Huzurabad: ఈటలకు మంచి పేరు ఉండేది.. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే బాగుండు: వీహెచ్ కామెంట్స్

వి.హనుమంతరావు (ఫైల్ ఫొటో)

హుజురాబాద్‌లో ఉప ఎన్నిక వేడి రాజుకుంది. ప్రధాన పార్టీలన్నీ ఆరోపణలుప్రత్యారోపణలతో పొలిటికల్ హీట్‌ను పెంచుతున్నాయి. హుజురాబాద్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Share this:
    కరీంనగర్: హుజురాబాద్‌లో ఉప ఎన్నిక వేడి రాజుకుంది. ప్రధాన పార్టీలన్నీ ఆరోపణలుప్రత్యారోపణలతో పొలిటికల్ హీట్‌ను పెంచుతున్నాయి. హుజురాబాద్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కి, ఈటలకి వచ్చిన తగాదానే హుజురాబాద్ ఎన్నిక అని ఆయన వ్యాఖ్యానించారు. డబ్బులే డబ్బులు పంచుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ వ్యాప్తంగా ఇవ్వాలని దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశామని, కొన్ని కులాలు అడుక్కుతింటున్నరని వీహెచ్ చెప్పారు. వారికి కూడా ఇవ్వాలని డిమాండ్ చేశామని తెలిపారు. కేసీఆర్‌కి చిత్త శుద్ధి లేదని, 3 ఎకరాలు, దళిత సీఎం అని మోసం చేసారని ఆయన విమర్శించారు.

    మోదీ 15 లక్షలు ఇస్తా అని మోసం చేశారని, మోదీ హయాంలో ధరలు ఆకాశాన్ని అంటాయని.. మోదీ చేసిన ఘనకార్యం ఏంటంటే ప్రపంచం మొత్తం తిరిగి 25 వేల కోట్లు ఖర్చు చేశారని వీహెచ్ దుయ్యబట్టారు. పబ్లిక్ సెక్టార్‌ని అమ్ముతున్నారని విమర్శించారు. ఈటలకి మంచి పేరు ఉండేదని, ఎందుకు బీజేపీకి పోయాడో తెలియదని వీహెచ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం పోరాడాడని, ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే బాగుండని వీహెచ్ తన మనసులో మాటను బయటపెట్టారు. దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీలో చేరితే ఓటు ఎలా వేయాలని ప్రశ్నించారు. అమ్మేస్తే రిజర్వేషన్లు ఉంటాయా.. మోదీ ఏం అభివృద్ధి చేశారని ఆయన నిలదీశారు. ‘బేటీ బచావో.. బేటీ బఠావో’ అంటున్నప్పటి నుంచి రోజుకో రేప్ జరుగుతోందని వీహెచ్ వ్యాఖ్యానించారు.

    ఇది కూడా చదవండి: Huzurabad Bypoll: రంగంలోకి సీఎం కేసీఆర్.. హుజురాబాద్‌లో రోడ్‌షోలు.. ఎప్పుడంటే..

    రైతులకి గిట్టుబాటు ధర కోసం పోరాటం చేస్తున్న వారిని జీపు ఎక్కించి చంపారని, మోదీ డిక్టేటర్‌గా పాలిస్తున్నారని.. బీజేపీ వారిని ప్రజలు నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం అసెంబ్లీలో అబద్ధం ఆడారని, 15 లక్షల రూపాయలు ఏవని ప్రశ్నించారు. పబ్లిక్ సెక్టార్‌లని అమ్మొద్దని మీటింగ్ ఏర్పాటు చేస్తామని, కాంగ్రెస్‌కు మాత్రమే దేశాన్ని పాలించేందుకు అర్హత ఉందని ఆయన చెప్పుకొచ్చారు. డబ్బులు ముఖ్యం కాదని, అందరికి ఓటు ఒక్కటేనని, నిలదీసే గొంతు కాంగ్రెస్‌దేనని ఆయన వ్యాఖ్యానించారు. మోదీ వచ్చాక దేశంలో ఏం అభివృద్ధి జరుగలేదని వీహెచ్ విమర్శించారు.

    శ్రీనివాస్.పి, న్యూస్ 18 తెలుగు కరస్పాండెంట్
    కరీంనగర్ జిల్లా

    Published by:Sambasiva Reddy
    First published: