KARIMNAGAR SIX ARRESTED FOR PLAYING ONLINE RUMMY IN PEDDAPALLI DISTRICT SNR PSE NJ
Peddapalli:ఆన్లైన్ రమ్మీ మొదట మురిపిస్తుంది..తర్వాత ముంచేస్తుంది..!
(మురిపించి..ముంచేస్తుంది)
Peddapalli: ఆన్లైన్ రమ్మీ గేమ్ అందులోనూ రమ్మీ వంటి చట్ట నిషేధ ఆటకు పెద్ద సంఖ్యలో యువత ఆకర్షితులవుతున్నారు. ఆన్లైన్లో ఈజీగా డబ్బు సంపాదించవచ్చు అనే ఆలోచనతో లక్షల రూపాయలను నష్టపోతున్నారు. గేమ్స్ ఆడేందుకు చేసిన అప్పులు తీర్చలేక చివరకు చావు తప్ప వేరే దారి లేదని భావిస్తున్నారు.
ఆన్లైన్ రమ్మీ గేమ్ (Online Rummy game )అందులోనూ రమ్మీ వంటి చట్ట నిషేధ ఆటకు పెద్ద సంఖ్యలో యువత ఆకర్షితులవుతున్నారు. ఆన్లైన్(Online)లో ఈజీగా డబ్బు సంపాదించవచ్చు అనే ఆలోచనతో లక్షల రూపాయలను నష్టపోతున్నారు. గేమ్స్ ఆడేందుకు చేసిన అప్పులు తీర్చలేక చివరకు చావు తప్ప వేరే దారి లేదని భావిస్తున్నారు. రమ్మీ ఆట మొదట్లో కస్టమర్లకే కొంత డబ్బులు వాచ్చేలా చేసి మురిపిస్తుంది. అక్కడే ఉంది చిక్కంతా. డబ్బులు వస్తున్నాయి కదా అని సరదాగా మొదలైన ఆట వ్యసనంగా మారుతుంది. చేతిలో డబ్బులు పోయి అప్పులపాలైన తర్వాత తెలుస్తుంది ఆన్లైన్ రమ్మీ అంటే ఏమిటో. అన్నీ ఆటల్లా కాదు ఈ ఆన్లైన్ రమ్మీ గేమ్‌కి ఒక్కసారి అలవాటు పడితే చాలు దానికి బానిసల్ని చేస్తుంది. చేతిలో డబ్బులే కాదు చివరకు అప్పులు చేసి గేమ్ ఆడేంతలా మార్చేస్తుంది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఆన్లైన్ రమ్మీకి చాలా మంది అడిక్ట్(Addict)అయ్యారని పోలీసు(Police)లే చెబుతున్నారు. కొందరు మాత్రం ముఠాలుగా ఏర్పడి ముగ్గురు ఒకే సారి రమ్మిలోకి లాగిన్ అవుతారు. అవతల వచ్చిన ముగ్గురిని బురిడి కొట్టించి డబ్బులు కాజేస్తారు. పెద్దపల్లి (Peddapalli)జిల్లాలోని ఓ ఫాం హౌస్(Farmhouse)లో ఆన్లైన్ రమ్మీ ఆడుతున్న ఆరుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ల దగ్గర నుంచి 25 ఫోన్లు 3 బైక్‌లు, 30 ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లుగా గోదావరిఖని(Godavarikhani)వన్ టౌన్ సి ఐ రమేష్ బాబు (Ramesh Babu)తెలిపారు.
బ్యాన్ చేసినప్పటికి ఫేక్ జీపీఎస్‌తో..
ఆన్లైన్ రమ్మీకి అలవాటు పడి…జీవితాలు పాడుచేసుకుంటున్న యువతను చూసి…పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆన్లైన్ రమ్మిని బ్యాన్ చేశాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మొదట్లోనే బ్యాన్ చేసాయి. అయినా రమ్మి ఆట కు అలవాటు పడ్డ యువకులు గూగుల్ ప్లే స్టోర్ నుండి ఫేక్ జిపిఎస్ (fake GPS)ను డౌన్లోడ్ చేసి ఇతర దేశాలలో ఉన్నట్లుగా లొకేషన్ ని మార్చుకొని ఆట ఆడుతున్నారు.
పేరెంట్స్‌దే ఆ బాధ్యత..
చట్ట విరుద్దమైన ఆటలు ఆడటం నేరం. అలాంటి వాటికి పాల్పడిన వాళ్లు, వాటిని నిర్వహిస్తున్న వాళ్లు...చివరకు వాటిని ప్రోత్సహిస్తున్న వాళ్లు సైతం చట్టపరమైన శిక్ష అనుభవించక తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే యువత చెడుమార్గంలో వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులే తీసుకోవాలి. పిల్లలు ఏం చేస్తున్నారు ? రోజూ ఎక్కడికి వెళ్తున్నారనే విషయాలపై ఆరా తీస్తూనే వాళ్లకు కౌన్సిలింగ్ ఇవ్వాలని పోలీసులు మరి మరి పేరెంట్స్‌ని హెచ్చరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.