(P. Srinivas, News18, Karimnagar)
సాధారణంగా మహిళలు (Women) బల్లులను, బొద్దింకలను చూస్తేనే వామ్మో అని భయపడి ఆమడ దురంలో ఉంటారు .. ఇక పాములను (Snake) చూస్తే ఇంకేమన్నా ఉందా.. భయంతో కిలోమీటర్లు పరిగెత్తుతారు. కానీ, ఒక మహిళ తరతరాలుగా వస్తున్న అనవాయితీ పాములని పట్టడాన్ని (Snake Catcher) వృత్తిగా ఎంచుకొని కుటుంబని పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నది.. అసలు ఆ మహిళా ఎవరు.. ? ఎక్కడ ఉంటది? ఏంటీ ? ఆ మహిళ పై న్యూస్ 18 తెలుగు ప్రత్యేక కథనం..
కరీంనగర్ (Karimnagar) జిల్లా తీగలగుట్టపల్లి గ్రామానికి చెందిన షేక్ సయిదా (Shaik Saida) పాముల పట్టడంలో (Snake Catching) దిట్ట.. తండ్రి నుంచి నేర్చుకున్న విద్య ఆమెకిప్పుడు జీవనోపాధిగా మారింది. పాములను పట్టే విద్యని నేర్చుకొని పాములను పడుతూ జీవనొపాధిని పొందుతోంది. రాత్రనకా పగలనకా ఎక్కడికైనా వెళ్లి ఇట్టే పాములను లొంగదీసుకోవడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. కాలనాగులైనా, విష సర్పాలైనా ఇట్టే పట్టేస్తుంది.
సయిదా పాములని పట్టడం చూసి ముక్కున వేలేసుకోవాల్సిందే. ఆ ప్రాంతంలో పాము వచ్చిందంటే సయిదా కి ఫోన్ రావాల్సిందే.. పగలు రాత్రి అనే తేడా లేకుండా ప్రాణాలని తెగించి పాముని పట్టుకొంటుంది. చిన్నతనం నుంచే పాములని అలవోకగా పట్టుకుంటున్నది. ఇప్పటివరకు సయిదా వేలసంఖ్యలో పాములని పట్టుకుంది. రాత్రివేళలో లైట్లని ఆర్పేసి పాము అలికిడి విని పాములని పట్టుకుంటుంది (Snake Catcher) . ఎలాంటి విష సర్పం అయినా ఏంతో నేర్పుగా పట్టుకోవడం సయిదాకి వెన్నతో పెట్టిన విద్య..
ఎందరో ప్రముఖుల ఇళ్లలో పాములను పట్టుకున్న సయిదాకు ఈ వృత్తి ప్రాణాంతకం అయినా విధిలేక పోట్టకూటి కోసం చేస్తున్నానని చెబుతోంది. ప్రేమ వివాహం చేసుకున్న సయిదా భర్త చనిపోవడంతో పాములని పట్టే (Snake Catcher) బాధ్యత తానే తీసుకుంది.. తన కొడుకుకి నేర్పించిన నాలుగు సార్లు పాము కరిచిందని, ఇళ్ళ నిర్మాణం ఇంకా ఇతర కూలి పనుల కోసం కూడా వెళుతున్నానని ఆమె చెబుతోంది.
Nagarkurnool: ఈ దొంగ మామూలోడు కాదు బాబోయ్.. ఏకంగా ఎస్ఐ ఇంటికే కన్నం వేశాడు..
ఎప్పుడైనా ఎవరికైనా పాము కాటు వేసినా ఆయుర్వేదం వైద్యంతో ప్రాణాలను కూడా కాపాడగలనని చెప్తోంది సయిదా. తనకేమైనా అయితే తనపై ఆధారపడిన తన కుటుంబ సభ్యులు రోడ్డున పడతారని, ఆందోళన వ్యక్తం చేస్తోంది. పాములని ధైర్యంగా పట్టుకుంటున్న తనకు భవిష్యత్తు గురించి బెంగ ఉందని కూడా అంటోంది. అయితే ఇలాంటి వృత్తితో జీవిస్తున్న తనకు ఉండడానికి కిరాయి కి ఇల్లు ఇవ్వడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదని చెప్తోంది ఆమె. డబుల్ బెడ్ రూమ్స్ కి అప్లై చేసుకున్నా కూడా రావడం లేదన ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం. అధికారులు, రాజకీయ నాయకులు తమ బాధని పట్టించుకోని తనకు ఒక ఇల్లు మంజూరు చేయాలనీ బాధ పడుతోంది సయిదా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karimnagar, Snake