హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana News: అగ్గిపెట్టెలో అంగీ, లుంగీ.. ఆ కళాకారుడి ప్రతిభ అమోఘం..

Telangana News: అగ్గిపెట్టెలో అంగీ, లుంగీ.. ఆ కళాకారుడి ప్రతిభ అమోఘం..

అగ్గిపెట్టెలోని అంగీ, లుంగీని చూపుతున్న దృశ్యం

అగ్గిపెట్టెలోని అంగీ, లుంగీని చూపుతున్న దృశ్యం

Telangana News: అగ్గిపెట్టెలో పట్టే చీరలను తయారు చేయడం అనేది మామూలు విషయం కాదు. అలాంటి ప్రతిభ ఉన్న చేనేత కార్మికులు సిరిసిల్లలో ఉన్నారు. అక్కడ ఓ చేనేత కళాకారుడు అగ్గిపెట్టెలో దూరే షర్ట్‌తోపాటు లుంగీని తయారుచేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

  భారత స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా విదేశీ వస్త్రాల ను బహిష్కరించాలన్న లక్ష్యంతో స్వదేశీ ఉద్యమం చేనేత రంగంతో మొదలైంది. కలకత్తా టౌన్‌ హాల్‌లో 1905 ఆగస్టు 7న భారీ సమావేశం నిర్వహించి, విదేశీ వస్త్రాలను బహిష్కరించి, స్వదేశీ వస్త్రాలు ధరించి దేశీయోత్పత్తుల పునరుద్ధరణకు పిలు పునిచ్చారు. అప్పటి స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన చేనేత రంగానికి గుర్తింపునిస్తూ ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. చేనేత రంగం విశిష్టతను తెలియజేస్తూ కార్మికుల గౌరవాన్ని ప్రతిబింబించేలా జాతీయ స్థాయిలో ఏటా చేనేత కార్మికులకు సంత్‌కబీర్‌ అవార్డులను అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చేనేత వస్త్రాల ఎగుమతిలో 90 శాతం భారతదేశం భాగస్వామ్యం ఉండటం విశేషం. చేనేత బ్రాండ్‌గా భారతదేశాన్ని నిలిపేందుకు మద్రాసు విశ్వవిద్యాలయం సెనెట్‌ భవనంలో ప్రధాని, రాష్ట్రపతి చేనేత వస్త్రాల ప్రదర్శనను ప్రారంభించారు. అయితే తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో ప్ర‌తి సంవ‌త్స‌రం జాతీయ‌ చేనేత దినోత్స‌వాన్ని ( National Handloom Day ) తెలంగాణ‌లో ఘ‌నంగా జ‌రుపుకుంటున్నాం అని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

  తెలంగాణ నేత‌న్న‌ల‌కు దేశంలో ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. న‌గ‌రంలోని పీపుల్స్ ప్లాజాలో జాతీయ చేనేత దినోత్స‌వ వేడుక‌ల‌ను ( National Handloom Day ) నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజ‌రై ప్ర‌సంగించారు. చేనేత కార్మికుల‌కు ఉపాధి, ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నాం అని తెలిపారు. ఇదిలా ఉండగా.. చేనేత దినోత్సవం సందర్బంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్‌ మరోసారి తన నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు.

  గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చిత్రాలను పట్టువస్త్రాలపై నేశారు. అతడి ప్రతిభను ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నారు. తాజాగా చేనేత మగ్గంపై ఆయన అగ్గిపెట్టెలో ఇమిడే షర్ట్, లుంగీని నేశాడు. మల్బర్‌ సిల్క్‌ను ఉపయోగించి మగ్గంపై నేసిన ఈ వస్త్రాలు వ్యక్తులు ధరించేందుకు వీలుగా ఉంటాయని హరిప్రసాద్‌ తెలిపారు. వీటి తయారీకి పదిరోజులు సమయం పట్టిందని, వీటిలో షర్ట్‌ 100 గ్రాములు, లుంగీ 140 గ్రాముల బరువు ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా స్థానికులు హరిప్రసాద్‌ ప్రతిభను గుర్తించి అభినందిస్తున్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని వీటిని సిరిసిల్లలో ప్రదర్శించారు.

  Published by:Veera Babu
  First published:

  Tags: Handloom, Karimnagar, Sircilla, Telangana, VIRAL NEWS

  ఉత్తమ కథలు