: ఏసీ నీళ్లు ఇంటిపై పడుతున్నాయంటూ కత్తితో దాడికి దిగిన పక్కింటి వ్యక్తి.. చివరికి

పెద్దపల్లిలో ఏసీ వివాదం

పెద్దపల్లిలో ఏసీ వివాదం

పెద్దపల్లి జిల్లాలో చిన్ని ఏసీ వివాదం ముగ్గురి ప్రాణాల మీదకు తెచ్చింది. గోదావరిఖని హనుమాన్ నగర్ లో మురళికి మామిడాల పోశంకి మధ్య ఈ గొడవ జరిగింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Karimnagar, India

  పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో చిన్ని ఏసీ వివాదం (AC Dispute) ముగ్గురి ప్రాణాల మీదకు తెచ్చింది. గోదావరిఖని హనుమాన్ నగర్ లో మురళికి మామిడాల పోశంకి మధ్య ఈ గొడవ జరిగింది. మామిడాల పోశం ఇంటిలో ఏసీ ఉంది. అయితే ఆ ఏసీ ఆన్​ చేసినపుడు నీరు వచ్చి నేరుగా మురళి ఇంటి వైపు పడుతోంది. దీంతో మామిడాల పోశంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు మురళీ. ఇది చినికి చినికి గాలివానలా మారి ఏకంగా దాడికి దిగే వరకు వచ్చింది.  మామిడాల పోశంపై ఆగ్రహంతో కత్తి (Knife) తో దాడికి దిగాడు మురళి. ఈ ఘటనలో మామిడాల పోశం, అతని మనవడు సాయి కిరణ్ తో పాటుగా గొడవ అడ్డుకున్న శేఖర్ కి గాయాలు అయ్యాయి.. పొశం, సాయి కిరణ్ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

  పెద్దపల్లిలో ఏసీ వివాదం

  వెయ్యి కోసం..

  ఇటీవలె ఏపీలో (Andhra Pradesh) 9 ఇలాంటి ఘటనే జరిగింది. గుంటూరులో రూ. వెయ్యి విషయంలో నెలకొన్న వివాదం లో ఓ వృద్ధురాలు అనుమానాస్పద స్ధితిలో మృతి చెందింది. ఈ ఘటనపై నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాసరావుపేటకు చెందిన జానకి చీరల వ్యాపారం చేస్తుంది. శివరాంనగర్కు చెందిన ఓ మహిళ ఆమె వద్ద రూ.2 వేలు ఖరీదు చేసే చీర కొనుగోలు చేసింది. రూ. వెయ్యి చెల్లించి మిగిలిన డబ్బులు తర్వాత ఇస్తానని చెప్పింది. కొద్దిరోజుల తర్వాత గత నెల 24న జానకి తన అత్త అన్నమ్మను ఆ డబ్బులు తీసుకు రమ్మని పంపించింది.

  డబ్బులు అడగడానికి వెళ్లిన అన్నమ్మ పై చీర కొనుగోలు చేసిన మహిళ, ఆమె భర్త గొడవ పెట్టుకొని నెట్టేయడంతో అన్నమ్మ కింద పడింది. దీంతో మణికట్టు విరగడంతోపాటు కంటి పైభాగాన గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే జానకి అక్కడకు వచ్చి తన అత్త అన్నమ్మను జీజీహెచ్కు తీసుకువెళ్లారు. జరిగిన ఘటనపై నగరంపాలెం పోలీసులకు గత నెల 31న ఫిర్యాదు చేశారు. చికిత్స తీసుకున్నాక అన్నమ్మకు ఆరోగ్యం కొంత కుదుటపడటంతో ఈనెల 5న ఇంటికి వచ్చారు. మందులు వాడుకుంటూ ఉన్న ఆమెకు ఈనెల 8న నోటి నుంచి రక్తం వచ్చి స్పృహ తప్పి పడిపోయింది. ఈ క్రమంలో చనిపోయింది. డబ్బులు ఇవ్వమని అడిగిన ఆమెను నెట్టడంతో గాయపడిన ఆమె మృతి చెంది ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ, జానకి ఇచ్చిన పిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు నగరంపాలెం సీఐ హైదరావు . ఇలా క్షణికావేశంలో జరిగే చిన్న చిన్న గొడవలే పలువురి మృతికి కారణాలు అవుతున్నాయి.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Fighting, Peddapalli

  ఉత్తమ కథలు