Social media effect : ఎస్సైతో వివాహిత ఫేస్‌బుక్ ప్రేమ..భర్తకు విడాకులు... చివరికి..?

Social media effect : ఎస్సైతో వివాహిత ఫేస్‌బుక్ ప్రేమ..భర్తకు విడాకులు... చివరికి..?

ఎస్సైతో వివాహిత ఫేస్‌బుక్ ప్రేమ

SI cheating : ఎస్సై ఫేస్‌బుక్‌లో ఓ వివాహితతో పరిచయం పెంచుకుని ,పెళ్లి చేసుకుంటానని చెప్పాడు..దీంతో ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చింది..చివరకు తనకు పెళ్లి అయిందంటూ చెతులెత్తాశాడు సదరు ఎస్సై...

  • Share this:
    సమాజంలో అన్యాయం జరిగితే న్యాయం చేయాల్సిన కొద్దిమంది పోలీసులు ..డిపార్ట్‌మెంట్‌కు అపవాదులు తెస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వచ్చిన మహిళలను లొంగదీసుకుని లైంగికంగా వాడుకుంటున్నారు. ఇక మరికొంతమంది పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్తూ..చివరికి చేతులెత్తేస్తున్నారు. ఇలా తాజాగా ఓ ఎస్సై ఏకంగా వివాహితపై కన్నేసి లోంగదీసుకున్నాడు. తనకు వివాహం కాలేదని అబద్దం చెప్పాడు..అమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు..చివరి మోసం చేశాడు.

    మహిళలు మగాళ్లను గుడ్డిగా నమ్ముతారనే ఒక ప్రచారం సమాజంలో ఉంటుంది. తాజాగా ఓ సంఘటన ఇందుకు తార్కాణంగా నిలించింది..తనకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నా, మరో వ్యక్తితో పరిచయం పెంచుకుంది..ఫేస్‌బుక్ మాయాలో పడి నిండు జీవితాన్ని నాశనం చేసుకుంది. చివరికి నమ్మిన వ్యక్తి మోసం చేశాడని బయటకు వచ్చింది.

    వివరాల్లోకి వెళితే తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వివాహిత తన భర్త ఇద్దరు పిల్లలతో కలిసి రాజధాని హైదరాబాద్‌లో నివాసముంటుంది. అయితే సోషల్ మీడియా ప్రభావంతో సంవత్సరం క్రితం జగిత్యాల జిల్లాలో పనిచేసే ఓ ఎస్సైతో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది..అయితే తనకు పరిచయమైన వ్యక్తి నిజానిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాను గుడ్డిగా నమ్మింది. ఎస్సై చెప్పిన మాటలకు పొంగిపోయింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పిన మాటలకు ఉన్న భవిష్యత్‌ను వదిలి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకుంది.

    సంవత్సరకాలంగా ఎస్సై తనను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఉన్న భర్తకు కాస్త కొద్ది రోజుల క్రితం విడాకులు ఇచ్చింది. దీంతో రెండు నెలల క్రితం ఎస్సై వద్దకు వచ్చింది. అయితే పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఎస్సై తనకు ఇదివరకే పెళ్లి కావడంతో ఆమెను కరీంనగర్‌లో రహస్యంగా ఉంచాడు. అయితే ప్లాన్ ప్రకారమే కరీంనగర్‌లో ఉంచిన ఎస్సై ఆమెను వదిలించుకునేందుకు ప్రయత్నాలు చేశాడు.విషయం తెలిసిన మహిళ మనస్తాపానికి గురైంది..ఆత్మహత్యకు సైతం పాల్పడింది. దీంతో విషయం బయటకు వచ్చింది. సదరు ఎస్సైపై జగిత్యాల డీఎస్పీకి ఫిర్యాదు చేసింది..కాగా ఆరోపణలు ఎదుర్కోంటున్న ఎస్సై సెలవులో వెళ్లినట్టు తెలుస్తోంది.
    Published by:yveerash yveerash
    First published: