Home /News /telangana /

KARIMNAGAR SCREAMING SNAKE IN KARIMNAGAR IS IT REAL OR FAKE HERE IS THE FULL DETAILS VB KNR

Fact Check: కరీంనగర్ లో వింత ఘటన.. తలపైకి ఎత్తి అరుస్తున్న పాము..! ఇందులో నెజమెంత..

పాము అరుస్తన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో

పాము అరుస్తన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో

Fact Check: కరీంనగర్ జిల్లాలో ఓ పాము వింత అరుపులు అరుస్తుందన్న విడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఓ వింత పాము జిల్లాలోని రామడుగు మండలం వెలిచాల గ్రామం ఇందిరమ్మ కాలనీలోని నీలగిరి చెట్ల మధ్య పాము అరుస్తోందని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. ఇందులో నెజమెంత..

ఇంకా చదవండి ...
    కరీంనగర్ జిల్లాలో అరిచే పాము కనిపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో ఇందిరమ్మకాలనీలో నీలగిరి చెట్ల మధ్య ఈ పామును గుర్తించారు. దీంతో పామును చూసిన ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.. అంటూ వెలిచాల గ్రామస్తుడు సోషల్ మీడియలో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్ అయింది. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దీనిపై స్థానిక ఎస్సై తాండ్ర వివేక్ స్పందించారు. ఇదంతా అబద్దమని వెల్లడించారు. అసలు నిజం ఏంటంలే.. ఈ వీడియోను నెలరోజుల క్రితం విదేశాలకు చెందిన మైక్ మార్టిన్ అనే యూట్యూబర్ తన ఛానల్‌లో అప్‌లోడ్ చేశాడని ఎస్సై వివేక్ తెలిపాడు. దాన్ని డౌన్‌లోడ్ చేసిన ఓ వ్యక్తి.. వీడియో‌ని వైరల్ చేశాడు. ఆ వీడియోను వెలిచాల గ్రామంలోదిగా పేర్కొంటూ ఆ ఆకతాయి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టు చేశాడని అన్నారు.

    సదరు యువకుడిని విచారిస్తున్నామని, ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్సై వివేక్ తెలిపారు. ఆ వీడియో చూసిన నెటిజన్లు దీనిని ‘ఈస్టర్న్‌ హాగ్‌నోస్‌ స్నేక్‌’ అంటారని.. ఇది కేవలం నార్త్ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుందని కామెంట్ చేస్తున్నారు. ఇది భారత్ లో కనిపించదంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Fact Check, Karimnagar, Snake

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు