KARIMNAGAR SIRICILLA DISTRICT SP GIVES GOLD CHAIN TO AN OLD WOMAN WHO LOST HER JEWELERY SNR
Siricilla : సిరిసిల్ల జిల్లా ఎస్పీకి ఓ పెద్దావిడ సలాం కొట్టింది .. ఆయన చేసిన సాయం అలాంటిది మరి
(ఎస్పీ సాయం)
Siricilla: ఆయన జిల్లా పోలీస్ బాస్. అయినప్పటికి బాధితురాలి సమస్యను సావదానంగా విన్నారు. పోలీస్ నేస్తం అనే కార్యక్రమంలో ఓ వృద్ధురాలు తన ఆవేదన వ్యక్తం చేయడంతో చలించి ..తన సొంత డబ్బుతో ఆమెకు న్యాయం చేసి ఆమె ముఖంలో నవ్వులు పూయించారు.
పోలీస్ డిపార్ట్మెంట్(Police Department)లో పని చేసే చాలా మందిలో కఠినత్యం, క్రూరత్వమే కాదు..ప్రేమ, కరుణ, జాలి ఉంటాయని సిరిసిల్ల(Siricilla)జిల్లా ఎస్పీ తెలియజేశారు. తన ఓ బాధితురాలి తన సమస్యను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లడంతో పరిష్కరిస్తానని మాటివ్వడమే కాకుండా...తన సొంత డబ్బుతో ఆమెకు న్యాయం చేసి ఎస్పీ సార్ సూపర్ అనిపించుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే(Rahul Hegde). కమ్యూనిటీ పోలీసింగ్(Community policing)పేరుతో సిరిసిల్ల జిల్లాలోని మారుమూల గ్రామమైన తెనుగువారిపల్లె(Tenuguvaripalle)లో ఎస్పీ రాహుల్ హెగ్డే పోలీస్ నేస్తం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమానికి హాజరైన సమయంలో జిల్లా పోలీస్ అధికారి తన గొప్ప మనసును చాటుకున్నారు.
సమస్యపై స్పందించిన ఎస్పీ..
పోలీసుశాఖలో కింది స్థాయి ఉద్యోగి నుంచి పైస్థాయి అధికారి వరకు ప్రజలకు ఒక రకమైన భయం ఉంటుంది. ఏదైనా ఫిర్యాదు చేయాలన్నా..తమ గోడు చెప్పుకోవాలన్నా స్టేషన్ మెట్లు ఎక్కడానికి ఎక్కువ మంది సాహసించరు. కాని సిరిసిల్ల జిల్లా తెనుగువారిపల్లె గ్రామానికి చెందిన వృద్ధురాలు నేరుగా తన కంప్లైంట్‌ని జిల్లా పోలీస్ అధికారితోనే చెప్పుకుంది. గ్రామంలో పోలీస్ నేస్తం కార్యక్రమం నిర్వహించారు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. ఆ కార్యక్రమానికి వచ్చిన వృద్ధురాలు గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకకు వెళ్లిన సమయంలో తన మెడలోని బంగారు గొలుసును ఎవరో దొంగిలించారని ఎస్పీతో తన ఆవేదన చెప్పుకుంది.
వృద్దురాలికి ఎస్పీ కానుక..
ఎలాంటి ఆదాయం వచ్చే మార్గం లేని ఓ పేద వృద్ధురాలు తన గొలుసు పోయిందని పోలీస్ నేస్తం కార్యక్రమంలో చెప్పడంతో ఎస్పీ రాహుల్ హెగ్డే చలించిపోయారు. తానే ఓ బంగారు గొలుసు చేయించి స్వయంగా ఇస్తానంటూ పెద్దావిడకు మాటిచ్చారు ఎస్పీ. ఇచ్చిన మాట ప్రకారం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే బంగారు గొలుసు చేయించారు. తానే స్వయంగా పెద్దావిడకు అందజేయాలని తెనుగువారిపల్లె గ్రామ సర్పంచ్ చంద్రారెడ్డి సమక్షంలో గొలుసును అందజేశారు.
పోలీసులకు అవ్వ దీవెనలు..
జిల్లా పోలీస్ బాస్ ..ఓ వృద్ధురాలి గోడును ఆలకించడం, ఆమె సమస్యను పరిష్కరించడం కోసం తన సొంత డబ్బుతో గోల్డ్ చైన్ చేయించి ఇవ్వడంతో వృద్ధురాలు ముఖం ఆనందంతో వెలిగిపోయింది. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తనపై చూపించిన ప్రేమకి ఆనందభాష్పాలు రాల్చింది. ఎస్పీకి సలాం కొట్టి పోలీసులు చల్లగా ఉండాలని దీవించింది. పోలీసులు తన పట్ల చూపిన ప్రేమకి రుణపడి ఉంటానని తెలిపింది. ఎస్పీ చేసిన సాయానికి గ్రామస్తులు సైతం పోలీసుల దయాగుణాన్ని చూసి అభినందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.