(P.Srinivas,New18,Karimnagar)
దొంగతనాలు చేయాలనుకునే వారికి కొత్త కొత్త ఐడియాలు వస్తుంటాయి. వాటిని పధకం ప్రకారం చేసుకుపోతూనే ఇంకా డబ్బు కూడబెట్టాలని ఆశపడుతూ ఉంటారు. ఆ దురాశతోనే అడ్డంగా దొరికిపోతారు. కరీంనగర్(Karimnagar)ప్రభుత్వ హాస్పిటల్(Government Hospital)లో వరుసగా దొంగతనాలు జరగడం కలకలం రేపింది. రోగుల బంధువుల వస్తువులతో పాటు పార్కింగ్లోని వాహనాలు, చివరకు స్టాఫ్ వెహికల్స్(Staff Vehicles) కూడా మాయం కావడంతో పోలీసులు(Police) ఈ కేసు పోలీసులతో పాటు ఆసుపత్రి అధికారులకు తలనొప్పిగా మారింది.కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్, మాతా శిశు హాస్పిటల్ పరిస్థితిలో గత కొన్ని రోజులుగా దొంగతనాలు చేస్తోంది బయటి వ్యక్తులు కాదని తేల్చారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సు TVS జుపిటర్(Jupiter)వాహనాన్ని ఎవరో గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేయడంతో కరీంనగర్ టూ టౌన్ పోలీసులు బృందాలుగా ఏర్పడి హాస్పిటల్‌తో పాటు మాతా శిశు హాస్పిటల్లో నిఘా పెట్టారు. స్టాఫ్ నర్సు స్కూటీతో పాటు గతంలో పలు దొంగతనాలకు పాల్పడింది ఎవరో కాదని..రోగుల కేర్ టేకర్(Caretaker)గా కాంట్రాక్టు పద్దతిలో చేరిన ఉద్యోగి వేముల సంపత్ కుమార్(Vemula Sampath Kumar)గా గుర్తించారు. నిందితుడి దగ్గర నుంచి స్టాఫ్ నర్సు TVS జుపిటర్ వాహనంతో పాటు గతేడాది అక్టోబర్(October)నెలలో కూడా మరొక 2 TVS జుపిటర్ వెహికల్స్‌ను దొంగిలించినట్లుగా రాబట్టారు. సంపత్‌కుమార్ దగ్గర నుంచి లక్షా యాభైవేలు విలువ చేసే మూడు TVS జుపిటర్ వాహనాలను స్వాదీనం చేసుకున్నారు. చోరీ చేసిన మరో ఐదు సెల్‌ఫోన్(5Cellphones)ను రికవరీ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఉద్యోగం, దొంగతనాలు ఒకేచోట..
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజ్‌పల్లికి చెందిన వేముల సంపత్‌కుమార్ ఏజిల్ సర్వీసెస్ ద్వారా ప్రభుత్వాసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గతేడాది నుంచి విధులు నిర్వహిస్తూనే ఆసుపత్రికి వస్తున్న వాహనాల్ని మాయం చేస్తున్నట్లుగా తేలడంతో అతడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఆసుపత్రిలోనే చోరీలు చేశాడా లేక ఇతర చోట్ల దొంగతనాలు చేశాడా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
సెక్యురిటీ గార్డ్ ముసుగులో దొంగ..
నిందితుడి దగ్గర బాధితుల ఫోన్లను గుర్తించడంతో ఆసుపత్రి ఉన్నతాధికారులు అతడ్ని వెంటనే విధుల్లోంచి తొలగించారు. అతడి స్థానంలో కొత్తవాళ్లను నియమిస్తామని వైద్యాధికారులు తెలిపారు. ఆసుపత్రిలో జాబ్ చేస్తూ అక్కడి వస్తువులనే మాయం చేస్తున్న దొంగను చాకచక్యంగా పట్టుకున్న కరీంనగర్ టూ టౌన్ పోలీసులను జిల్లా పోలీస్ కమీషనర్ , కరీంనగర్ టౌన్ ఏసీబీ అభినందించారు. ఇలాంటి దొంగతనలకు పాల్పడితే ఎవరిని వదిలిపెట్టేది లేదని హాస్పిటల్ అధికారులు తెలిపారు. సెక్యూరిటీ గార్డ్ ను వెంటనే విధులనుండి తొలగిస్తున్నమని అధికారులు తెలిపారు.తన స్థానంలో కొత్తవారికని తీసుకుంటున్నామని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Karimangar