Home /News /telangana /

Congress-TRS: కాంగ్రెస్ కు భారీ షాక్.. గులాబీ గూటికి కీలక నేత.. ఈ నెల 8న ముహూర్తం..

Congress-TRS: కాంగ్రెస్ కు భారీ షాక్.. గులాబీ గూటికి కీలక నేత.. ఈ నెల 8న ముహూర్తం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Congress-TRS: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు . ఈ నెల 8 న సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు . పీసీసీ ప్రధాన కార్య దర్శితోపాటు వివిధ హోదాల్లో కొనసాగిన ఆయన గత కొద్దికాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు .

ఇంకా చదవండి ...
  (P.Srinivas,News18,Karimnagar)

  సీనియర్ కాంగ్రెస్ నాయకుడు (Congress Leader) , చల్మెడ ఆనందరావు వైద్యకళాశాల చైర్మన్ చల్మెడ లక్ష్మీనర్సింహరావు గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు . ఈ నెల 8 న సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు . పీసీసీ ప్రధాన కార్య దర్శితోపాటు వివిధ హోదాల్లో కొనసాగిన ఆయన గత కొద్దికాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు . సీఎం కుమారుడు , రాష్ట్ర పురపాలక , ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు . టీఆర్ఎస్లో చేరాలని ఆయన అనుచరుల నుంచి ఒత్తిడి రావడం , కేటీఆర్ సానుకూలంగా స్పందించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు . ఈనెల 8 న తెలంగాణ భవన్లో తన అనుచరులతో కలసి టీఆర్ఎస్లో చేరనున్నారు . వేములవాడ అసెంబ్లీ నియోజవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నమనేని రమేశ్ బాబు పౌరసత్వం అంశం ప్రస్తుతం కోర్టులో నానుతుంది.

  Married Women: ముగ్గురు పిల్లల తల్లిపై అలా ఎలా చేయాలనిపించిందయ్యా నీకు.. చివరకు ఏమైందో చూడు..


  2023 న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్న చల్మెడ ఈ మేరకు పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలసింది . చల్మెడ లక్ష్మీనర్సింహారావు స్వస్థలం వేములవాడ నియోజవర్గం పరిధిలోని కోనరావుపేట మండలం మల్కపేట . లక్ష్మీనర్సింహరావు తండ్రి చల్మెడ ఆనంద రావు ఎన్టీఆర్ హాయంలో న్యాయశాఖ మంత్రగా పనిచేశారు . వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ నుండి కాకుండా వేములవాడ నుంచి చేసే ఆలోచనలో ఉన్న లక్ష్మీనర్సింహారవు కాంగ్రెస్ పార్టీలో తన సీనియారిటీని గుర్తించకుండా కొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరు కారణంగా పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు . చల్మెడ చేరిక ద్వారా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాకుండా వేములవాడలో టీఆర్ఎస్కు మరింత బలం చేకూరనుంది .

  Telangana Minister: ఓటమి భయంతోనే ఇలా చేశారు.. కేంద్రంపై మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు..


  చల్మెడ 2009 లో కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి అప్పుడు తెలుగు దేశంపై పోటీ చేసిన గంగుల కమలాకర్ చేతిలో ఓటమి పాలైనారు , అప్పుడు ఆయన 36 వేల ఓట్ల వరకు సాధిం చారు . 2014 లో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన గంగుల కమలాకర్ చేతిలో ఓటమి పాలైనారు . 2018 ఎన్నికల్లో అసెంబ్లీకి మాజీ ఎంపీ పొన్నం పోటీ చేయడంతో ఆయన పోటీకి దూరం గా ఉండాల్సి వచ్చింది . రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రం లో అధికారంలోకి వచ్చిన తరువాత శాసనమండలిని పునరుద్ధరించగా 2007 లో స్థానిక సంస్థల నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీగా పోటీ చేయగా తెలుగుదేశం నుంచి పోటీ చేసిన చెన్నాడి సుధాకర్ రావు చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయా రు .

  Comedian Raghu Karumanchi: మద్యం అమ్ముతున్న కమెడియన్ రఘు.. కారణం ఏంటో తెలుసా..


  రాజకీయంగా సుదీర్ఘ అనుభవం , మేధాసంపత్తి కలిగిన చల్మెడ తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అనుచరుల సూచన మేరకు టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు . చల్మెడ వైద్యకళాశాల , ఆసుపత్రి ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మెడికల్ క్యాంపులు నిర్వహించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు . ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ అధ్యక్షునిగా రెండు పర్యాయాలు పనిచేశారు .

  Bigg Boss 5 Telugu Anchor Ravi Re Entry: యాంకర్ రవి రీ ఎంట్రీ..? బిగ్ బాస్ నిర్వాహకుల ఆలోచన ఇదే..


  తన తల్లి జానకమ్మ పేరుతో ఇరుకుల్లలో బాలుర హాస్టల్ నిర్మాణంకు చేయూత నిచ్చారు.వేములవాడలో వెలమ సంఘం ఆధ్వర్యంలో సత్రం నిర్మాణం కూడ వీరి హాయంలోనే జరిగింది . నిత్యం ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో వివిధ కార్యక్రమాలు నిర్వహించేలక్ష్మీనర్సింహారావును కాంగ్రెస్ పార్టీ సరిగా ఉపయోగించుకోలేక పోయిందని ఇప్పటికే ఆ పార్టీని వీడిన సీనియర్లు అంటుంటారు . అందుకే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారని సీనియర్లు అంటున్నారు.

  మీ నగరం నుండి (కరీంనగర్)

  తెలంగాణ
  కరీంనగర్
  తెలంగాణ
  కరీంనగర్
  Published by:Veera Babu
  First published:

  Tags: Congress, Karimnagar, Trs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు