(Srinivas P, News18, Karimnagar)
తెలంగాణ (Telangana) రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (BJP Chief Bandi sanjay) కు సొంత పార్టీలో నేతల తీరు తలనొప్పిగా మారుతుందా ? పార్టీకి సంబంధించిన కొందరు సీనియర్ నేతల వ్యవహారశైలిపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారా ? బీజేపీ లో చేరికలకు బండి సంజయ్ ప్రయత్నం చేస్తుంటే , చేరికలను అడ్డుకోవడానికి బండి సంజయ్ వ్యతిరేక వర్గం పని చేస్తోందా ? పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలను కొందరు నేతలు బయటకు లీక్ ఇస్తున్నారా ? సోషల్ మీడియాలో బండి సంజయ్ పై దుష్ప్రచారానికి పార్టీ నేతలు (Party leaders) సహకరిస్తున్నారా ? అంటే అవును అని చెబుతున్నారు బండి సంజయ్ శ్రేణులు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇతర పార్టీ ల నుండి బీజేపీలోకి వలసలు వెల్లువెత్తాయి.
మొదట్లో బండి సంజయ్ దూకుడుగా పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు . అయితే బండి సంజయ్ నాయకత్వాన్ని (Leadership) అంగీకరించలేని కొందరు సీనియర్ నాయకులు పార్టీ కోసం ఆయన చేసే పనులను అడ్డుకునే పనిలో పడ్డారు. దీంతో ప్రతిపక్ష పాత్రను సొంత పార్టీ నాయకులు పోషిస్తున్న పరిస్థితి ఉంది . సోషల్ మీడియాలో బండి సంజయ్ పై తప్పుడు ప్రచారాలు చేయించడంలో కూడా సొంత పార్టీ నేతల పాత్ర ఉన్నట్టు బండి సంజయ్ గుర్తించినట్టు సమాచారం . అంతేకాదు పార్టీ కోసం పని చేస్తున్న తనపై వ్యక్తిగత దాడికి పార్టీ నేతలు సహకరిస్తున్నారని బండి సంజయ్ తీవ్ర ఆవేదనలో ఉన్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే ఆయన పార్టీలో జరుగుతున్న కీలక పరిణామాలపై ఢిల్లీ నాయకుల వద్ద ప్రస్తావించి కొందరు నేతల తీరును ఏకరువు పెట్టారట . పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు బయటకు వెళ్లడం , సోషల్ మీడియాలో ప్రచారం జరగడం తదితర అంశాలపై బండి సంజయ్ అగ్ర నాయకత్వం వద్ద వాపోతున్నారు అని సమాచారం . అంతేకాదు పార్టీలో చేరికలపై జరుగుతున్న ప్రచారాన్ని , కొందరు నేతలు పార్టీలో చేరికలను అడ్డగిస్తున్న వైనాన్ని బండి సంజయ్ అగ్ర నాయకత్వం వద్ద చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం .
పార్టీ కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాల్సిన చోట , సొంత పార్టీ నేతలే తనను అడ్డుకోవడం ఇబ్బందిగా మారిందని బండి సంజయ్ లబోదిబోమంటున్నారు అని తెలుస్తోంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయించిన సమయంలో బండి సంజయ్ సొంత పార్టీలోని కొందరు సీనియర్ నేతలపై అగ్ర నాయకత్వానికి ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది .
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Karimangar, Telangana bjp